raghuvar Das
-
జార్ఖండ్ ఫలితాలపై స్పందించిన మోదీ, షా
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి షాకింగ్ ఫలితాలు ఎదురయ్యాయి. మొత్తం 81 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం కాంగ్రెస్-జేఎంఎం కూటమి అత్యధికంగా 47 స్థానాల్లో విజయం సాధించింది. మూడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికారం బీజేపీ కేవలం 25 స్థానాలకు పరిమితం అయ్యింది. ఇతరులు 9 స్థానాల్లో విజయం నమోదు చేశారు. దీంతో ముఖ్యమంత్రి పదవికి రఘువర్‌దాస్ రాజీనామా చేశారు. ఫలితాల అనంతరం సోమవారం సాయంత్రం 7 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ ద్రౌపది మూర్మాకు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్లు తెలిపారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. కాగా ఫలితాలపై కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మోదీ పాలనపై ప్రజా తీర్పు వెలువడిందని అభిప్రాయపడుతున్నారు. అభినందనలు: మోదీ, షా జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా స్పందించారు. కాంగ్రెస్-జేఎంఎం కూటమికి అభినందనలు తెలిపారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నారు. పాలనలో కూటమికి అంతామంచి జరగాలని వారు ఆకాంక్షించారు. జార్ఖండ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఓ ప్రకటన విడుదల చేశారు. -
23న ‘ఆయుష్మాన్ భారత్’
రాంచీ/న్యూఢిల్లీ: ఆగస్టు 15న ఎర్రకోట సాక్షిగా ప్రకటించిన ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ఈ నెల 23న ప్రధాని మోదీ జార్ఖండ్ నుంచి ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని జార్ఖండ్ ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. ‘ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకాన్ని జార్ఖండ్ నుంచి ప్రారంభించాలని ప్రధాని నిర్ణయించడం మాకు గర్వకారణం’ అని జార్ఖండ్ ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. రాష్ట్రంలోని 3.25 కోట్ల మంది ప్రజలతో సహా భారతీయులంతా ఈ చారిత్రక సందర్భం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చైనా పర్యటనలో ఉన్న జార్ఖండ్ సీఎం రఘువర్ దాస్ ట్వీట్ చేశారు. సెప్టెంబర్ 23న ఈ కార్యక్రమం సందర్భంగా.. కోడర్మాలో మెడికల్ కాలేజీకి, చాయ్‌బాసాలో కేన్సర్ ఆసుపత్రికి మోదీ శంకుస్థాపన చేయనున్నారు. బిర్సాముండా జైలు పునరుద్ధరణ పనులనూ మోదీ ప్రారంభిస్తారు. ఆయుష్మాన్ భారత్ భేష్! కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆయుష్మాన్ భారత్’ కార్యక్రమంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు కురిపించింది. 50 కోట్ల మంది పేదలకు (10కోట్ల కుటుంబాలకు) ఏడాదికి రూ.5లక్షల ఆరోగ్య బీమా అందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న చొరవ భేష్ అని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అభినందించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకమని.. ప్రధాని చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. ‘సార్వత్రిక ఆరోగ్య బీమా కార్యక్రమమైన ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని చేపట్టడం గొప్ప మార్పుకు సంకేతం. ప్రధానికి కృతజ్ఞతలు. ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు కృతజ్ఞతలు’ అని టెడ్రోస్ గురువారం ీæ్వట్ చేశారు. డబ్ల్యూహెచ్‌వో డీజీకి కేంద్ర మంత్రి నడ్డా ధన్యవాదాలు తెలిపారు. ఆరోగ్య సంరక్షణ అందరికీ అందాలనేదే మోదీ లక్ష్యమన్నారు. ‘డాక్టర్ టెడ్రోస్ మీతో సమావేశం ఫలప్రదంగా జరిగింది. అందరికీ ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండాలని మోదీ సంకల్పించారు. 50 కోట్ల మందికి (అమెరికా, కేనడా, మెక్సికో దేశాల జనాభా కలిపితే) ఒక్కొక్కరికి రూ. 5లక్షల ఆరోగ్య బీమా అందుబాటులో ఉంటుంది’ అని నడ్డా ట్వీట్ చేశారు. -
‘మజ్దూర్ సంఘటన్’పై నిషేధం ఎత్తేయాలి
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్‌లో మజ్దూర్ సంఘటన్ సమితిపై నిషేధం విధిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రఘువర్ దాస్ నిర్ణయం తీసుకోవడాన్ని రివల్యూషనరీ డెమొక్రటిక్ ఫ్రంట్ ఖండించింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు ఉద్దేశం వెల్లడించాలని ఫ్రంట్ అధ్యక్షుడు వరవరరావు సోమవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. అక్కడి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడుతున్న వారిని అణగదొక్కాలనే కుట్ర సాగుతోందని వ్యాఖ్యానించారు. వెంటనే సంఘటన్ సమితిపై బేషరతుగా నిషేధం ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ప్రజా పోరాటాలపై పోలీసు చర్యలను వెంటనే నిలిపేయాలని పేర్కొన్నారు. -
జార్ఖండ్ సీఎం హెల్మెట్ లేకుండానే...
-
'యోగా చేసి అహంకారం తగ్గించుకోండి'
జంషెడ్ పూర్: బీహార్ సీఎం నితీశ్ కుమార్ అహంకారి, గర్విష్ఠి అని బీజేపీ నాయకుడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్ దాస్ ధ్వజమెత్తారు. తన పొగరు తగ్గించుకునేందుకు నితీశ్ నిత్యం యోగా చేయాలని సూచించారు. యోగా చేయడానికి సరిపోయే ఒళ్లేనా నీది, ప్రతి రోజూ శ్రద్ధగా ఇంట్లోనే యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కు నితీశ్ సలహాయిచ్చారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా పాట్నాలో ఈనెల 21న జరిగే కార్యక్రమంలో అమిత్ షా పాల్గొనబోతున్నారు. ఆయనను ఉద్దేశించే నితీష్ ఈ విమర్శలు చేశారు. నితీశ్ వ్యాఖ్యలపై రఘువర్ ఘాటుగా విధంగా స్పందించారు. త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆయనకు గుణపాఠం చెబుతారని అన్నారు. బీహార్ ఎన్నికల్లోనూ జార్ఖండ్ తరహా ఫలితాలే వస్తాయని పేర్కొన్నారు. -
జార్ఖండ్ సీఎంగా రఘువర్ దాస్ ప్రమాణం
-
జార్ఖండ్ సీఎంగా రుఘువర్ దాస్ ప్రమాణ స్వీకారం
రాంచీ : జార్ఖండ్ సీఎంగా రఘువర్ దాస్ ప్రమాణ స్వీకారం చేశారు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని బిర్సాముండా ఫుట్‌బాల్ స్టేడియంలో ఆదివారం రఘువర్ దాస్ చేత రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అహ్మద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి పలువురు కేంద్ర మంత్రులతోపాటు రాష్ట్రానికి చెందిన నేతలు, భారీగా బీజేపీ కార్యకర్తలు హాజరయ్యారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉంది. కానీ ఢిల్లీలో దట్టమైన మంచు ఆవరించి ఉంది. దాంతో విమాన ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రధాని మోదీ ప్రయాణం రద్దు అయింది. 81 స్థానాలు ఉన్న జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీకి ఇటీవల అయిదు దశలుగా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి బ్రహ్మరథం పట్టారు. దాంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అత్యధిక గిరిజనులు గల జార్ఖండ్ రాష్ట్రానికి తొలి గిరిజనేతర సీఎంగా రఘువర్ దాస్ ప్రమాణ స్వీకారం చేశారు. -
నేడు రఘువర్ దాస్ ప్రమాణం
హాజరుకానున్న ప్రధాని మోదీ న్యూఢిల్లీ/రాంచీ: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా రఘువర్ దాస్ ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజధాని రాంచీలోని బిర్సా ముండా ఫుట్‌బాల్ స్టేడియంలో ప్రమాణస్వీకారం జరగనుందని రాష్ట్ర హోం కార్యదర్శి ఎన్.ఎన్. పాండే తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు శివరాజ్‌సింగ్ చౌహాన్, రమణ్‌సింగ్, ఇతర నేతలు హాజరవుతారని చెప్పారు. మరోవైపు దాస్ శనివారం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో ఢిల్లీలో సమావేశమై ప్రభుత్వ కూర్పుపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ షాతో సమావేశం సానుకూలంగా సాగిందని, పార్టీ ఆదేశాల ప్రకారం తాను నడుచుకుంటానని చెప్పారు. గిరిజన జనాభా ఎక్కువగా ఉండే జార్ఖండ్‌లో గిరిజనేతరుడైన దాస్‌కు బీజేపీ అధిష్టానం సీఎం పగ్గాలు అప్పగించిన నేపథ్యంలో మంత్రివర్గంలో గిరిజనులకు తగిన ప్రాతినిధ్యం కల్పించడంపై ఈ భేటీ సాగినట్లు తెలుస్తోంది. -
జార్ఖండ్‌లో గిరిజనేతర సీఎం
-
జార్ఖండ్‌లో గిరిజనేతర సీఎం
శాసనసభాపక్ష నేతగా రఘువర్ దాస్ ఎన్నిక 28న సర్కారు ఏర్పాటుకు నిర్ణయం రాంచీ: జార్ఖండ్‌లో బీజేపీ సర్కారు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. పార్టీ సీనియర్ నేత, జాతీయ ఉపాధ్యక్షుడు రఘువర్‌దాస్ రాష్ర్ట తొలి గిరిజనేతర సీఎం కానున్నారు. ఈ మేరకు ఆయన పార్టీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో రఘువర్‌దాస్ పేరును పలువురు సీనియర్ నేతలు ప్రతిపాదించారు. మిగతావారంతా అందుకు మద్దతు ప్రకటించినట్లు పార్టీ జాతీయ పరిశీలకుడు జేపీ నద్దా పేర్కొన్నారు. గతంలో రాష్ర్ట ఉపముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన దాస్ ఈసారి బీజేపీ, దాని మిత్రపక్షం ఏజేఎస్‌యూ కూటమి ఏర్పాటు చేసే ప్రభుత్వానికి నేతృత్వం వహించనున్నారు. బాబూలాల్ మరాండీ, అర్జున్ ముండా తర్వాత బీజేపీ తరఫున సీఎం అవుతున్న మూడో వ్యక్తి రఘువర్ దాస్. రాష్ర్ట ప్రజలకు అవినీతి రహిత పాలన అందిస్తామని, పేదలు, అసంఘటితరంగ కార్మికుల సంక్షేమంపై తమ ప్రభుత్వం దృష్టి సారిస్తుందని శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన తర్వాత దాస్ వెల్లడించారు. అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల బృందంతో కలిసి రాష్ర్ట గవర్నర్ సయ్యద్ అహ్మద్ వద్దకు వె ళ్లి కలిశారు. ఈ నెల 28న ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని వెల్లడించారు. తమ ప్రతిపాదనకు గవర్నర్ అంగీకరించారని ఈ భేటీ అనంతరం దాస్ తెలిపారు. జార్ఖండ్ రాష్ర్టం ఆవిర్భవించిన తర్వాత గత 14 ఏళ్లలో ఏర్పడుతున్న పదో ప్రభుత్వమిది. ఛత్తీస్‌గఢ్‌లోని బోయిర్ది నుంచి 1960లో వలస వచ్చిన ‘తెలి’ కులానికి చెందిన నేత రఘువర్ దాస్. ఆయన తండ్రి మన్దాస్. గత తొమ్మిది ప్రభుత్వాలలో గిరిజనులైన బాబూలాల్ మరాండీ (ఒకసారి), అర్జున్ ముండా (మూడు సార్లు), శిబూసోరెన్ (మూడు సార్లు), మధు కోడా (ఒకసారి), హేమంత్ సోరెన్ (ఒకసారి) ముఖ్యమంత్రులుగా పనిచేశారు. మరోవైపు గిరిజనేతర వ్యక్తి సీఎం కాబోతుండటంపై జార్ఖండ్ పీపుల్స్ పార్టీ(జేపీపీ) నిరసన వ్యక్తం చేసింది. రఘువర్‌దాస్ ప్రమాణ స్వీకారం రోజున రాష్ర్ట బంద్‌కు పిలుపునిచ్చింది. గిరిజనుల అభివృద్ధి కోసమే ప్రత్యేక రాష్ర్టం ఏర్పడిందని, గిరిజనులను బీజేపీ గౌరవించడం లేదని జేపీపీ విమర్శించింది. జేడీయూ నేత నితీశ్‌కుమార్ కూడా బీజేపీ తీరును తప్పుబట్టారు. గిరిజనేతర వ్యక్తిని సీఎంగా ఎంపిక చేయడం ద్వారా గిరిజనులపై బీజేపీ అపనమ్మకాన్ని చాటుకుందని విమర్శించారు. విద్యార్థి నేత నుంచి ముఖ్యమంత్రి పదవికి... రఘువర్ దాస్ విద్యార్థి ఉద్యమ నేతగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ 1976-77లో ప్రారంభించిన విద్యార్థి ఉద్యమంలో ఆయన పాలుపంచుకున్నారు. జంషెడ్పూర్ సహకార కళాశాలలో విద్యార్థి సంఘానికి నాయకత్వం వహించిన అనంతరం, సాధారణ కార్యకర్తగా బీజేపీలో చేరారు. జంషెడ్పూర్ (ఈస్ట్) అసెంబ్లీ స్థానంలో 1995 నుంచి ఐదుసార్లు ఎన్నికయ్యారు. బాబూలాల్ మరాండీ మంత్రివర్గంలో ఒకసారి, అర్జున్‌ముండా ప్రభుత్వంలో రెండుసార్లు మంత్రిగా ఉన్నారు. 2009లో శిబూసోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి అయ్యారు. ఆర్థిక, కార్మిక, పట్టణాభివృద్ధి శాఖలకు కేబినెట్ మంత్రిగా పనిచేశారు. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడుగా రెండుసార్లు పనిచేశారు. అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడయ్యాక, దాస్ ఇటీవలే బీజేపీ ఉపాధ్యక్షుడయ్యారు. -
జార్ఖండ్ సీఎం రేసులో ముగ్గురు!
పోటీలో ఒక గిరిజన, ఇద్దరు గిరిజనేతర నేతలు రఘువర్, సరయూరాయ్, సుదర్శన్లలో ఒకరికి చాన్స్ రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న బీజేపీ... ముఖ్యమంత్రి అభ్యర్థి కోసం వెతుకులాట మొదలుపెట్టింది. గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రంలో గత సంప్రదాయానికి భిన్నంగా గిరిజనేతరుడి కి సీఎం పగ్గాలు అప్పగించాలా? లేక సంప్రదాయాన్ని గౌరవిస్తూ గిరిజనుడికే ఆ అవకాశం ఇవ్వాలా? అనే ప్రశ్న బీజేపీ నాయకత్వాన్ని వేధిస్తోంది. ఒకవేళ గిరిజనేతర సీఎంకు పదవి కట్టబెట్టాలనుకుంటే బీజేపీ ఉపాధ్యక్షుడు రఘువర్ దాస్తోపాటు పార్టీ సీనియర్ నేత సరయూరాయ్లు ముందంజలో ఉన్నారు. గిరిజన నేతను గద్దెనెక్కించాలనుకుంటే మాత్రం కేంద్ర మంత్రి సుదర్శన్ భగత్‌కు అవకాశం దక్కనుంది. రాష్ట్రంలో బీజేపీ గిరిజన ముఖంగా పేరుగాంచిన మాజీ సీఎం అర్జున్ ముండా ఈ ఎన్నికల్లో ఓడిపోవడంతో ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ గిరిజన నాయకుడిగా సుదర్శన్ భగత్ ఉన్నారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దాస్...సీఎం పదవిపై కొన్నేళ్ల కిందటే తన ఆకాంక్షను బయటపెట్టారు. సీఎం రేసులో ఉన్నారా? అని దాస్‌ను విలేకరులు మంగళవారం ప్రశ్నించగా సీఎం ఎంపిక అంశాన్ని పార్టీ కేంద్ర నాయకత్వానికే అప్పగించినట్లు చెప్పారు. ఇక సరయూ ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడనే పేరుంది. మరోవైపు ఆర్ఎస్ఎస్, ఏబీవీపీలో పనిచేసిన సుదర్శన్ భగత్ ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త కె.సి. సుదర్శన్ ఎక్కడ సమావేశాలు నిర్వహించినా భగత్ ఉండేవారు. ఆయన 2005-06లో అర్జున్ ముండా ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో గిరిజనేతర నేతకు సీఎం పదవి ఇవ్వాలన్న ప్రతిపాదనను ఎమ్మెల్యేలు (మొత్తం 37 మంది బీజేపీ ఎమ్మెల్యేలలో 10 మంది గిరిజనులు) వ్యతిరేకిస్తేభగత్ పేరు సీఎం రేసులో తెరపైకి వచ్చే అవకాశం ఉంది. కాగా, వీరితోపాటు కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా తనయుడు జయంత్ సిన్హా, శివ్‌శంకర్ ఒరావోన్లు కూడా రేసులో ఉండొచ్చని తెలుస్తోంది.