ఏవోబీలో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించాలని గురువారం అర్థరాత్రి ప్రజాసంఘాల నేతలు ఆందోళనకు దిగారు.
హైదరాబాద్: ఏవోబీలో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించాలని గురువారం అర్థరాత్రి ప్రజాసంఘాల నేతలు ఆందోళనకు దిగారు. ఎన్టీఆర్ భవన్ వద్ద విరసం నేత వరవరరావు తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. సమావేశం జరుపుకుంటున్న మావోయిస్టు నేతలను కావాలనే కాల్చి చంపారని ఆరోపించారు.
దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని గోషామహల్ స్టేడియంకు తరలించారు. కొద్దిసేపటి తర్వాత వారినందరినీ విడుదల చేశారు.