జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): కేంద్రంలోని బీజేపీ పాలకుల అండతో పేట్రేగిపోతున్న బ్రాహ్మణీయ హిందూ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావు అన్నారు. మహబూబ్‌నగర్‌లో శుక్రవారం జరిగిన విరసం సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహబూబ్‌నగర్‌లో శని, ఆదివారాల్లో విరసం ఉమ్మడి రాష్ట్ర 26వ మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ సభల్లో ఆరు అంశాలపై చర్చ జరగనుందని, బ్రాహ్మణీయ హిందూ ఫాసిజంపై ప్రధాన చర్చ ఉంటుందని వెల్లడించారు. సభలకు సియాసత్ ఎడిటర్ జహీర్ అక్తర్, ప్రొఫెసర్ హరగోపాల్, వీర్‌సతేదార్, ఆనంద్ తదితరులు హాజరు కానున్నారని వరవరరావు పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామిక వాదులపై ఉద్దేశ పూర్వకంగానే దాడులు జరుగుతున్నాయని వరవరరావు ఆరోపించారు. బ్రాహ్మణీయ హిందూ ఫాసిజంపై ఉర్దూలో ముద్రించిన కరపత్రాలను విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment