‘మజ్దూర్‌ సంఘటన్‌’పై నిషేధం ఎత్తేయాలి | varavara rao on Mazdoor Sangathan | Sakshi

‘మజ్దూర్‌ సంఘటన్‌’పై నిషేధం ఎత్తేయాలి

Jan 2 2018 2:51 AM | Updated on Jan 2 2018 2:51 AM

varavara rao on Mazdoor Sangathan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జార్ఖండ్‌లో మజ్దూర్‌ సంఘటన్‌ సమితిపై నిషేధం విధిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రఘువర్‌ దాస్‌ నిర్ణయం తీసుకోవడాన్ని రివల్యూషనరీ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ ఖండించింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు ఉద్దేశం వెల్లడించాలని ఫ్రంట్‌ అధ్యక్షుడు వరవరరావు సోమవారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

అక్కడి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడుతున్న వారిని అణగదొక్కాలనే కుట్ర సాగుతోందని వ్యాఖ్యానించారు. వెంటనే సంఘటన్‌ సమితిపై బేషరతుగా నిషేధం ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజా పోరాటాలపై పోలీసు చర్యలను వెంటనే నిలిపేయాలని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement