!['యోగా చేసి అహంకారం తగ్గించుకోండి'](/styles/webp/s3/article_images/2017/09/3/41434345614_625x300.jpg.webp?itok=x5BwjiEG)
'యోగా చేసి అహంకారం తగ్గించుకోండి'
జంషెడ్ పూర్: బీహార్ సీఎం నితీశ్ కుమార్ అహంకారి, గర్విష్ఠి అని బీజేపీ నాయకుడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్ దాస్ ధ్వజమెత్తారు. తన పొగరు తగ్గించుకునేందుకు నితీశ్ నిత్యం యోగా చేయాలని సూచించారు. యోగా చేయడానికి సరిపోయే ఒళ్లేనా నీది, ప్రతి రోజూ శ్రద్ధగా ఇంట్లోనే యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కు నితీశ్ సలహాయిచ్చారు.
ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా పాట్నాలో ఈనెల 21న జరిగే కార్యక్రమంలో అమిత్ షా పాల్గొనబోతున్నారు. ఆయనను ఉద్దేశించే నితీష్ ఈ విమర్శలు చేశారు. నితీశ్ వ్యాఖ్యలపై రఘువర్ ఘాటుగా విధంగా స్పందించారు. త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆయనకు గుణపాఠం చెబుతారని అన్నారు. బీహార్ ఎన్నికల్లోనూ జార్ఖండ్ తరహా ఫలితాలే వస్తాయని పేర్కొన్నారు.