సాక్షి,విశాఖపట్నం: ఆంధ్రా, ఒడిశా సరిహద్దుతోపాటు విశాఖ ఏజెన్సీలోని మారుమూల గ్రామాల్లో మావోయిస్టుల ఉద్యమం క్రమంగా నీరుగారుతోంది. పార్టీకి ఏవోబీ వ్యాప్తంగా గిరిజనుల నుంచి ఆదరణ కరువైంది. గతరెండేళ్ల వ్యవధిలో 9 ఎదురుకాల్పలు సంఘటనలుజరగగా.. 12 మంది మావోయిస్టులు, దళ సభ్యులను పార్టీ పోగొట్టుకుంది. 29 మందిమంది మావోయిస్టులు, దళ సభ్యులు ప్రభుత్వానికి సరెండర్ అయ్యారు. ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన పోలీసు యంత్రాంగమంతా మారుమూల
గ్రామాల్లో గిరిజనుల అభివృద్ధి నినాదాన్ని విస్తృతం చేసింది.
రామ్‌గూడ అటవీ ప్రాంతంలో నాలుగేళ్ల కిందట జరిగిన ఎన్ కౌంటర్ మావోయిస్టులకు పెద్ద నష్టంగా చెప్పవచ్చు. ఈ ఘటనలో 33మంది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో మావోయిస్టు అగ్రనేత ఆర్‌కే కుమారుడు మున్నాతోపాటు, అనేకమంది కీలక మావోయిస్టులను ఆ పార్టీ కోల్పోయింది. ఆ ఎన్‌కౌంటర్‌లో తప్పించుకున్న మావోయిస్టు నేతలుఆర్‌కే, ఉదయ్, చలపతి, అరుణలు మరలా మావోయిస్టు పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకుప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయినా సరే ఫలితం కనిపించడం లేదు. ఇటీవల కొయ్యూరు మండలం తీగలమెట్ట అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్‌లోను ఐదుగురు కీలక నేతలను పోగొట్టుకోవడంమావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బ. అంతేకాక ఇటీవలఅమరవీరుల వారోత్సవాలు విఫలం కావడం..తాజాగా గురువారం డీజీపీ సమక్షంలో ఆరుగురుమావోయిస్టు కీలక నేతల లొంగిపోవడం పార్టీ ప్రాభవానికివిఘాతమే.
తగ్గిన కార్యకలాపాలు
ఏవోబీలో మావోయిస్టు దళాలు పట్టు తప్పుతున్నాయి. ఒడిశాలోని కలిమెల, నందపూర్,గుమ్మా, నారాయణపట్నం, పెదబయలు, కోరుకొండ దళాల్లో సభ్యుల సంఖ్య తగ్గడంతో దళాల కార్యకలపాలు తగ్గాయని సమాచారం. గాలికొండ దళంలో10మంది, పెదబయలు, కోరుకొండ దళాలకు చెందిన 25మంది, ఒడిశాలోని కటాఫ్ ఏరియాలో50మంది వరకు మావోయిస్టులు గతంలో పనిచేసేవారు.ఈ రెండేళ్ల వ్యవధిలో వారి సంఖ్య 50కి తగ్గినట్టు ప్రచారం జరుగుతుంది. దీంతో దళాలు తగ్గి
ప్రస్తుతం ఒడిశాలోని కటాఫ్ ఏరియా, ఏవోబీస్పెషల్ జోన్ కమిటీలు మాత్రమే పనిచేస్తున్నాయని తెలుస్తోంది. ఏవోబీ వ్యాప్తంగా పోలీసునిర్బంధం అధికమైంది. విశాఖ ఏజెన్సీతోపాటు ఒడిశాలోని కోరాపుట్టు, మల్కన్ గిరి జిల్లాల్లో పోలీసుయంత్రాంగం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
మావోయిస్టులు సురక్షిత ప్రాంతాలకే పరిమితమవుతున్నారు.పోలీసులకు కలిసొచ్చిన అభివృద్ధి నినాదం మావోయిస్టులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని కొంతకాలంగా చేస్తున్న ప్రచారం పోలీసు యంత్రాంగానికి అనుకూలమైంది. ఇక్కడ అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రకృతిపరమైన సమస్యలున్నాయి. కష్టసాధ్యమైనా వీటిని అధిగమిస్తూ ప్రభుత్వ యంత్రాంగం సౌకర్యాలు కల్పిస్తోంది. పోలీసులు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి గిరిజనులకు దగ్గరవుతున్నారు. ఇన్ఫార్మర్ల పేరిట మావోయిస్టులు గిరిజనులను హతమార్చడం కూడా పోలీసులకు ప్రధాన ఆయుధమైంది. ఈ నేపథ్యంలో మారుమూల గ్రామాలలో గిరిజనులంతా బహిరంగంగానే మావోయిస్టులకు వ్యతిరేకంగా అభివృద్ధి నినాదంతో ర్యాలీలు చేస్తున్నారు. మావోయిస్టులకు గతంలో వలేమారుమూల గ్రామాల గిరిజనుల సహకారం తగ్గిందని పోలీసులు భావిస్తున్నారు. మావోయిస్టు కీలకనేతలు, మిలీషియా సభ్యులు కూడా ఇటీవల కాలంలో లొంగిపోవడానికి సిద్ధమవుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment