
సాక్షి, సూర్యాపేట: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను వెంటనే విడుదల చేయాలని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సూర్యాపేట జిల్లాలో శుక్రవారం ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అయితే అదే సమయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ట్రాపిక్‌లో చిక్కుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ నేతలు మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఆందోళన కారులను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment