varavararao
-
హైదరాబాద్ వెళ్లాలంటే ఎన్ఏఐ కోర్టును అడగండి: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: షరతులతో కూడిన మెడికల్ బెయిల్‌పై విడుదలైన విప్లవ రచయిత వరవరరావు హైదరాబాద్‌కు వెళ్లాలంటే అనుమతి కోసం జాతీయ దర్యాప్తు సంస్ధ (ఎన్ఐఏ) కోర్టును అభ్యర్థించాలని సుప్రీంకోర్టు సూచించింది. కంటి చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లడానికి అనుమతి ఇవ్వాలంటూ వరవరరావు దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం కోర్టు విచారించింది. వరవరరావు తరఫు న్యాయవాది ఆనంద్ గ్రోవర్ వాదనలు వినిపించారు. సొంత నివాస స్థలమైన హైదరాబాద్‌లో చికిత్స చేయించుకుంటే ఆ వాతావరణంలో వరవరరావు త్వరగా కోలుకుంటారని తెలిపారు. దీంతో అనుమతి కోసం ఎన్ఐఏ ట్రయల్ కోర్టుకు వెళ్లాలని వరవరరావుకు సుప్రీంకోర్టు సూచించింది. ఇదీ చదవండి: Varavara Rao: వరవరరావుకు ఊరట.. శాశ్వత బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు -
వరవరరావుకు ఊరట
-
వ్యక్తుల నిర్బంధంతో శాంతి సాధ్యమేనా?
కొత్త కోణం ‘‘ప్రజలే చరిత్ర నిర్మాతలు. సమస్యలు సృష్టించిన భౌతిక పరిస్థితులను మార్చడానికి ప్రజలు సాగించే ప్రయత్నాల నుంచే ఉద్యమాలు ఉద్భవిస్తాయి. ఆ ఉద్యమాల నుంచి, ప్రజాశ్రేణుల నుంచే నాయకులు పుడతారు. ఆ నాయకులే ఉద్యమాలకు ఊపిరిలూదుతారు. అంతేగానీ, ఎవరో కొందరు నాయకుల వల్లనే ఉద్యమాలు రావు. ప్రముఖ చరిత్ర కారుడు ఇ.హెచ్.కార్ చెప్పిన సత్యాలివి. ఇదే చరిత్ర. వర్తమానం. భవిష్యత్తు కూడా. అయితే రాజులు, చక్రవర్తులు, ప్రజా స్వామ్య ప్రభుత్వాలు సైతం వాళ్ళు సృష్టించిన సమస్యలను, సామాజి కార్థిక పరిస్థితులను చక్కదిద్దడానికి బదులు, ఉద్యమాలను అణచి వేయడానికి ఎన్ని ప్రయత్నాలైనా చేస్తారు. చివరకు ఎంతటి అమాను షాలకైనా ఒడిగడతారు. అంతిమంగా ప్రజానాయకులను నిర్బంధిస్తే, నిర్మూలిస్తే ఉద్యమాలు సమసిపోతాయని భ్రమిస్తారు. చరిత్ర నిండా ఇవే సాక్ష్యాలు. సంవత్సరంన్నర క్రితం భీమా కోరేగావ్ కేసులో నిర్బంధించిన ప్రముఖ విప్లవ కవి వరవరరావు నిర్బంధం కూడా సరిగ్గా ఇదేకోవకు చెందింది. ఆకలిగొన్న జనం ఆఖరి అస్త్రమే ఉద్యమం. ప్రభుత్వాల, పాలకుల నిర్లక్ష్యం కారణంగా విసిగివేసారిన తాడిత, పీడిత జనం పక్షాన ఆ ఆఖరి క్షణం వరకూ నిలవాలన్నదే బహుశా విప్లవకవి వర వరరావు కల. ఆయన కలలో సైతం ప్రజల గొంతుకై పలవరించారు. ఆయన గొంతు పాలకుల నిజస్వరూపాలను పట్టిచ్చిన జనవాక్కు అయివుండవచ్చు. ఆయన వాక్కు కత్తికన్నా పదునైన ఆయుధమే అవ్వొచ్చు. కానీ ఏ ప్రభుత్వాన్నీ కూల్చే కుట్రలు మాత్రం ఆయన చేయలేదు. 81 ఏళ్ళ సుదీర్ఘజనజీవన యానంలో, ఈ పాలకుల కళ్ళు గప్పి ఆయన ఏ ఆయుధాలూ పట్టిందీ లేదు. ఆయన ప్రతికదలికనూ ప్రభుత్వాల వేనవేల నిఘానేత్రాలు వెంటాడని క్షణం అంతకన్నా లేదు. నిత్యసంఘర్షణనీ జనం పునాదిగానే సాగించారు. నిత్యం జనం మధ్యనే నిలిచిపోరాడారు. నిజానికి వరవరరావు ఏ ఆయుధాలతోనో, ఎక్కడో అడవుల్లోనో దొరికినవాడు కాదు. గత యాభై ఏళ్ళకుపైగా తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరిస్తూ, నోరులేని ఆదివాసీల పక్షాన, దళితుల పక్షాన, సాధారణ జనం పక్షాన కవిత్వం రాస్తూ, రచనలు చేస్తూ, జనమే శ్వాసగా జీవిస్తున్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎందరు భయపెట్టినా, ఏనాడూ తన మార్గాన్ని వీడలేదు. నిర్బంధాలకు వెరువక, నిర్భీతితో, అత్యంత ప్రజాస్వామ్యయుతంగా పాలకులపై తన ప్రశ్నలను సంధిస్తున్నారు. ఆయన ఆచరించిన, ఆచరిస్తున్న సిద్ధాంతం పట్ల ఎవరికైనా వ్యతిరేకత ఉండవచ్చు. నచ్చకపోవచ్చు. దానికి అభ్యంతరం లేదు. ఆయన అభిప్రాయాలను విభేదించే వాళ్ళు, దానిని వాళ్ళ ఆచరణతో, వాళ్ళు అనుసరిస్తోన్న సిద్ధాంతాలతో ఎదుర్కోవాలి. అంతిమంగా ప్రజలను గెలుచుకోవాలి. కానీ ఎనభై ఏళ్ళ వయస్సులో, ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో, చివరకు ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారి కోవిడ్–19 బారిన పడిన తర్వాత కూడా ఆయనను ఇంకా ఖైదీగా చెరలో ఉంచుకోవడం ఎంత మాత్రం మానవీయత అనిపించుకోదు. ప్రపంచ దేశాల్లోని ఖైదీలను కోవిడ్ కారణంగా విడిచిపెడుతోంటే, వరవరరావు లాంటి ప్రాణాపాయంలో ఉన్న 80 ఏళ్ళుపైబడిన ప్రజానాయకుడిని జైల్లో నిర్బంధించి, కుటుంబ సభ్యులను కూడా కలవనీయకపోవడం ఆయన జ్ఞాపకాలను కూడా చెరిపెయ్యాలన్న ఆలోచన తప్ప మరొకటి కాదు. వరవరరావు పట్ల ప్రభుత్వం, పోలీసులు ఇంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడానికి కారణం ఎంత మాత్రం హేతుబద్ధమైనది కాదు. ఆయన ఎనభై ఏళ్ళు దాటిన వ్యక్తి. ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన మాటలు తడబడుతున్నాయి. జ్ఞాపకశక్తిని కోల్పోతున్నారు. జీవిత సహచరినే గుర్తించలేని స్థితి, ఇలాంటి స్థితిలో ఆయన్ను బంధించి ఉంచడంలో అర్థం ఏముంటుంది. ఇంకా ఆయనను ప్రభుత్వం ప్రమాదకారిగా భావించడంలో అర్థం లేదు. అలాగే 90 శాతం శారీరక వైకల్యం కలిగిన సాయిబాబను కూడా నిర్బంధించడం దారుణం. వ్యక్తుల వల్ల ఉద్యమాలు రావు, నాయకుల మాటలతో, రాతలతో ప్రజలు ఆయుధాలు పట్టుకోరు. ఏ ఉద్యమానికైనా భౌతిక పరిస్థితులే కారణం. ఏ వ్యక్తీ ప్రాణాలను ఫణంగా పెట్టి అడవుల్లో ఉంటూ, పోలీసులను, సైనికులను ఎదుర్కొని పోరాడాలని అనుకోడు. అలా ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వారు తమ కోసం అడవిబాట పట్టలేదు. సర్వసుఖాలనూ తృణప్రాయంగా వదులుకొని చావుకైనా సిద్ధమవ్వడమంటేనే నిస్వార్థపరత్వమని అర్థం. అలాంటి వారు ప్రజలకోసం అడవిబాట పడితే, ఆయుధ మార్గాన్ని ఎంచుకుంటే, చేతనైతే ఆ సమస్యలకు పరిష్కారాన్ని ఆలోచించాలి. ప్రజలు మంచి జీవితాన్ని కోరుకుంటారు. అందరికీ సమాన హక్కులుండాలని కోరుకుంటారు. మనుషులంతా చట్టం ముందు ఒక్కటేనని భావిస్తారు. అది అబద్ధమని రుజువైన రోజు ప్రజలకు పాలకుల మీద విశ్వాసం పోతుంది. అందుకే ప్రభుత్వాలే ఈ పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది ఏ ఒక్క ప్రభుత్వం చేసిన తప్పు కాదు. ప్రస్తుత ప్రభుత్వాలతో పాటు గతంలో పాలించిన అన్ని కేంద్ర ప్రభుత్వాలు నక్సలైట్ ఉద్యమాన్ని కేవలం శాంతి భద్రతల సమస్యగా పరిగణించి, అసలు సమస్య పరిష్కారాన్ని దాటవేశాయి. నక్సలైట్ ఉద్యమం ఈనాటిది కాదు గత యాభైయ్యేళ్ళ క్రితం ప్రారంభమైంది. ఇప్పటి సగం జనాభాకు దాని ఆవిర్భావం తెలియదు. అయితే నక్సలైట్ ఉద్యమం నక్సల్బరిలో ప్రారంభమయ్యే నాటికే శ్రీకాకుళం, తెలంగాణల్లోని కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ప్రజా ఉద్యమంగా మారింది. శ్రీకాకుళం జిల్లాలో 1967 ప్రాంతంలో ఆదివాసులు ఎదుర్కొంటున్న షావుకార్ల దోపిడీ, భూస్వాముల అణచి వేత, గిరిజనుల భూములను రకరకాల పేర్లతో లాక్కోవడం జరిగింది. ఉద్దానంలో భూస్వాములు పేద ప్రజల భూములను దురాక్రమణ చేశారు. దీంతో అక్కడి ప్రజలు భూస్వాములపై తిరగబడ్డారు. అప్పుడే చదువుకొని, కమ్యూనిస్టు భావజాలంతో చైతన్యవంతమైన యువతరం, ప్రత్యేకించి ఉపాధ్యాయ వర్గం ఆదివాసుల పక్షాన నిలబడింది. యావత్ దేశానికే ఈ ఉద్యమం స్ఫూర్తినిచ్చింది. ముందుగా ప్రజలు ఆయుధాలు పట్టుకోలేదు. ఒక ఊరేగింపుపై భూస్వాములు చేసిన దాడిలో ఇద్దరు కార్యకర్తలు కోరన్న, మంగన్నలు చనిపోయారు. ఆ తరువాతనే ఉద్యమాలకు ఆయుధాల అవసరం ఏర్పడింది. ఆత్మరక్షణ కోసం వారు ఆయుధమార్గాన్ని అనుసరించారు. అప్పటికి ప్రజల దగ్గరున్న ఆయుధాలు బరిసెలు, కొడవళ్ళే, వాటితోటే ప్రజలు పోలీసులపై, పాలకులపై తిరగబడ్డారు. ప్రజాఉద్యమం సాయుధంగా మారిన సందర్భాలను ఎందరో చరిత్రకారులు రికార్డు చేశారు. అదే కాలంలో కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో దొరలు, భూస్వాములు కులవివక్ష, అంటరానితనం పాటిస్తూ, అన్ని రకాల వృత్తుల వారినుంచి వెట్టిచాకిరీ చేయించుకోవడం పరిపాటి. మహిళలపై అత్యా చారాలు నిత్యకృత్యంగా మారాయి. 1974–75 ప్రాంతంలో ప్రజలే ముందుగా తిరుగుబాటు చేశారు. అందుకు సిరిసిల్ల ప్రాంతంలోని నిమ్మపల్లి, జగిత్యాల ప్రాంతంలోని మద్దునూరు గ్రామాల ప్రజలు తిరుగుబాట్లే దానికి సాక్ష్యం. ఆ ప్రాంతంలో చదువుకున్న యువకులు నక్సలైట్ రాజకీయాలకు ఆకర్షితులయ్యారు. నక్సలైట్ పార్టీల నాయకత్వంలో తిరుగుబాట్లు చేశారు. వేలాది మంది ప్రజలు ఈ ఉద్య మంలో మమేకం అయ్యారు. దానికి తట్టుకోలేని భూస్వాములు గ్రామాలను వదిలి పట్టణాలకు పారిపోయారు. దీంతో అప్పటి కాంగ్రెస్ నాయకత్వంలోని చిన్నారెడ్డి ప్రభుత్వం 1978 అక్టోబర్‌లో ఆ ప్రాంతాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించింది. దీంతో గ్రామ గ్రామాన పోలీసులు క్యాంపులు వెలిశాయి. వేలాది మందిని అరెస్టు చేశారు. వందలాది మంది యువకులు పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్ళారు. దీంతో నక్సలైట్ పార్టీలు తమ ఉద్యమాన్ని అజ్ఞతంలో ఉంటూ నడపడం మొదలు పెట్టాయి. 1979, 80 వచ్చే సరికి పోలీసుల దాడులతో పాటు ఎన్కౌంటర్లు మొదలయ్యాయి. నక్సలైట్ సంస్థలు కూడా ఆయుధాలు పట్టినట్టు ప్రకటించుకున్నాయి. క్రమంగా ఉద్యమం ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోని గడ్చిరోలికి విస్తరించడానికి ఇంద్రవెల్లి సహా అనేక ఘటనలు కారణమయ్యాయి. దీనర్థం నక్సలైట్ ఉద్యమం ఆవిర్భావానికి, విస్తరణకు భౌతిక పరిస్థితులే కారణం. అంతే కానీ ఏ ఒక్క వ్యక్తీ కారణం కాదు. నక్సలైట్ ఉద్యమానికి మద్దతిస్తున్న వాళ్ళను అరెస్టు చేస్తున్న ప్రభుత్వం ప్రస్తుతం కొనసాగుతున్న నక్సలైట్ కార్యకలాపాలతో పాటు, గతంలో జరిగిన పరిణామాలన్నింటినీ సమీక్షించుకొని, ప్రజావసరాలకు తగినట్టుగా తమ పాలనను మరల్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికీ దేశంలో చాలా ప్రాంతాల్లో దళితులు, ఆదివాసుల్లో ఎంతో నిరాశా, నిస్పృహలు చోటు చేసుకొని ఉన్నాయి. ఆ అసంతృప్తి ఎటువైపు దారితీస్తుందో తెలియదు. అందుకే ప్రభుత్వాలు సమస్యల పరిష్కారానికి దృష్టి పెట్టాలే కానీ, వాటివల్ల ఉద్భవించిన ప్రజాఉద్యమాలను అణచివేసే ప్రయత్నం చేస్తే సమస్య పరిష్కారం కాకపోగా, మరింత జటిలమౌతుందన్నది చరిత్ర చెప్పిన సత్యం. వ్యక్తులను నిర్బంధిస్తేనో, వ్యక్తులపై ప్రతీకార చర్యలకు పాల్పడితే చరిత్ర క్షమించదు. ఎమర్జెన్సీ చీకటి రోజులకు కారణమైన ఇందిరాగాంధీ పేరు పక్కన ఆ మరక ఎప్పటికీ మిగిలే ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వాలు కూడా ఆ పాపం మూటగట్టుకోకూడదనుకుంటే ప్రజాపోరాట యోధుడు, అపర మేధావి, అలుపెరుగని శ్రామికజనపక్షపాతి వరవరరావుని తక్షణమే విడుదల చేయాలి. ఇదే విషయాన్ని ప్రపంచదేశాల్లోని మేధావులెందరో ప్రత్యక్షంగా డిమాండ్ చేశారు. దేశవిదేశాల్లోని 140 మంది మేధావులు, తాత్విక వేత్తలు, నలభైమంది రచయితలు, కవులు వరవర రావుని విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికైన ప్రభుత్వం ఈ విజ్ఞప్తిని అంగీకరించి వరవరరావుని తక్షణం విడుదల చేస్తే శత్రువుని సైతం చేతచిక్కితే హాని కలిగించరాదని నమ్మే ఈ దేశం, ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబడాల్సిన పని ఉండదు. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 మల్లెపల్లి లక్ష్మయ్య -
తెలంగాణ ఏజెన్సీలో అలజడి
-
తెలంగాణ బంద్..అడవుల్లో హై అలర్ట్!
-
తెలంగాణ బంద్: అడవుల్లో హై అలర్ట్
సాక్షి, ఆదిలాబాద్ : ప్రజాకవి, విరసం నేత వరవరరావును విడుదల చేయాలని కోరుతు శనివారం తెలంగాణ బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ పటిష్టం చేశారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. ఏజెన్సీ ఏరియాల్లో ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ప్రాణహిత, గోదావరి పరివాహక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించిన బలగాలు.. డ్రోన్ కెమెరాలు ఉపయోగించి ఆ ప్రాంతాలను వారి గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా అనుమానితులపై ప్రత్యేక నిఘా పెట్టి ఉంచారు. మంచిర్యాల-మహారాష్ట్ర ప్రాంతాలపై కోటపల్లి, వెమనపల్లి, నీల్వయి ప్రాణహిత, గోదావరి పరివాహక ప్రాంతాల్లో 3 రోజులుగా పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. సరిహద్దుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు, సాయుధ దళాల సంచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టు అధికార పార్టీ ప్రతినిధి జగన్ రాష్ట్ర కార్యదర్శి పేరిట ఈ నెల 25 న బంద్ పిలుపునిచ్చారు. ఈ నెల 28 నుంచి అమరవీరుల సంస్మరణ సభలు నిర్వహించాలని ప్రకటనలు వెలువడ్డ నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. రామగుండం సీపీ సత్యనారాయణ అధ్వర్యంలో జిల్లా డీసీపీ, ఏసీపీలతో పాటు మొత్తం 500 మంది స్పెషల్ పార్టీ, క్యాట్ పార్టీ, గ్రేహౌండ్స్ బలగాలు ప్రాణహిత పరివాహక గ్రామాల్లోని అడవులను జల్లెడ పడుతున్నారు. అలాగే సీఐ, ఎస్పై, సీఆర్పీఎఫ్ బలగాలు, సివిల్ పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. కొత్త వ్యక్తులను గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు ఆయా గ్రామస్తులను కోరారు. సరిహద్దు ప్రాంతాల్లో నిరంతరం నిఘా ఉంటుందన్నారు. ప్రాణహిత, గోదావరి పరివాహక ప్రాంతాలలో నిరంతరం నిఘా కోసం సీసీ కెమెరాలను అలాగే డోన్ కెమెరాలను వాడుతున్నట్టు అధికారులు తెలిపారు.మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా నుంచి మావోలు నది దాటి వచ్చే అవకాశం ఉన్నందున అపరిచిత వ్యక్తులపై దృష్టి సారించామన్నారు. సరిహద్దు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రజలను అప్రమత్తం చేశారు. -
మావోయిస్టులను తరిమేస్తాం: ఎస్పీ హెచ్చరిక
సాక్షి, కొమురం భీం, ఆసిఫాబాద్: మావోయిస్టులను జిల్లా అటవీ ప్రాంతం నుంచి తరిమి వేస్తామని, వారి ఆగడాలను తిప్పి కొట్టేందుకు పోలీసు దళాలు విస్తృత చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ విష్ణు వారియర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికైనా మావోయిస్టులు తమ తీరును మార్చుకుని ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. వెంటనే లొంగిపోయిన వారికి అన్ని విధాలా జీవనోపాధికి సహకరిస్తామని, కుటుంబంతో కలిసి సంతోషంగా జీవించవచ్చని పేర్కొన్నారు. మావోయిస్టులకు ప్రజలు ఎవరు సహకరించవద్దని, వారి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలపాలని కోరారు. సమాచారం తెలిపిన వారికి వారి వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటు వారికి తగిన బహుమతులు ఇస్తామని పేర్కొన్నారు. ఈనెల 25న తెలంగాణ బంద్ ములుగు జిల్లా వెంకటాపురం మండలం విజయపురి కాలనీ చర్ల- వెంకటాపురం ప్రధాన రహదారిపై పట్టపగలే వెలిసిన మావోయిస్టులు పోస్టర్లు కలకలం రేపాయి. తెలంగాణ రాష్ట్ర కమిటీ సిపిఐ మావోయిస్టు పేరుతో వెలసిన ఈ పోస్టర్లలో.. విరసం నేత వరవరరావు, వికలాంగుడైన సాయిబాబాలతో పాటు మిగతా 12 మందిని విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. వారిపై పెట్టిన కేసులని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. అంతేకాకుండా అడవుల నుంచి గ్రేహాండ్స్ బలగాలను ప్రభుత్వం తక్షణమే ఉప సంహరించుకోవాలని లేఖలో పేర్కొన్నారు. -
వరవరరావుకు కరోనా పాజిటివ్
-
ఎన్ఐఏకు కోరెగావ్ కేసు
పుణే: 2018 కోరెగావ్–భీమా అల్లర్ల కేసు పుణే పోలీసుల నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు బదిలీ అయింది. ఈ మేరకు తమకు కేంద్ర హోంశాఖ నుంచి శుక్రవారం సమాచారం వచ్చినట్లు మహారాష్ట్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజయ్ తెలిపారు. 2018లో చెలరేగిన కోరెగావ్–భీమా అల్లర్ల కేసులో వామపక్ష నేతలు వరవరరావు, సుధీర్ ధావలే, రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్, మహేశ్ రౌత్, షోమా సేన్, అరుణ్ ఫెరీరా, వెర్నాన్ గొన్సాల్వెస్, సుధా భరద్వాజ్‌లను అర్బన్ నక్సల్స్ పేరుతో అరెస్ట్ చేయడం తెల్సిందే. గత బీజేపీ ప్రభుత్వంలో కోరెగావ్–భీమాపై పెట్టిన కేసును తిరగదోడితే తమ బండారం బయటపడుతుందనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మండిపడ్డారు. -
హైదరాబాద్: విరసం నేత వరవరరావు అరెస్ట్
-
విరసం నేత వరవరరావు అరెస్ట్
పుణే, న్యూఢిల్లీ, ముంబై, రాంచీ, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రముఖ పౌర హక్కుల నేతలు, మావోయిస్టు సానుభూతిపరుల అరెస్టులు సంచలనం సృష్టించాయి. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అనుమానంతో ఏకకాలంలో వారి నివాసాలపై పుణే పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. గతేడాది డిసెంబర్లో మహారాష్ట్రలోని కోరెగావ్–భీమాలో చెలరేగిన హింసాత్మక ఘటనల కేసు విచారణలో భాగంగా ఈ దాడులు కొనసాగగా.. విరసం నేత వరవరరావు, హక్కుల కార్యకర్తలు సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, వెర్నన్ గొంజాల్వెజ్, గౌతం నవలఖాల్ని పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఈ అరెస్టుల్ని మానవ హక్కుల పరిరక్షణ కార్యకర్తలు, అభ్యుదయ రచయితలు, న్యాయవాదులు తీవ్రంగా తప్పుపట్టారు. ఈ చర్యలు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని, ప్రజామద్దతు కోల్పోతున్నామనే భయంతోనే అరెస్టులకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. ఏకకాలంలో పలు నగరాల్లో సోదాలు గతేడాది డిసెంబర్ 31న పుణేకి సమీపంలోని కోరెగావ్–భీమా గ్రామంలో దళితులు, ఉన్నత వర్గమైన పీష్వాలకు మధ్య చోటుచేసుకున్న హింస కేసు దర్యాప్తులో భాగంగా పుణే పోలీసులు మంగళవారం ఉదయం నుంచి దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌లో విరసం(విప్లవ రచయితల సంఘం)నేత వరవరరావు, ముంబైలో హక్కుల కార్యకర్తలు వెర్నన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరా, ఫరీదాబాద్‌లో ట్రేడ్ యూనియన్ కార్యకర్త, న్యాయవాది సుధా భరద్వాజ్, ఢిల్లీలో పౌర హక్కుల కార్యకర్త గౌతం నవలఖా ఇళ్లలో ఏకకాలంలో దాడులు నిర్వహించినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అనంతరం హైదరాబాద్‌లో వరవరరావు, ఫరీదాబాద్‌లో సుధా భరద్వాజ్, ముంబైలో ఫెరీరా, గొంజాల్వెజ్, ఢిల్లీలో నవలఖాలపై ఐపీసీలోని 153(ఏ), ఇతర సెక్షన్లతో పాటు, మావోలతో సంబంధాల ఆరోపణల నేపథ్యంలో చట్టవ్యతిరేక కార్యకలాపాల (నియంత్రణ) చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే నవలఖాను బుధవారం ఉదయం వరకూ ఢిల్లీ నుంచి బయటకు తీసుకెళ్లద్దని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. నవలఖా తరఫున ఆయన న్యాయవాది వరిషా ఫరాసత్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను విచారించిన అనంతరం కోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే సుధా భరద్వాజ్ ట్రాన్సిట్ రిమాండ్‌పై కూడా పంజాబ్, హరియాణా హైకోర్టు స్టే విధించింది. మరోవైపు హైదరాబాద్‌లో క్రాంతి టేకుల, కూర్మనాథ్, రాంచీలో సుసాన్ అబ్రహం, ఫాదర్ స్టాన్ స్వామి, గోవాలో ఆనంద్ టెల్టుంబ్డే ఇళ్లపై కూడా సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. మావోలతో సంబంధాలున్నాయనే అరెస్టు చేశాం: పోలీసు వర్గాలు ‘ఈల్గర్ పరిషద్ ఆందోళనలతో సంబంధాలపై దర్యాప్తు చేయగా ... నిషేధిత సంస్థ సభ్యులకు సంబంధించి కొన్ని ఆధారాలు లభించాయి. దాని ఆధారంగా పోలీసులు చత్తీస్‌గఢ్, ముంబై, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు’అని పోలీసు వర్గాలు వెల్లడించాయి. మావోయిస్టులతో సంబంధాలున్న వ్యక్తుల ఇళ్లతో పాటు.. జూన్‌లో అరెస్టైన ఐదురుగు వ్యక్తులతో ప్రత్యక్షంగా, లేదా పరోక్షంగా సంబంధమున్న వారి ఇళ్లలోను సోదాలు జరిగాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. దాడుల్లో నిషేధిత సంస్థలతో సంబంధాలపై కొన్ని పత్రాల్ని స్వాధీనం చేసుకున్నామని, వారి ఆర్థిక లావాదేవీల్ని, ఫోన్ రికార్డుల్ని కూడా పరిశీలిస్తున్నామని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. కాగా కొద్ది నెలల క్రితం మహారాష్ట్ర పోలీసుల తనిఖీల్లో దొరికిన రెండు లేఖల్లో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హత్యకు మావోయిస్టుల కుట్ర పన్నారన్న సమాచారం నేపథ్యంలోను ఈ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. కోరెగావ్–బీమా కేసు దర్యాప్తులో భాగంగానే.. కోరెగావ్–బీమా హింసతో సంబంధమున్న అనుమానంతో ఈల్గర్ పరిషద్‌కు చెందిన ఐదుగురు కార్యకర్తల్ని ఈ ఏడాది జూన్‌లో పోలీసులు అరెస్టు చేశారు. దళిత కార్యకర్త సుధీర్ ధావలేను ముంబైలోని తన ఇంట్లో అరెస్టు చేయగా.. న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, కార్యకర్తలు మహేశ్ రౌత్, షోమా సేన్లను నాగ్‌పూర్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఇక న్యాయవాది రోనా విల్సన్‌ను ఢిల్లీలోని తన ఇంట్లో అరెస్టు చేశారు. వారికి మావోలతో సన్నిహిత సంబంధాలున్నాయంటూ విశ్రాంబాగ్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విల్సన్ ఇంట్లో సోదాల్లో దొరికిన లేఖలో వరవరరావు పేరు ఉందని అప్పట్లో పుణే పోలీసులు ప్రకటించారు. రాజీవ్ గాంధీ హత్య తరహాలోనే రోడ్‌షోలను లక్ష్యంగా చేసుకుని ప్రధాని మోదీ హత్యకు మావోలు కుట్ర పన్నినట్లు ఆ లేఖలో ఉందని పోలీసులు చెప్పడం అప్పట్లో సంచలనమైంది. భయపెట్టేందుకే ఈ అరెస్టులు: హక్కుల కార్యకర్తలు ఈ అరెస్టుల్ని దేశవ్యాప్తంగా పలువురు హక్కుల కార్యకర్తలు, రచయితలు, న్యాయవాదులు ఖండించారు. ‘నియంతృత్వ శక్తుల కోరలు ఇప్పుడు విశాలంగా తెరచుకున్నాయి’అని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ట్వీట్ చేశారు. ఈ అరెస్టులు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని, హక్కులపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారిని వేధిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ స్పందిస్తూ.. ఇది పూర్తిగా భయపెట్టే చర్య అని.. స్వేచ్ఛా గొంతుక వినిపించే వారిపై వేధింపుల్ని అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ‘ప్రజా మద్దతు కోల్పోతున్నామని ప్రభుత్వం భయపడుతోంది. ఆ భయానికి సంకేతాలే ఈ అరెస్టులు. అర్థంలేని ఆరోపణలతో న్యాయవాదులు, కవులు, రచయితలు, దళిత హక్కుల కార్యకర్తలు, మేథావుల్ని అరెస్టు చేస్తున్నారు’అని ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్ విమర్శించారు. దళితులు వర్సెస్ పీష్వాలు దళిత సైనికుల సాయంతో జనవరి 1, 1818న పీష్వా పాలకుల్ని బ్రిటిష్ సైన్యం ఓడించింది. పీష్వా పాలకులపై విజయానికి చిహ్నంగా దళిత సంఘాలు ఏటా మహారాష్ట్రలోని భీమా కోరెగావ్‌లో విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తాయి. గతేడాది డిసెంబర్ 31న ఆ వేడుకల్లో హింస నెలకొంది. కొన్ని హిందూసంస్థలు ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో విధ్వంసం చోటుచేసుకుంది. ముంబయితో పాటు పలు ప్రాంతాలకు అల్లర్లు వ్యాపించడంతో మూడు రోజులు మహారాష్ట్ర స్తంభించింది. భయపెట్టేందుకే ఈ అరెస్టులు: హక్కుల కార్యకర్తలు ఈ అరెస్టుల్ని దేశవ్యాప్తంగా పలువురు హక్కుల కార్యకర్తలు, రచయితలు, న్యాయవాదులు ఖండించారు. ‘నియంతృత్వ శక్తుల కోరలు ఇప్పుడు విశాలంగా తెరచుకున్నాయి’అని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ట్వీట్ చేశారు. ఈ అరెస్టులు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని, హక్కులపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారిని వేధిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ స్పందిస్తూ.. ఇది పూర్తిగా భయపెట్టే చర్య అని.. స్వేచ్ఛా గొంతుక వినిపించే వారిపై వేధింపుల్ని అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ‘ప్రజా మద్దతు కోల్పోతున్నామని ప్రభుత్వం భయపడుతోంది. ఆ భయానికి సంకేతాలే ఈ అరెస్టులు. అర్థంలేని ఆరోపణలతో న్యాయవాదులు, కవులు, రచయితలు, దళిత హక్కుల కార్యకర్తలు, మేథావుల్ని అరెస్టు చేస్తున్నారు’అని ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్ విమర్శించారు. -
రేపు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు ప్రజాసంఘాల పిలుపు
సాక్షి, హైదరాబాద్ : విరసం నేత వరవరరావు అరెస్ట్‌కు నిరసనగా బుధవారం రాష్ట్ర వ్యాప్త నిరసనలకు ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణల నేపథ్యంలో విరసం నేత వరవరరావును మంగళవారం పుణె పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తొలుత వరవరరావు ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు.. ఆపై ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. వరవరరావు అరెస్ట్‌పై ఎవరేమన్నారంటే.. ప్రో. హరగోపాల్ : దేశ వ్యాప్తంగా దాడులు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ వ్యతిరేక శక్తులను ఇరుకున పెట్టె ప్రయత్నం చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని చూస్తే సిగ్గేస్తుంది. పూణే పోలీసులు హైదరాబాద్‌లో చేస్తున్న సోదాలపై డీజీపీ, హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశా. కానీ ఎవరూ అందుబాటులోకి రాలేదు. పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాము. కేసీఆర్ కోసం ఉద్యమం చేయలేదు. ఎమర్జెన్సీ సమయంలో కూడా ఇలా దాడులు చేయలేదు. భవిష్యత్‌లో ఇలాంటి దాడులు జరగకుండా ఉండేందుకు కార్యాచరణ రూపొందిస్తాము. వరవరరావు అరెస్ట్‌పై ప్రజా సంఘాలు : ప్రజల హక్కుల గురించి మాట్లాడితే ప్రభుత్వం ఇలా దాడులు చేస్తుందని హెచ్చరికలు పంపింది. ఉదయం 6గంటల నుండి దేశ వ్యాప్తంగా దాడులు జరిపారు. వరవరరావు ఇంట్లోకి ప్రవేశించిన మహారాష్ట్ర పోలీసులు ల్యాండ్ లైన్ ఫోన్ వైర్ కట్ చేశారు. వరవరరావు, అతని భార్య హేమలత సెల్ ఫోన్స్ లాక్కున్నారు. ఎవరితో మాట్లాడకుండా 8గంటల పాటు తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు బంధించారు. క్రాంతితో పాటు అతని బందువుల ఇళ్లపై దాడి చేశారు. జూన్ 6న కూడా ఇదే తరహాలో దాడులు చేశారు. భీమా కోరేఘం పేరుతో రాంచీ, మహారాష్ట్ర, ఢిల్లీ, హైదరాబాద్‌లో అరెస్టులు చేశారు. లెటర్లు అన్ని బోగస్ దొంగ ఉత్తరాలు. మోదీ తన గ్రాఫ్ పడిపోతుందని అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. అబద్ధపు ఉత్తరం మీద అక్రమ కేసులు పెట్టారు. కోర్టులో ఇలాంటి కేసు నిలబడదు. ఇంట్లో సోదాలు చేసి పంచనామా రిపోర్ట్ ఇచ్చి అరెస్ట్ చేశారు. వారి వద్ద ఎలాంటి అరెస్ట్ వారెంట్ లేదు. మాట్లాడే వాళ్లను భయపెట్టే భాగంలో ఇలాంటి దాడులు చేస్తున్నారు. ఈ దాడులను ఖండిస్తున్నాము. వరవరరావు భార్య హేమలత : 50 ఏళ్లుగా అరెస్టులు చేస్తున్నారు. 25 కేసులు పెట్టారు. తప్పుడు కేసులన్ని కోర్టులో వీగిపోయాయి. ఇంట్లో అణువణువు గాలించారు. మా కూతుళ్ల ఇళ్లలో కూడా సోదాలు చేశారు. అరెస్టులు మాకు కొత్త కాదు. 70 ఏళ్ల మనిషి.. అనారోగ్యంతో బాధపడుతున్నడు(కన్నీళ్లు తుడుచుకుంటూ). అక్కడ ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తారో. క్రాంతి(జర్నలిస్ట్) : రాత్రి 8 గంటలకు ఇంట్లోకి ప్రవేశించి ఫోన్లు లాక్కున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చి ఓ కాగితం చేతిలో పెట్టి 20మంది తెల్లవార్లు సోదాలు చేశారు. మా అమ్మ హార్ట్ పేషెంట్ అని చూడకుండా చాలా ఇబ్బందులు పెట్టారు. ఎఫ్ఐఆర్లో పెరు లేకుండా తన ఇంట్లో సోదాలు చేశారు. నా వ్యక్తిగత సమాచారాన్ని మొత్తం లాగేసుకున్నారు. పలాన కేసు విషయంలో సోదాలు చేస్తున్నామనే విషయాన్ని కూడా చెప్పలేదు. కుర్మా నాథ్ (జర్నలిస్ట్) : మహారాష్ట్ర, తెలంగాణ పోలీసులు 5 గంటలపాటూ మా ఇంట్లో చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఆంధ్రపాలకుల సమయంలో ఇలాంటి దాడులు ఎన్నడూ చేయలేదు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే సందర్భంలో అతని వ్యతిరేక శక్తులు ఉండోదనే మోదీని ప్రసన్నం చేసుకున్న కేసీఆర్ ఈ దాడులు చేయించారు. ఇంట్లో ఉన్న విలువైన మా వ్యక్తి గత సమాచారాన్ని ఎత్తుకెళ్లారు. -
విరసం నేత వరవరరావుతో మనసులో మాట
-
వీవీపై అక్రమ కేసు విరమించుకోవాలి
డాక్టర్ వరవరరావు తెలుగు సాహిత్యంలో సుప్ర సిద్ధ రచయిత. అరవై ఏళ్ల నుంచి కవిగా, రచయి తగా, విమర్శకుడిగా, పరిశోధకుడిగా సాహిత్య కృషి చేస్తున్నారు. సముద్రం, చలినెగళ్లు, ఆ రోజులు లాంటి కవితా సంపుటాలను ప్రచురిం చారు. ‘తెలంగాణ విమోచనోద్యమ నవలల’పై విలువైన పరిశోధనను చేశారు. ఈ పరిశోధన వివిధ విశ్వవిద్యాలయాలలో రెఫరెన్స్‌గా ఉంది. ‘భూమి తో మాట్లాడు...’ లాంటి కల్పనా సాహి త్యంపై విమర్శ గ్రంథాలను రాశారు. వరంగల్ లోని సి.కె.ఎం. కళాశాలలో సుదీర్ఘ కాలం తెలుగు అధ్యాపకులుగా, కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. కవిగా, రచయితగా, వక్తగా, ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాహిత్య విశ్లే షకుడిగా ఆయనకు దేశవ్యాపిత గుర్తింపు ఉంది. తెలుగు సమాజంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడం కోసం ఆయన నక్సలైట్లకు, ప్రభు త్వానికి మధ్య జరిగిన చర్చలలో ప్రతినిధిగా పాల్గొని తన బాధ్యతను నిర్వహించారు. వరవరరావు 1970లో ఏర్పడిన విప్లవ రచ యితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు. ప్రజాకవి శ్రీశ్రీ, కాళోజీలతో కలిసి పనిచేశారు. ఆయన నమ్మిన విలువల కోసం, సిద్ధాంత రాజకీయాల కోసం అరవై ఏళ్లుగా రాజీ లేకుండా పనిచేస్తు న్నారు. ఇట్లాంటి వ్యక్తులు మన సమాజంలో ఉండటం సామాజిక చలనానికి అదనపు కూర్పు. భిన్న భావాలు కలిగి ఉండటమనే ప్రజాస్వామిక సూత్రానికి ఆయన లాంటి వాళ్లు ఒక ఉదాహరణ. భారత సమాజం మొదటి నుంచి అన్ని ఆలో చనలకు నిలయంగా ఉంది. వరవరరావు విప్లవా చరణ సాహిత్యంలోనే కానీ ఇతరేతర రూపాలలో కాదని మేము నమ్ముతున్నాం. విప్లవ పార్టీల చర్యలతో ఆయనకు సంబంధం ఉండే అవకాశం లేదు. రచయిత స్వేచ్ఛగా తన భావాలను వ్యక్తం చేసే అవకాశం ఉన్నప్పుడే సృజనాత్మక సాహిత్యం వికసిస్తుంది. భావాలను ఆధారంగా చెబుతున్న లేఖలో వరవరరావు ప్రస్తావనను ఆధారం చేసు కుని రచయితను వేధించడం సరైంది కాదు కనుక మహారాష్ట్ర పోలీసులు అక్రమ కేసులో ఆయనను ఇరికించే ప్రయత్నాన్ని విరమించుకోవాలని మేము విజ్ఞప్తిచేస్తున్నాము. వరవరరావుపై అక్రమ కేసును మోపే ప్రయత్నాన్ని విరమించుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. (నిఖిలేశ్వర్, నందిని సిధారెడ్డి, పొత్తూరి వెంకటేశ్వరరావు, కె.రామచంద్రమూర్తి, కె.శ్రీని వాస్, గద్దర్, అంపశయ్య నవీన్, పాశం యాద గిరి, ఓల్గా, విమలక్క, దేవిప్రియ, యాకూబ్, కాత్యా యని విద్మహే, గోరటి వెంకన్న, సురెపల్లి సుజాత, విల్సన్ సుధాకర్, కొండేపూడి నిర్మల, జయధీర్ తిరుమలరావు. నగ్నముని, కె.శివారెడ్డి, ఖాదర్ మొహినుద్దిన్ తదితర 35 మంది రచయితలు, కవులు, కళాకారులు) -
ప్రజాస్వామికవాదుల గొంతు నొక్కేందుకే
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రిని హతమార్చేందుకు మావోయిస్టులు కుట్రపన్నారనే ఆరోపణలతో కూడిన లేఖలో తన పేరు ప్రస్తావించడాన్ని విప్లవ రచయిత వరవరరావు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న వాళ్ల గొంతునొక్కేందుకే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కుట్ర కేసులు నమోదు చేస్తోందని పేర్కొన్నారు. రాజకీయ ఖైదీల విడుదల కమిటీ కార్యదర్శి రోనావిల్సన్ వద్ద లభించినట్లు పేర్కొంటున్న లేఖలు అసంబద్ధమైనవన్నారు. మోదీ రాజకీయంగా తన ఇమేజ్ పడిపోయినప్పుడల్లా ఇలాంటి సంచలనాలతో ఇమేజ్ను పెంచుకుంటున్నట్లు ఆరోపించారు. గతంలో గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడూ ఇదే తరహాలో ఇమేజ్ పెంచుకొనేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. ఆదివాసీలు, దళితుల హక్కుల కోసం గొంతెత్తినప్పుడల్లా ఎంతోమంది హక్కుల ఉద్యమకారులను, కార్యకర్తలను అరెస్టు చేసి జైళ్లలో పెట్టారని, ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా, సురేంద్ర గాడ్లే, అశోక్రావత్ తదితరులను ఇలాగే అరెస్టు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. నిరాధారమైన, తప్పుడు కుట్ర కేసుల ద్వారా ప్రజాస్వామిక హక్కులను అణచివేయడం, హక్కుల కార్యకర్తల గొంతులను నొక్కేయడం దారుణమని పేర్కొన్నారు. ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఇలాంటి దాడులను ఖండించాలని కోరారు. ఇది కుట్ర పూరితం... ప్రధానిమోదీని చంపేందుకు మావోయిస్టులు కుట్ర పన్నారని ఒక లేఖను సృష్టించి, అందులో విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావు పేరును ఇరికించారని విప్లవ రచయితల సంఘం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. భీమాకోరేగావ్‌లో అసలు నిందితులైన సంఘ్ పరివార్ నాయకులను వదిలేసి దళిత, హక్కుల సంఘాల నాయకుల్ని అరెస్టు చేశారని, దానికి కొనసాగింపుగా ఒక కుట్ర కేసును రచించడం ద్వారా ప్రజాసంఘాలను, దళిత ఉద్య మాలను, విప్లవ ప్రజాస్వామిక భావాల వ్యక్తీకరణ ను అణచివేయాలని చూస్తున్నారని విరసం కార్య దర్శి పాణి, సీనియర్ సభ్యులు కళ్యాణరావు, కార్యవర్గసభ్యులు వరలక్ష్మి, కాశిం, రాంకీ తదితరులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది నాగపూర్ కేంద్రంగా ఆరెస్సెస్, బీజేపీ శక్తులు రచించిన కుట్రగా వారు అభివర్ణించారు. ఇలాంటి కుట్ర రచనలు వారికి కొత్త కాదని, మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాగే జరిగిందని పేర్కొన్నారు. తమ పట్ల విశాల ప్రజారాశుల్లో వ్యతిరేకత ప్రబలుతున్నప్పుడు ప్రజల సానుభూతిని పొందేందుకు, ప్రధాన సమస్యలపై దృష్టి మళ్లించేందుకు, పనిలో పనిగా ఉద్యమించే శక్తులను, ప్రశ్నించే గొంతుల్ని అణచివేసేందుకు పాలకులు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. మోదీపై కుట్ర పెద్ద అబద్ధమని, అసలు కుట్ర మోదీ రాజ్యం చేస్తున్నదని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. దీని ద్వారా ప్రభుత్వం ఆశిస్తున్న ప్రయోజనాల్లో ఒక్కటి కూడా నెరవేరక పోగా మరింతగా అది అప్రతిష్ట మూటగట్టుకుంటుందన్నారు. ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించవలసిన ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు నిబద్ధులై అమలు చేస్తున్న విధానాల అసలు రూపు దాచేస్తే దాగదని, మతం పేరుతో, సంస్కృతి పేరుతో ప్రభుత్వం చేస్తున్న విన్యాసాలను, వికృత పోకడలను భీమా కోరేగావ్ మరోమారు అణగారిన ప్రజల ముందు పెట్టిందని పేర్కొన్నారు. దానిని సహించలేకే మోదీ ప్రభుత్వం ఫాసిజాన్ని అమలు చేస్తున్నదని, నాగపూర్ నుండి భీమా కోరేగావ్ మీదుగా హైదరాబాద్ దాకా ప్రభుత్వం పన్నిన కుట్రను తిప్పికొట్టాలని ప్రజలకు, ప్రజాసంఘాలకు, ప్రజాస్వామిక వాదులకు విరసం విజ్ఞప్తి చేసింది. -
విరసం నేతను బంధించిన పోలీసులు
సాక్షి, ఖమ్మం: అమరుల బంధుమిత్రుల ఆధ్వర్యంలో ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ‘రాజ్య హింస, ఎన్కౌంటర్ హత్యలకు వ్యతిరేకంగా ’ నిర్వహిస్తున్న సభకు తరలివస్తున్న విరసం నేత వరవరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులకు వరవరరావు పోలీసులకు మధ్య వాగ్వివివాదం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ఈ సభకు అనుమతి లేనందునే అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వరవరరావుతో పాటుకు సభకు వస్తున్న పలువురిని కుసుమంచి పోలీస్టేషన్‌కు తరలించారు. -
జీవించే హక్కును పాలకులు కాలరాస్తున్నారు
హైదరాబాద్: రాష్ట్రంలో మనిషి జీవించే హక్కును పాలకులు కాలరాస్తున్నారని విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు అన్నారు. 70 ఏళ్ల కిందటి నిజాం నవాబు నియంతృత్వ ధోరణి నేడు కనిపిస్తోందన్నారు. మంగళవారం ఇక్కడ తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో భావ ప్రకటన హక్కు కోసం, సోషల్ మీడియాపై ఆంక్షలకు వ్యతిరేకంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల భావ ప్రకటనాస్వేచ్ఛను హరించేందుకు ఐపీసీ 506, 507 చట్ట సవరణ తీసుకువస్తున్నారని విమర్శించారు. పరుష వ్యాఖ్యలు చేస్తే రెండేళ్ల శిక్ష వేయాలనే చట్టాన్ని తీసుకురావడం సరైంది కాదన్నారు. ప్రజాతంత్ర భావాలను భరించే స్థితిలో ప్రభుత్వాలు లేవని, ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు. హైకోర్టు సీనియర్ న్యాయవాది రఘునాథ్ మాట్లాడుతూ, రాష్ట్రపతి ఆమోదం లేకుండా ఇలాంటి సెక్షన్లను సవరణ చేయడానికి వీల్లేదన్నారు. ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి డాక్టర్ సుధాకర్, మేధావుల ఫోరం అధ్యక్షుడు గురజాల రవీందర్రావు, విద్యార్థి వేదిక అధ్యక్షుడు కోట శ్రీనివాస్, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
నేటి నుంచి విరసం మహాసభలు: వరవరరావు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): కేంద్రంలోని బీజేపీ పాలకుల అండతో పేట్రేగిపోతున్న బ్రాహ్మణీయ హిందూ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావు అన్నారు. మహబూబ్‌నగర్‌లో శుక్రవారం జరిగిన విరసం సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహబూబ్‌నగర్‌లో శని, ఆదివారాల్లో విరసం ఉమ్మడి రాష్ట్ర 26వ మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభల్లో ఆరు అంశాలపై చర్చ జరగనుందని, బ్రాహ్మణీయ హిందూ ఫాసిజంపై ప్రధాన చర్చ ఉంటుందని వెల్లడించారు. సభలకు సియాసత్ ఎడిటర్ జహీర్ అక్తర్, ప్రొఫెసర్ హరగోపాల్, వీర్సతేదార్, ఆనంద్ తదితరులు హాజరు కానున్నారని వరవరరావు పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామిక వాదులపై ఉద్దేశ పూర్వకంగానే దాడులు జరుగుతున్నాయని వరవరరావు ఆరోపించారు. బ్రాహ్మణీయ హిందూ ఫాసిజంపై ఉర్దూలో ముద్రించిన కరపత్రాలను విడుదల చేశారు. -
అండా సెల్ నుంచి అమ్మకు..!
అమ్మా నాకోసం దుఃఖించకు నువ్వు నన్ను చూడటానికి వచ్చినపుడు ఫైబర్ గాజుకిటికీలో నుంచి నీ ముఖం నేను చూడలేకపోయాను .నువ్వు నా వైకల్యం చెందిన దేహాన్ని చూడగలిగి ఉంటే నేనింకా బతికే ఉన్నానని నువ్వు నిజంగా నమ్మి ఉండేదానివి అమ్మా నేను నీ దగ్గర లేనందుకు దుఃఖించకు నేను ఇంట్లో ఉన్నప్పుడు బయట ప్రపంచంలో నాకు చాలామంది మిత్రులున్నారు నేనీ జైల్లో అండా సెల్లో బంధించబడినాక విశ్వమంతా నాకింకెంతో మంది నేస్తాలు లభించారు. అమ్మా క్షీణిస్తున్న నా ఆరోగ్యం గురించి దిగులుపడకు నా బాల్యంలో నాకొక కప్పు పాలు కూడ నువ్వు సమకూర్చలేనప్పుడు నువ్వు నీ శక్తితో, ధైర్యంతో కూడిన మాటలతో నన్ను కుడిపావు ఇప్పుడీ బాధలో వేదనలో నువ్విచ్చిన ఆశ్వాసంతోనే నేను మరింత శక్తిమంతుణ్ణవుతున్నాను అమ్మా నీ ఆశల్ని వదులుకోకు జైలు నాకు మరణం కాదు పునర్ జననం అని నేను అర్థం చేసుకున్నాను నేను ఇంటికి తిరిగి వస్తాను నాకు ఆశను ధైర్యాన్ని ఇచ్చి పోషించిన నీ ఒడిలోకి అమ్మా నా స్వేచ్ఛ గురించి భయపడకు నేను పోగొట్టుకున్న స్వేచ్ఛ ఎంతోమందిని పొందిన స్వేచ్ఛ అభాగ్యజీవులకు అండగా నాతోపాటు నిలబడటానికి వస్తున్న ప్రతి ఒక్కరిలో నేను నా స్వేచ్ఛను పొందుతున్నాను (2017 నవంబర్ 14న ములాఖత్‌లో నువ్వు వచ్చి జైలు కిటికీ దగ్గర నిలబడిపోయాక) నీకోసం ఇది ఎవరైనా అనువదిస్తారని ఆశిస్తాను. అమ్మా నువు అర్థం చేసుకోలేని విదేశీ భాషలో రాస్తున్నందుకు క్షమించు. నన్నేం చేయమంటావు? నా శిశుత్వంలో నీ ఒడిలో నాకు నువ్వు నేర్పిన తియ్యని భాషలో రాయడానికి నాకు ఇక్కడ అనుమతి లేదు. ప్రేమతో నీ శిశువు, జి.ఎన్. సాయిబాబా, అండాసెల్, కేంద్ర కారాగారం, నాగపూర్ – తెలుగు సేత: వరవరరావు -
‘మజ్దూర్ సంఘటన్’పై నిషేధం ఎత్తేయాలి
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్‌లో మజ్దూర్ సంఘటన్ సమితిపై నిషేధం విధిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రఘువర్ దాస్ నిర్ణయం తీసుకోవడాన్ని రివల్యూషనరీ డెమొక్రటిక్ ఫ్రంట్ ఖండించింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు ఉద్దేశం వెల్లడించాలని ఫ్రంట్ అధ్యక్షుడు వరవరరావు సోమవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. అక్కడి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడుతున్న వారిని అణగదొక్కాలనే కుట్ర సాగుతోందని వ్యాఖ్యానించారు. వెంటనే సంఘటన్ సమితిపై బేషరతుగా నిషేధం ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ప్రజా పోరాటాలపై పోలీసు చర్యలను వెంటనే నిలిపేయాలని పేర్కొన్నారు. -
ప్రాజెక్టుల నిర్మాణానికి గ్రేహౌండ్స్ బలగాలెందుకు?
సాక్షి, హైదరాబాద్: ఎన్కౌంటర్లు హత్యలకు ప్రత్యామ్నాయ పదంగా మారాయని, టేకులపల్లి హత్యాకాండను ఖండిస్తున్నామని విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు చెప్పారు. ఇవి, ఎన్కౌంటర్ పేరున జరిగిన హత్యలని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో మళ్లీ వెంగళరావు కాలాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తు చేస్తోందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మొదటిసారిగా ప్రాజెక్టుల నిర్మాణానికి గ్రేహౌండ్స్, పారామిలటరీ దళాలు ఎందుకు ఉపయోగిస్తున్నారని ఆయన నిలదీశారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టఫ్, విరసం, పౌరహక్కుల సంఘం, తెలంగాణ ప్రజాఫ్రంట్ తదితర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అనంతరంప్రజా సంఘాల నాయకులు విమలక్క, నలమాస కృష్ణ, లక్ష్మణ్ తదితరులతో కలసి వరవరరావు విలేకరులతో మాట్లాడారు. ఇళ్లనుంచి పట్టుకొని వచ్చి మరీ ఆదివాసీ విద్యార్థులను చిత్రహింసలు పెట్టి, హత్యలు చేసి ఎన్‌కౌంటర్లుగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. ఆదివాసీలంటే మావోయిస్టులుగా, మావోయిస్టులంటే ఆదివాసీలుగా ముద్రవేస్తున్నారని ఆరోపించారు. టేకులపల్లి కాల్పుల ఘటనపై హత్యానేరం నమోదు చేసి, ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులను సస్పెండ్ చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్న సోయం బాబూరావును అరెస్టు చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఆదివాసులకు లంబాడీలకు మధ్య చిచ్చు పెట్టి ప్రభుత్వం తమాషా చూస్తోందని వరవరరావు విమర్శించారు. పౌరహక్కుల సంఘం నేత లక్ష్మణ్ మాట్లాడుతూ ఇళ్ల నుంచి పట్టుకొచ్చిన వారిని ఎన్కౌంటర్ పేరున హత్య చేయడం అమానుషమని విమర్శించారు. స్వయంప్రతిపత్తి గల ఒక విచారణ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పడిన తరవాత జరిగిన పెద్ద మారణకాండ ఇదని, హక్కుల కోసం మాట్లాడుతున్న వారిని, ప్రశ్నించే గొంతులను లేకుండా చేస్తున్న హత్యలని నలమాస కృష్ణ అభిప్రాయపడ్డారు. భూమిని, ఖనిజ సంపదను తాకట్టు పెడుతున్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే ఎన్కౌంటర్ పేర హత్యలు చేస్తున్నారని అరుణోదయ విమలక్క విమర్శించారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి మధ్యాహ్నం వరకు మీడియాను, ప్రజలను ఆ ప్రదేశానికి ఎందుకు రానివ్వలేదని ఆమె ప్రశ్నించారు. ఆదివాసీలపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర పోలీసులు విద్యార్థులయిన ఆదివాసీలను హింసించి హత్య చేశారని, ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఆమె ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో న్యూడెమొక్రసీ పరశురాం, పీడీఎస్‌యూ నేత గౌతమ్ పాల్గొన్నారు. -
ఒక పద్మ తల్లి
సందర్భం తన చైతన్యంతో పద్మ ఒక జీవితాన్ని ఎంచుకున్నది. న్యాయమో.. అన్యాయమో ఈ దోపిడీ వ్యవస్థ వేసే సవాళ్లను, శిక్షలను ఆమె స్వీకరించాలి. స్వీకరిస్తుంది. మరి ఆ తల్లి మరణానికి, ఆ అక్క జీవితానికి ఈ సమాజం బాధ్యత పడవద్దా?! పద్మ తల్లి చనిపోయింది. ఏప్రిల్ 29 ఉదయం బాత్రూంలోకి వెళ్లి పడిపోయింది. మెదడులో నరాలు చిట్లి చనిపోయినట్లు ఆ తరువాత వైద్యుడు చెప్పాడు. అప్పటికామె వారం రోజులుగా నలతగా ఉన్నదని, ఇంక తన పని అయిపోయిందని అంటూ ఉండేదని ఆమె కూతుళ్లు చెప్పారు. నలభై ఏళ్లు ఏడుగురు సంతానానికి సేవలు చేసి ఎవరితో చేయించుకోకుండా వెళ్లిపోయింది. యాభై ఏళ్ల నుంచి మానసికంగా ఎదగని కూతురును దగ్గర పెట్టుకొని ఆమె కోసమే ఒక గది, తనదైన ఒక సంసారం ఏర్పాటు చేసుకొని హైదరాబాద్‌లో ఎక్కడో మారుమూలలో ఉంటున్నది. ఆ కూతురును చంటిపాపలా చూసుకుంటున్నది. పద్మ కోసం ఆమె పదేళ్ల నిరీక్షణ ముగిసింది. బహుశా శనివారం ఏప్రిల్ 29 నుంచే ఆమె మట్టిపొరల్లో శాశ్వతంగా నిద్రపోతుంటుంది. ఈ పదేళ్లూ ఎప్పుడూ కంటి మీద కునుకు లేకుండా ఆ కూతురు కోసం నిరీక్షణ. హైదరాబాద్‌లో 1990ల ఆరంభంలో ఆమె మూడో కూతురు పద్మకు విప్లవ రాజకీయాలు అబ్బాయి. చైతన్య మహిళా సంఘంలో తొలి నాయకత్వంలో ఆమె ఉన్నారు. వాళ్లు హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రతి పోరాటంలో ఆమె ఉన్నది. ఎక్కువ కాలం బహిరంగ ప్రజా ఉద్యమాల్లోనే పనిచేసింది. హైదరాబాద్‌లో బస్తీల్లో, విద్యార్థుల్లో, హాస్టల్స్‌లో ఆమె మహిళల్లో పనిచేసిన మేర తలలో నాలుకగా పనిచేసింది తన మెత్తటి నవ్వుతో మృదువైన మాట లతో ఎందరి స్నేహాలనో పొందింది. 1994 డిసెంబర్ నుంచి 1995 మార్చి వరకు జైలులో ఉన్న నక్సలైటు ఖైదీల, జీవిత ఖైదీల విడుదల కోసం చేసిన పోరాటానికి బయట వెల్లువెత్తిన సంఘీభావంలో చైతన్య మహిళా కెరటం కూడా ఉన్నది. 1999 సెప్టెంబర్‌లో ఈ జైలు పోరాటానికి నాయకత్వం వహించిన రాజకీయ ఖైదీ మోడెం బాలకృష్ణ విడుదలయ్యాడు. బహుశా 2000లో పద్మ బాలకృష్ణ సాహచర్యాన్ని ఎంచుకోవడమే ఆమె చేసిన పెద్ద నేరం అయింది. ఆ సహచర్యంలో ఆమె కొద్ది రోజు లైనా గడిపిందో తెలియదు. అప్పటికామె విశాఖపట్నంలో మహిళా ఉద్యమంలో పనిచేస్తున్నది. పదేళ్ల క్రితం భిలాయిలో ఒక సహచరితో పాటు ఆమె ఒక ఇంటి నుంచి బయటికి వెళ్లినప్పుడు ఏపీ ఎస్ఐబీ పోలీ సులు ఆమెను అరెస్టు చేశారు. అప్పటికే అనుమానంతో ఏపీహక్కుల సంఘాల నేతలకు ఫోన్లు చేసింది కాబట్టి ఆమె తన ప్రాణాలు కాపాడుకుంది. పోలీసులకు ఆ కక్ష ఉన్నది. రెండు రోజుల క్రితమే ఏప్రిల్ 27న పద్మ తల్లి ఫోన్ చేసింది. ‘‘పద్మను ఈరోజు కోర్టుకు తీసుకువచ్చారట. ఆమె లాయర్ ఫోన్ చేసి పద్మ విడుదలవుతుంది, ఎవరినైనా పంపించి తీసుకువెళ్లండి’’ అని. తన చిన్న కూతురు, మనమడు వెళ్తారని, ఎక్కడైనా తల తాకట్టు పెట్టయినా కారు ఏర్పాటు చేస్తానని, వెంట ఎవరైనా లాయరు వెళ్తారా అని అడిగింది. మాకు ఆశ్చర్యం అయింది. మాకు ఎవరికీ తెలియని సమాచారం. ఇంకా రెండు కేసులున్నాయి. ఒక కేసులో వాదనలు ముగిసి మే 15న తీర్పు ఉంది. మరో కేసు ట్రయల్‌కు ఎంత సమయం పడుతుందో తెలియదు. కాకపోతే కొన్నాళ్లుగా జడ్జి.. బంధువులు వచ్చి బెయిల్ పెట్టి, జమానత్ పెట్టి బంధువులే తీసుకుపోతే బెయిల్ ఇస్తానని అంటున్నాడట. కొన్నేళ్ల క్రితం తల్లి తప్ప బంధువులు ఎవరూ ఆమెను చూడ్డానికి రాలేదని అతనికి తెలుసు. ఇటీవల కాలంలోనైతే ఆమె లాయర్లు కూడా ఆమెను చాలా అరుదుగా కలుస్తున్నారు. ఆ తరువాత మరో హైసెక్యూరిటీ జైలు జగదల్పూర్కు ఆమెను పంపారు. అక్కడ సుదీర్ఘ కాలపు విచారణ తరువాత కేసులన్నీ కొట్టేసి విడుదలవుతాననుకున్న రోజు. తెలంగాణ నుంచి ఇద్దరు న్యాయవాదులు వెళ్లారు. కోర్టులో కేసు కొట్టేసి, విడుదల ఉత్తర్వులు ఇచ్చి అందుకోసం జైలుకు తిరిగి తీసుకువెళ్లే సమయానికి మరో రెండు కొత్త కేసుల్లో రెండు వారెంట్లు. ఆమె లోపలికి. కోర్టులో నోరు నొచ్చేలా వాదించిన న్యాయవాదులు అసహాయంగా బయటికి. ఈ తంతు నడుస్తూనే ఉంది. ఇంతకూ ఈ పద్మ పదేళ్లుగా ఎదుర్కొంటున్న కేసులు తన మీదివి కావు. ఆమె రాయ్‌పూర్ జైలు నుంచి విడుదలైనప్పుడు మిగిలిన కేసులు చూసినప్పుడు అర్థమైంది ఏమిటంటే ఈమె మొదటి అరెస్టు కన్నా ఎంతో ముందే ఆదిలాబాద్ అడవుల్లో ఎన్కౌంటర్లో అమరురాలైన ఒక పద్మ మీద నమోదయి ఉన్న ఎఫ్ఐఆర్ను ఈ పద్మ మీద చూపుతున్నారు. రాస్తున్నంత సేపూ నా భయ సందేహాలు ఏమిటంటే చైతన్య మహిళా సంఘం పది మంది నాయకత్వాన్ని మావోయిస్టులని రుజువు చేయడానికి పోస్టర్లు వేసినట్లుగా ఇప్పుడు వాటికి పద్మ ఫొటో కూడా జోడిస్తారేమోనని! అంతకన్నా తన కష్టాల నుంచి, నిరీక్షణ నుంచి విముక్తమైన ఆ తల్లి గురించి కాదు, ధైరాయిడ్తో, అనారోగ్యంతో జైలే చిరునామాగా మారిన పద్మ గురించీ కాదు. ఆ తల్లి వదిలి వెళ్లిన ఆ మానసికంగా ఎదగని మధ్యవయస్కురాలైన కూతురు శేషజీవితానికి ఆలనా, పాలనా ఏమిటి?. తన చైతన్యంతో పద్మ ఒక జీవితాన్ని ఎంచుకున్నది. న్యాయమో.. అన్యాయమో ఈ దోపిడీ వ్యవస్థ వేసే సవాళ్లను, శిక్షలను ఆమె స్వీకరించాలి. స్వీకరిస్తుంది. ఆమె రాజకీయాలను, ఆమె విశ్వాసాలను ప్రేమించే వాళ్లు, గౌరవించే వాళ్లు ఆమెకు అండగా ఉన్నారు. ఉంటారని ఆశిద్దాం. మరి ఆ తల్లి మరణానికి, ఆ అక్క జీవితానికి ఈ సమాజం బాధ్యత పడవద్దా?! వ్యాసకర్త విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావు -
ఉస్మానియాతో నా ఊసులు
ఆ రోజుల్లోనే సెవెన్‌స్టార్ సిండికేట్ వారు ‘నవత’ పేరుతో ఒక పత్రిక వెలువరించటం మొదలెట్టారు. ‘నవత’ అన్న పేరు పెట్టిందీ, పత్రికకు గౌరవ సంపాదకుడుగా ఉండటానికి శ్రీశ్రీని ఒప్పించిందీ వరవరరావే! అయితే ఆ పత్రిక ప్రారంభోత్సవం నాడు వరవరరావుకు గానీ, ఆయన మిత్ర బృందానికి గానీ ఆహ్వానమే లేదు. అయినా ‘నవత’ ప్రారంభోత్సవా నికొచ్చిన శ్రీశ్రీని కలుద్దామని వెళ్తే మమ్మల్ని గేటు దగ్గరే ఆపారు. అప్పుడే ‘‘మనమే ఒక త్రైమాసికను ప్రారంభిద్దాం వరవర్!’’ అని నేనన్నమాటే ‘సృజన’ స్థాపనకు దారి తీసింది. నేను 1962–64 మధ్యకాలంలో ఉస్మానియా, ఆర్ట్స్ కాలేజీలో ఎం.ఏ. చదివి నప్పటి కొన్ని జ్ఞాపకాల్ని పాఠకులతో పంచుకోవాలని ఆ విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ వ్యాసం రాస్తున్నాను. ఉస్మానియాకు రప్పించిన ఉత్తరం నేను వరంగల్‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో బీఏ (1958–1962) ప్యాస య్యాక చదువు ముగించి యేదన్నా ఉద్యోగం చూసుకోవాలన్నాడు మా నాయన గారు. ‘‘నిన్ను హైదరాబాద్ పంపించి ఎం.ఎ. చదివించేంత ఆర్థిక స్తోమత లేద’’ని ఆయన కచ్చితంగా చెప్పేశాడు. నాకేమో ఎం.ఎ. చదవాలన్న కోరిక గాఢంగా ఉండేది. ఉస్మానియాలోని ఆర్ట్స్ కాలేజీలోనే ఎం.ఎ. చదవా లన్న కోరిక ఎలా కల్గిందో చెప్పాలి– బీఏ చదువుతున్న రోజుల్లోనే నాకు ఆత్మీయులైన వరవరరావు, గంట రామారెడ్డి హైదరాబాద్‌లో ఎం.ఎ. చదువుతున్నారు. నాకూ, ఈ మిత్రులకూ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సాగుతుండేవి. ఒకసారి వరవరరావు ఓ పెద్ద ఉత్తరంలో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంప¯Š ఎంత అందంగా ఉంటుందో రాశాడు. తనుండే ‘జు’ హాస్టల్ ముందు రోడ్డుకు ఇరుపక్కలా వరసగా ఎన్నో బొండుమల్లె చెట్లు ఉంటాయనీ, తెల్లవారి రోడ్డంతా ఈ బొండుమల్లెపూలు తెల్లగా పరచుకునే ఉంటాయనీ, చలికాలంలో మంచు బిందువులతో నిండిన ఆ పూలను చూడటం అద్భుతమైన అనుభవం అనీ, ఈ అపూర్వ దృశ్యాలకు నీ కళ్లు తెరచుకోవాలంటే నువ్వొకసారి ఇక్కడకు రావాలనీ ఆ 12 పేజీల ఉత్తరం సారాంశం. ఆ ఉత్తరం ఐదారుసార్లు చదువుకున్నాక, ఉస్మానియా క్యాంపస్ చూసి రావాలని నిర్ణయించుకున్నాను. నాతో పాటు వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చదువుతున్న మిత్రులు శివకుమార్, తిరుపతయ్య, సత్యనారాయణరెడ్డిలను కూడా రావటానికి ఒప్పించి, 1960 జనవరిలో, మంచి చలికాలంలో హైదరాబాద్ వెళ్లి ‘జు’ హాస్టల్లో వరవరరావు ఉంటున్న రూంలోనే బస చేశాం. వరవరరావు, గంటా రామన్నలు సంతోషించి క్యాంపస్ అంతా తిప్పారు. మొట్టమొదలు యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ చూపించారు. ఆ అద్భుత భవనాన్ని చూసి నేనెంత థ్రిల్లయ్యానో చెప్పలేను. ఆ ఆర్కిటెక్చర్ కళ్లు మిరి మిట్లు గొల్పింది. క్లాస్‌రూమ్స్, లాంజులు, వరండాలు కలలో చూస్తున్న దృశ్యాలుగా కనిపించాయి. మరుక్షణంలోనే, ఈ కాలేజీలో చదువుకునే అవ కాశాన్ని పొందకపోతే ఈ జన్మ వృథా అనుకున్నాను. వసతిగృహం–వామపక్ష శిబిరం మా కుటుంబ ఆర్ధిక పరిస్థితులు బాగా లేకపోయినా, మా నాయన గార్కి నేను ఎం.ఎ. చదవడం ఇష్టం లేకపోయినా నేనే మొండి ధైర్యంతో కొందరు మిత్రుల సహాయంతో ఆర్ట్స్ కాలేజీలో ఎం.ఎ. (ఎకనామిక్స్)లో చేరిపో యాను. ఎం.ఎ. తెలుగు కానీ, పొలిటికల్ సైన్స్ కానీ చెయ్యాలనుకున్నాను. కానీ ఎకనామిక్స్‌తో చేస్తే త్వరగా ఉద్యోగం దొరుకుతుందని వరవరరావు, రామన్న చెప్పడం వల్ల అందులో చేరాను. ‘జు’ హాస్టల్లో అడ్మిషన్ దొరికింది. కేంద్రమంత్రిగా పనిచేసిన జైపాల్ రెడ్డి మాకు రూంమేట్. వరవరరావు మా రూంకొచ్చినప్పుడు మేం చర్చించుకుంటూ ఉంటే జైపాల్‌రెడ్డి కూడా పాల్గొనే వాడు. ఒకరోజు వరవరరావు సిటీలో జరిగిన సీపీఐ నాయకుడు ఎస్ఏ డాంగే పాల్గొన్న సభకు వెళ్లొచ్చి రూంకొచ్చాడు. డాంగే ఉపన్యాసం ఎంత గొప్పగా ఉందో, యేయే విషయాలను గూర్చి మాట్లాడాడో చెప్పడం మొదలెట్టాడు. అదంతా వింటున్న జైపాల్‌రెడ్డి ‘‘డాంగే అంటే మీకంత ఇష్టమా?’’ అని ప్రశ్నించి, డాంగేను, కమ్యూనిస్టు పార్టీని విమర్శించటం మొదలెట్టాడు. ఆ రోజుల్లో జైపాల్‌రెడ్డికి సి. రాజగోపాలచారి స్థాపించిన స్వతంత్ర పార్టీ అంటే చాలా అభిమానం. స్వతంత్ర పార్టీ ముఖ్యంగా నెహ్రూగారు అమలు చేస్తున్న కొన్ని వామపక్ష విధానాలను వ్యతిరేకించటానికే స్థాపించారు. ఆరోజు నేను, వరవరరావు ఒకపక్క; జైపాల్‌రెడ్డి ఒక పక్క–దాదాపు రెండుగంటల సేపు వాదించుకున్నాం. ‘జు’ హాస్టల్లో ఉన్నన్ని రోజులు జైపాల్‌రెడ్డి, ఆయన మిత్ర బృందానికీ, మా మిత్ర బృందానికీ మధ్య వాదనలు జరుగుతూనే ఉండేవి. శ్రీశ్రీ వర్గంతో విశ్వనాథ వర్గం డీ ఒక్క రాజకీయాల్లోనే కాదు, సాహిత్యంలో కూడా విద్యార్థులం రెండు వర్గా లుగా చీలిపోయి వాదించుకునేవాళ్లం. ఒకటి శ్రీశ్రీ వర్గం, మరొకటి విశ్వనాథ వర్గం–వరవరరావు, నేను, సి. రాఘవాచారి లాంటి వాళ్లం శ్రీశ్రీ వర్గంగా; మాదిరాజు రంగారావు, ముదిగొండ వీరభద్రయ్య, వే. నరసింహారెడ్డి విశ్వ నాథ వర్గంగా ఉండేవాళ్లం. అందరం స్నేహంగానే ఉండేవాళ్లం కానీ, తీవ్ర మైన వాదోపవాదాలు జరుగుతుండేవి. ఇక్కడే సాహిత్యానికి సంబంధించిన ఒక ఉదంతాన్ని చెప్పాలి. ఒకసారి ముదిగొండ వీరభద్రయ్య రూంలో కూర్చొని వాదించుకుంటున్నాము. ఆ వాదనలో ‘‘కాదేదీ కవితకనర్హం’’ అన్న శ్రీశ్రీ మాటను కోట్ చేసి ‘‘ప్రతీది కవితా వస్తువు ఎలా అవుతుంద’’ని వీరభద్రయ్య అంటే, ఎందుకు కాదు అని మేం–అప్పుడు నాకు మార్లిన్‌మన్రో గుర్తొచ్చింది. మార్లిన్ మన్రో అంటే మేం చాలా ఇష్టపడేవాళ్లం. నేను వరవరరావుతో ‘‘మార్లిన్‌మన్రో మీద నువ్వో కవిత రాయాలి’’ అన్నాను. ఆ మాట వినగానే వీరభద్రయ్య ‘‘సెక్స్‌కు సింబల్ అయిన మార్లిన్‌మన్రో కూడా కవితావస్తువు అవుతుందా?’’ అన్నాడు. ‘‘ఎందుకు కాదు’’ అన్న వరవరరావు వెంటనే తన రూంకు వెళ్లి మార్లిన్‌మన్రో మీద ఒక కవిత రాసేశాడు. దాన్ని చదివి మేమంతా చాలా బావుందన్నాం. ఆ కవితను వరవరరావు అప్పుడే బాపు–రమణల సంపాదకత్వంలో వెలువ డ్తున్న ‘జ్యోతి’ మాసపత్రికకు పంపించాడు. ఆ కవితకు బాపు చక్కని మార్లిన్ మన్రో చిత్రాన్ని వేసి ప్రచురించాడు. దాన్ని వరవరరావు మాకు చూపించిన ప్పుడు ఎంత ఎక్సైట్ అయ్యామో! తర్వాత ఆ కవితకు పారితోషికంగా రూ.10 మనియార్డర్ చేస్తే, అందరం సికింద్రాబాద్‌లో తాజ్‌మహల్ హోట ల్కు వెళ్లి టీ తాగాం. పాఠం వదిలి పథేర్పాంచాలికి నేను క్లాస్ అటెండ్ చేసినప్పుడు మాత్రం చాలా డిస్సపాయింట్ అయ్యాను. క్లాస్ తీసుకున్న ముస్లిం ప్రొఫెసర్‌గారు చాలాకాలం ఉర్దూ మీడియంలో పాఠాలు చెప్పాడట. ఉర్దూలో రాసుకున్న నోట్స్ ముందు పెట్టుకొని, అతి కష్టంగా ఇంగ్లిష్‌లోకి అనువాదం చేస్తూ పాఠం చెప్పాడు. మిగతా లెక్చరర్లు కూడా అంతే. నాకస్సలు కూర్చోబుద్ధి కాకపోయేది. ఇక్కడే ఇంకో విషయం చెప్పాలి. ఆరోజుల్లో ఎం.ఎ. ఎకనామిక్స్ స్టూడెంట్స్‌కు క్లాసులు మొదటి మూడు రోజులు ఆర్ట్స్ కాలేజీలోనూ, తర్వాతి మూడురోజులు నిజాం కాలేజీ లోనూ జరిగేవి. నిజాం కాలేజీలో మాకు ప్రొఫెసర్ జసవాలా అనే ఆమె క్లాసులు తీసుకునేది. మేం రెండు సిటీ బస్సులు మారి వెళ్తే, ‘మేడం ఈరోజు క్లాసు తీసుకోవటంలేదు’ అని అక్కడుండే మరో లెక్చరర్‌గారు చెప్పేవాడు. ఎట్లాగూ సిటీకొచ్చాం, క్లాసు లేదు. యేదైనా సినిమాకు వెళ్దాం అని మార్నిం గ్షోలు నడుస్తున్న థియేటర్‌కు పరిగెత్తేవాళ్లం. గురుదత్ నిర్మించిన ‘ప్యాసా’ అన్నా, ‘కాగజ్కేపూల్’ అన్నా విపరీతమైన ఇష్టం. ఎన్నిసార్లు చూశానో! ఆ రోజుల్లోనే లిబర్టీ టాకీసులో సత్యజిత్‌రే ‘పథేర్ పాంచాలి’, ‘అపరాజితో’, ‘అపూర్ సంసార్’, ‘తీన్‌కన్యా’, ‘చారులత’ లాంటి సినిమాల్ని ప్రత్యేక ప్రదర్శ నలుగా ప్రదర్శించేవాళ్లు. క్లాసులు ఎగ్గొట్టి వరవరరావు, నేను పరిగెత్తేవాళ్లం. ఇలా ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్న రోజుల్లో సినిమాలు, వామపక్ష రాజకీ యాలు; శ్రీశ్రీ–విశ్వనాథల సాహిత్యం–ఈ మూడింటితోటే గడిచిపోయింది. అటు కృష్ణమీనన్, ఇటు కృపలానీ.. ఆరోజుల్లోనే సి. రాఘవాచారి మంచి మిత్రుడయ్యాడు. మొదలు మాకు వరం గల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలోనే మిత్రుడు. మేం ఎం.ఎ. చదువుతున్న రోజుల్లో ఆయన లా కాలేజీలో చదువుతున్నాడు. ఆయనకు మొదట్నించి సీపీ ఐలో సభ్యత్వం ఉండేది. ఆయన లా కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ అధ్య క్షునిగా పోటీ చేసినప్పుడు నేనూ, వరవరరావు ప్రచారం చేశాం. ఆయన గెల్చాడు. ఆయన అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఒకసారి లా కాలేజీలో వి.కె. కృష్ణ మీనన్ ఉపన్యాసం ఏర్పాటు చేశాడు. కృష్ణమీనన్ ఉపన్యాసం అంటే మాకు ఎనలేని అభిమానం. కొందరు రైటిస్టు విద్యార్థులు ఆ ఉపన్యాసాన్ని అడ్డుకో వాలని ప్రయత్నించారు. ఆరోజు కృష్ణమీనన్ గొప్ప ఉపన్యాసం చేశాడు. మేం ఎంత ఎక్సైట్ అయ్యామో చెప్పలేను. మేం ఎం.ఎ. చదువుతున్న రోజుల్లోనే (1962లో) నార్త్ బొంబాయి నియోజకవర్గం నుండి పార్లమెంట్‌కు కాంగ్రె¯Š నుంచి కృష్ణమీనన్, రైటిస్టు పార్టీలన్నింటి తరఫున ఆచార్య కృపలాని పోటీ చేశారు. మా మిత్రబృంద మంతా కృష్ణమీనన్ గెలుస్తాడనీ; జైపాల్‌రెడ్డి, మిత్రబృందమంతా కృపలానీ గెలుస్తాడనీ వాదించుకునేవాళ్లం. కృష్ణమీనన్ 3 లక్షల మెజార్టీతో గెలిచాడని తెలిశాక పెద్ద పండుగ చేసుకున్నాం. అయితే మా సంతోషం ఎంతోకాలం నిలువలేదు. మీనన్ గెల్చిన కొద్ది నెలల తర్వాత–అంటే నవంబర్ 1962లో చైనాతో జరిగిన యుద్ధంలో భారత్ సైన్యానికి ఎదురుదెబ్బలు తగలటంతో కృష్ణమీనన్ రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేశాడు. ఈ వార్త తెలిశాక ‘జు’ హాస్టల్ ముందున్న బషీర్ క్యాంటీన్ వద్ద కృపలానీని సమర్థించిన బృందం పెద్ద పండుగ చేసుకుంటోంటే అప్పుడే అక్కడికి టీ తాగటానికి వెళ్లిన మేం యేమీ మాట్లాడలేని పరిస్థితి యేర్పడింది. శ్రీశ్రీని చూద్దామని వెళితే... ఆ రోజుల్లోనే సెవెన్‌స్టార్ సిండికేట్ అనే సంస్థ వారు ‘నవత’ పేరుతో ఒక త్రైమాసిక పత్రిక వెలువరించటం మొదలెట్టారు. ‘నవత’ అన్న పేరు పెట్టిందీ, పత్రికకు గౌరవ సంపాదకుడుగా ఉండటానికి శ్రీశ్రీని ఒప్పించిందీ వరవరరావే! అయితే ఆ పత్రిక ప్రారంభోత్సవం నాడు వరవరరావుకు గానీ, ఆయన మిత్ర బృందానికి గానీ ఆహ్వానమే లేదు. అయినా ‘నవత’ ప్రారంభో త్సవానికొచ్చిన శ్రీశ్రీని కలుద్దామని వెళ్తే మమ్మల్ని గేటు దగ్గరే ఆపారు. సరిగ్గా అప్పుడే ‘‘మనమే ఒక త్రైమాసికను ప్రారంభిద్దాం వరవర్!’’ అని నేనన్న మాటే ‘‘సృజన’’ స్థాపనకు దారి తీసింది. ఎం.ఎ. ద్వితీయ సంవత్సరం (1963–64)లో ఉన్నప్పుడే ‘అంపశయ్య’ నవలకు బీజం పడింది. ఒకేరోజు నా మనస్సును తీవ్రంగా కలచివేసిన, జరి గిన సంఘటనలు ‘అంపశయ్య’ రాయటానికి పురికొల్పాయి. ఈ నవలను 1964లో మొదలెట్టి 1968లో పూర్తి చేశాను. ఇలా ఉస్మానియా యూనివర్శిటీలో మేం చదువుకున్న రోజుల్లో ఎన్నో చరిత్రాత్మకమైన సంఘటనలు జరిగాయి. అంపశయ్య నవీన్, వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఈ–మెయిల్ : naveen.ampasayya@yahoo.com -
విషాదంపై విద్రోహం ముద్ర
అభిప్రాయం రైలు ప్రమాదం వంటి ఒక మానవీయ విషాద సందర్భంలో కూడా ఇటువంటి 'విద్రోహ' ప్రచారానికి పూనుకోవడం ఈ రాజ్యానికి, దానికి అండగా నిలిచిన మీడియాలోని ఒక సెక్షన్‌కే చెల్లింది. ప్రజాస్వామ్యమా బహుపరాక్! ఛత్తీస్‌ఘడ్‌లోని జగదల్పూర్ నుంచి ఒడిశా రాజధాని భువ నేశ్వర్‌కు వెళ్లే హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలుకు విజయనగరం జిల్లా కూనేరు రైల్వే స్టేషన్ దగ్గర జనవరి 21 శనివారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో నలభై మందికి పైగా మరణించారు. యాభై మందికి పైగా గాయపడ్డారు. పట్టాలు విరగడం వల్ల, అవి కూడా క్రాస్‌గా కాకుండా షార్ప్‌గా విరగడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఏ ప్రమాదం జరిగినా పలు కోణాల నుంచి ఊహాగానాలు, దర్యాప్తులు సాగవచ్చు. కాని బాధ్యులను కాపాడడానికి 'విద్రోహ చర్య' అని వెంటనే ప్రకటించడం ప్రభుత్వం తన బాధ్యత తప్పించుకోవడానికి ఒక తక్షణ సమీప మార్గం అవుతుంది. రైల్వే అధికార ప్రతినిధి అనిల్ సక్సేనా ఇది విద్రోహ చర్య అనడానికి ఆధారాలు ఉన్నాయని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు.ఇది నక్సల్ ప్రభావం ఉన్న ప్రాంతం గనుక, గణతంత్ర దినం ముందు జరిగింది గనుక’’ ఆయన అనుమానం అటు వెళ్లింది. ఈ రైలు ప్రమాదంలో ఇటువంటి విద్రోహ చర్య ఏమైనా ఉన్నదా అని విచారించడానికి జాతీయ భద్రతా ఏజెన్సీ(ఎన్ఐఏ)ని ఆదేశించే అవకాశాలు ఉన్నట్టు ఒక ప్రముఖ ఇంగ్లిష్ దినపత్రిక తెలిపింది. ఒడిశా డీజీపీ కేబీ సింగ్ ఈ రైలు ప్రమాదంలో మావోయిస్టుల ప్రమేయానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని, మావోయిస్టుల కదలికలపై నిఘా వేసిన సీనియర్ అధికారితో మాట్లాడి తాను ధృవీకరించుకున్నట్లు చెప్పారు(సాక్షి, జనవరి 23, 2017, పేజి 5). అయినా కూడా కొన్ని పత్రికలు ఈ మీడియా ట్రయల్ నిర్వహించడం ఏమిటి? ఒక దినపత్రిక పతాక శీర్షికయే 'విద్రోహమా, నిర్లక్ష్యమా?' నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో విద్రోహ చర్యను తోసి పుచ్చలేమని ఢిల్లీ రైల్వే వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి... ఏది ఏమైనా రైల్వే భద్రతా కమిషనర్ విచారణలో అసలు కారణం వెల్లడవు తుంది’’ అంటూనే, ఆ విచారణ నిష్పక్షపాతంగా జర గకుండా ఉండడానికి ఆ పత్రిక గతం నుంచి చాలా మసాలా అందించింది. సహజంగానే చంద్రబాబు ప్రభుత్వం వెంటనే సీఐడీ విచారణకు ఆదేశించింది. కనుక ఆ దినపత్రిక ‘‘రైల్వే స్టేషన్ ఏఓబీలోని మావో యిస్టు ప్రాబల్య ప్రాంతంలో ఉంది. సుమారు పదేళ్ల కిందట మావోయిస్టులు ఈ రైల్వే స్టేషన్‌ను పేల్చేశారు. అక్కడ సామగ్రిని తగలబెట్టారు... తాజాగా జరిగిన దుర్ఘటన కూడా అదే ప్రాంతంలో జరగడం, పట్టా విరి గిన తీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నా’’యని రాసింది మరో దినపత్రిక. ఎలక్ట్రానిక్ మీడియాలో ఎక్కువగా చెప్తున్నట్లు ఇటీవలి బెజ్జంగి ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారం కావచ్చు అనే మాట ఒక్కటి రాయలేదు. ఈ విధంగా ఊహించడమూ, అనుమానించడమూ ఏకపక్షం అని కాదు గాని, అటువంటి సందర్భాలలో వివిధ కోణాలలో ఉన్న ఊహాగానాలు, అనుమానాలు కూడా నిష్పక్షపాతంగా రాయాల్సి ఉంటుంది. ఆ పని ఒక 'సాక్షి' పత్రిక చేసింది. దీనిని 'విద్రోహ చర్యగా చిత్రీకరణ?' చేస్తున్నారనే శీర్షికతో ఇట్లా రాసింది: "హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనలో బాధ్యులైన సంబంధిత అధికారులు, ఇంజినీరింగ్ అధికారులను బయట పడేయడానికి రైల్వే ఉన్నతాధికారులు ఎత్తుగడలు వేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనకు విద్రోహ చర్య కారణమై ఉంటుందన్న ప్రచారం లేవదీయడం, విరిగిన పట్టాను ఎవరో కోసారన్న వాదనను తెరపైకి తేవడం ఇందులో భాగమేనని అంటున్నారు. ప్రమాద ప్రాంతం మావోయిస్టుల కదలికలు ఉన్న ఏరియా కావడంతో ఆ నెపాన్ని వారిపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని... ఈ హిరాఖండ్ రైలు ప్రమాదాన్ని కూడా ఏదోలా విద్రోహ చర్యగా నెట్టేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతుంది." కేంద్ర, ఆంధ్ర ప్రభుత్వాలు, వాటికి అనుకూలమైన దినపత్రికలు స్పందించిన వేగంతోనే నేను స్పందించడా నికి కారణం ఉంది. ఇంచుమించు ఈ రైలు ప్రమాదంలో మరణించినంత మంది బెజ్జంగి ఎన్కౌంటర్లో కూడా మరణించడం వల్ల కేంద్ర, ఆంధ్ర ప్రభుత్వాలు ఆత్మ రక్షణలో పడి మావోయిస్టు పార్టీపై విపరీతమైన దుష్ప్ర చారం చేస్తున్నవి. జనవరి 23న ఏపీలోని అన్ని జిల్లా కేంద్రాలలో టీడీఎఫ్ నిజనిర్ధారణ బృందం అరెస్టుకు నిరసనగా ధర్నాలు, ప్రదర్శనలు జరుగుతూ ఉంటే, మఫ్టీలోని పోలీసులతో పోస్టర్లు, కరపత్రాలతో ఒక కౌంటర్ ప్రచారం చేస్తున్నది ఏపీ ప్రభుత్వం. ఎన్ కౌంటర్ జరిగిన నాటి నుంచి దాన్ని నిరసిస్తున్న అన్ని ప్రజాసంఘాలపై, వాటి కార్యకర్తలు, నేతలపై, మహిళ లపై చెప్పనలవి కాని దుష్ప్రచారానికి పూనుకున్నది. 2009 నుంచి తూర్పు, మధ్య భారతాల్లో గ్రీన్ హంట్ పేరుతో ప్రజలపై సాగిస్తున్న యుద్ధానికి మోదీ ప్రభుత్వం 'మిషన్ 2016' అని పేరు పెట్టింది. అయినా ప్రకటించినట్లుగా 2016 చివరికి ఆదివాసుల విస్థాపన, నిర్వాసితత్వం, మావోయిస్టుల నిర్మూలన సాధించలేకపోవడంతో 'మిషన్ 2017' పేరుతో కొత్త పథకాలను రచిస్తున్నారు. మంద్రస్థాయి యుద్ధంలో భాగంగా ప్రచా రాస్త్రాన్ని పదును పెట్టుకోవడం వాటిలో ఒకటి. టీడీఎఫ్ నిజనిర్ధారణ బృందం అరెస్టు సందర్భంగా దీనినే బస్తర్ ఐజీ కల్లూరి వైట్ కాలర్ మావోయిస్టుల అణచివేత విధానంగా చెప్పుకున్నాడు. అంటే, ప్రజాస్వామిక శక్తుల ప్రచారానికి విరుద్ధంగా ప్రభుత్వాలు, పోలీస్ యంత్రాంగం ప్రచారానికి ఎత్తుకోవడం అన్న మాట. రైలు ప్రమాదం వంటి ఒక మానవీయ విషాద సందర్భంలో కూడా ఇటువంటి 'విద్రోహ' ప్రచారానికి పూనుకోవడం ఈ రాజ్యానికి, దానికి అండగా నిలిచిన మీడియాలోని ఒక సెక్షన్‌కే చెల్లింది. ప్రజాస్వామ్యమా బహుపరాక్! వరవరరావు విరసం వ్యవస్థాపక సభ్యుడు -
ఆపరేషన్ ఆర్కేలో మైండ్‌గేమ్ ఎవరిది?
అభిప్రాయం ప్రజల మధ్యన ఉన్న మావోయిస్టులపై ‘ఆపరేషన్ ఆర్కే’ పేరుతో పెద్ద ఎత్తున దాడికి పూనుకుంటారు. ఆ ఘటనలో మృతుల గురించిన ప్రకటనల విషయంలో తొలి రోజునుంచి తామే మైండ్ గేమ్ ఆడుతూ ఎదుటివారిది మైండ్ గేమ్ అంటారు. మనుషుల స్వభావాలు, ఉద్దే శాల గురించి ప్రస్తావించడానికి జంతువుల పోలిక తీసుకురావడం చిరకాలంగా ఉన్నదే. ప్రపంచ సాహిత్యం నిండా ఇది కని పిస్తుంది. మన పంచతంత్రం కథలు అందుకు మంచి ఉదా హరణ. వర్గ సమాజంలో మను షుల స్వభావాలు వాళ్ల ప్రయోజ నాల వల్ల, వాళ్ల స్వార్థం వల్ల మారిపోతూ ఉంటాయి. కానీ జంతువుల సహజాతాలు మనుషుల సంపర్కంలోకి వస్తే తప్ప మారిపోయే అవకాశం లేదు. తొండ ముదిరి ఊసర వెల్లి కావడం, రంగులు మార్చడం, గొంగడి పురుగు సీతా కోక చిలుకగా మారటం ప్రకృతి సిద్ధ్ధమైన పరిణామాలు, సహజాతాలు. ఇందులో మంచి, చెడు అని అనేది ఏమీ లేదు. ఇది ఒక పరిణామం. వర్గసమాజంలోని మానవు లకు ఇటువంటి పోలిక తేవడానికి వీల్లేదు. ఏజెన్సీలో ‘ఊసరవెల్లి’ పేరుతో వెలసిన ఈ పోస్టర్ల సందర్భమే చూద్దాం. ప్రచురించినది ప్రగతిశీల ఆదివాసీ యువత - ఏ తొండ ఊసరవెల్లిగా మారిన రూపానికి ఇది మారుపేరు? ఇది ఆంధ్ర ఎస్ఐబీ తొండ ముదిరిన ఊస రవెల్లి రూపమా? లేక చంద్రబాబు రాజ్యాంగ యంత్ర ఊసరవెల్లి రూపమా? పదహారేళ్లుగా జల్-జంగల్-జమీన్ కోసం, ప్రాదేశిక హక్కుల కోసం గ్రామ విప్లవ అధికారాలు ఏర్పాటు చేసుకుంటున్న ప్రజలపై, వాళ్ల మధ్యన ఉన్న మావోయిస్టులపై ‘ఆపరేషన్ ఆర్కే’ పేరుతో పెద్ద ఎత్తున దాడికి పూనుకుంటారు. ఆ ఘటనలో మృతుల గురించిన ప్రకటనలపై తొలి రోజునుంచి తామే మైండ్ గేమ్ ఆడుతూ ఎదుటివారిది మైండ్ గేమ్ అంటారు. ఈ రంగులు మార్చడం పాలక వర్గాలకు సహజమే. రామ్‌ఘడ్ ఎన్కౌంటర్ గురించి నేను అక్టోబర్ 24 నుంచి ఇస్తూ వస్తున్న ప్రకటనలే నిర్దిష్టంగా చూద్దాం. అక్టో బర్ 24వ తేదీ అంతా ఆంధ్రా డీజీపీ దాన్ని ‘ఆపరేషన్ ఆర్కే’ అన్నాడు. ఆర్కే గాయపడి పోలీసుల అదుపులోనే ఉండే అవకాశం ఉందని, సీఆర్బి, తెలంగాణ పార్టీ భావిం చినందువల్ల తెలుసుకునే ప్రయత్నం చేశాను. తమ అదు పులో లేడని పోలీసు అధికారులు ప్రొ. హరగోపాల్‌కు, బాధ్యత గల వారికి చెప్పినప్పుడు అదుపులో లేకపోవచ్చు గానీ, వాళ్ల నిఘాలో ఉండే అవకాశం ఉందని చెప్పాను. నేను వాడిన మాట ‘పోలీసుల నిఘా’, ‘విసినిటి’, అంటే వాళ్ల కనుసన్నల్లో ఉండే ప్రాంతం అనే అర్థంలో. వదంతులు, ప్రచారాలు చాలా జరిగాయి. విషాహారం పెట్టారని, ఆహారంలో మత్తు మందు చల్లారని వంటివి. ఆర్కే గాయపడడమే కాదు అట్లా పోలీసుల చేతుల్లో పడ్డా డని కూడా. అప్పటికే తన కొడుకు పృథ్వీ (మున్నా)ను ఈ ఎన్కౌంటర్లో కోల్పోయి, మృతదేహాన్ని తీసుకువెళ్లిన కన్న తల్లి శిరీష ఈ ప్రచారాలతో, ఈ ప్రకటనతో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది. ఆర్కే తమ అదుపులో ఉంటే కోర్టులో హాజరు పరచాలని కోరింది. పోలీసుల నిఘావరణలో, వాళ్ల నిఘా కనుసన్నల్లో ఉండే అవకాశం ఉందనే మాట వాడాను తప్ప, వాళ్ల అదుపులో ఉన్నాడని గానీ, వాళ్లు చిత్రహింసలు పెడుతున్నారని గానీ నేను ఏ సందర్భంలో కూడా ఆరోపించలేదు. అదు పులో ఉండటం అంటే ఎన్కౌంటర్ చేయడమే అని నాకు తెలుసు. ఇంత పెద్ద సంఘటనలో ఆర్కే అదుపులో ఉన్నా డని అనుమానించడానికి, ఆందోళన చెందడానికి ఆస్కారం ఉంది గనుక కోర్టు ఈ ఆరోపణను విచారించడానికి ఏదైనా చట్టబద్ధమైన ఆధారాన్ని చూపండని హైకోర్టులో న్యాయ మూర్తులు కూడా అన్నప్పుడు మాత్రమే శిరీష తరఫు న్యాయవాది రఘునాథ్ నన్ను సంప్రదించి అందుకు రెండు వారాల సమయం తీసుకున్నారు. ఆ రాత్రే ఆర్కే క్షేమం అని తెలియడం వల్ల ఇంక ప్రజల్లో నెలకొన్న ఆందోళనను తొల గించాలని వెంటనే మీడియాకు ‘ఆర్కే క్షేమం’ అని తెలి పాను. పోలీసు దిగ్బంధంలో చిక్కుకుపోయిన మేం ప్రజ లకు చెప్పడంలో కొంత ఆలస్యం జరిగింది అంటూ ఏఓబీ కార్యదర్శి జగబంధు చేసిన ప్రకటనబట్టి కూడా.. పోలీసు దిగ్బంధం అంటే పోలీసుల అదుపులో అన్నట్లే కదా. మనుషులు పోలీసు యంత్రాంగంగా, ప్రభుత్వంగా మారినప్పుడు వాస్తవాలను చెప్పే బాధ్యత నిర్వహించడం లేదన్నదే నేను ఈ మైండ్ గేమ్ ఆడుతున్న రాజ్యంపై 1969 నుంచి కూడా చేస్తున్న ఆరోపణ. ఈ సందర్భంగా ఏ పాపం ఎరుగని ఊసరవెల్లి లాంటి ప్రాణుల పోలిక తేవడం మరొక నేరమని నేను ఆరోపించదల్చుకున్నాను. నాకు ఊసరవెల్లి పోలిక తీసుకువచ్చారు గానీ ఈ ఆరో పణ చేస్తున్న వాళ్లకు (వాళ్లెవరైనా సరే అది రాజ్య ప్రాయోజి తమైందని నేను భావిస్తున్నాను) నేను మ్యాకవెల్లి పోలిక చెప్పదల్చుకున్నాను. మన దేశంలో విశ్వవిద్యాలయాలను నెలకొల్పిన రోజులలో, అంటే 19వ శతాబ్దం ఉత్తరార్ధంలో ఈ పేరు చాలా ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడు తనను మెకాలే అంటున్నాం. వర్శిటీల ఏర్పాటుకు ఈ దేశ బుద్ధిజీవుల భావాలను వలసీకరించాలనే ప్రయత్నాలకూ ఈయననే వ్యూహకర్త అని చెపుతారు. మన దేశంలో గిరీశం వంటి ఆషాడభూతులు తయారు కావడానికి ఇటువంటి మ్యాకవెల్లిల ఆలోచనలే మూలం. ప్రపంచ బ్యాంక్ సీఈఓలు.. ప్రజలు ఎన్నుకుంటున్న ముఖ్యమంత్రులుగా ఉన్నంత కాలం మనకు మ్యాకవెల్లి, గిరీశాల పోలికలు రోజూ తటస్థిస్తూనే ఉంటాయి. కనుక ఇకనైనా మనుషుల భాషలో మాట్లాడుకుందాం. మనకు అర్థం కాని భాష మాట్లాడి, మన భాష అర్థం కాని ప్రాణు లను వాటి మానాన వాటిని వదిలేద్దాం. తాను పొత్తు పెట్టు కున్న బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జంతు ప్రేమికు రాలు మేనకా గాంధీ గురించైనా ఈ సూచనను చంద్రబాబు నాయుడు పాటిస్తాడని ఆశిస్తాను. వరవరరావు వ్యాసకర్త విరసం వ్యవస్థాపక సభ్యుడు