వివరాలను వెల్లడిస్తున్న ఓఎస్‌డీ ఉదయ్‌కుమార్ రెడ్డి
సాక్షి, పాల్వంచరూరల్: సీపీఐ (ఎంఎల్ న్యూడెమోక్రసీ) ఆజాద్ దళానికి చెందిన ఇద్దరు అజ్ఞాత దళ సభ్యులను, ఒక తుపాకీతో పాటు అరెస్ట్‌చేశారు. వారి వద్ద నుంచి రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి శుక్రవారం సీఐ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఓఎస్డీ ఉదయ్‌కుమార్‌రెడ్డి వివరాలను వెల్లడించారు. మండల పరిధిలోని ఉల్వనూరు బంజర, ఉల్వనూరు గ్రామాలకు చెందిన పూనెం నర్సింహారావు, అలియాష్ రమేష్, నెట్టి అమృతరావు కొంతకాలంగా ఎన్డీ ఆజాద్ దళంలో అజ్ఞాత దళ సభ్యులుగా పనిచేస్తున్నారు.
గురువారం రాత్రి ఎస్‌ఐ అనిల్ పెట్రోల్ నిర్వహిస్తుండగా బం జర ఏరియాలో ద్విచక్రవాహనంపై వెళ్తుండగా అనుమానాస్పద స్థితిలో కన్పించిన ఇరువురుని అదుపులోకి తీసుకుని విచారించడం జరిగింది. నర్సింహారావు 1998–2005 వరకు జనశక్తి గ్రూపు రాజన్న దళంలో పనిచేశాడు. 2005లో పోలీసులకు లొంగిపోయిన తర్వాత మళ్లీ ఎన్డీ రాయల వర్గంలో ఆర్గనైజర్‌గా పనిచేస్తూ ఆజాద్ దళంలో పని చేస్తున్నాడు. అతని వద్ద 303 తూపాకీ, రైఫిల్ బుల్లెట్లు 30, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి శుక్రవారం అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ.రాఘవేంద్రరావు, ఎస్‌ఐ.అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment