ఎన్టీఆర్ భవన్లో ప్రభుత్వ తీర్మానాల తయారీ | NTR Bhavan, the resolution of the Government | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ భవన్లో ప్రభుత్వ తీర్మానాల తయారీ

Published Sun, Sep 7 2014 1:28 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 PM

ఎన్టీఆర్ భవన్లో  ప్రభుత్వ తీర్మానాల తయారీ

ఎన్టీఆర్ భవన్లో ప్రభుత్వ తీర్మానాల తయారీ

టీడీపీ నాలెడ్జ్ సెంటర్‌లో తయారైన బీసీ తీర్మానం
అవే ప్రతులను మండలిలో పంచిపెట్టిన సర్కారు

 
హైదరాబాద్: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కి, ప్రభుత్వానికి తేడా లేకుండా పోయింది. అధికార పార్టీ చట్టసభలను సైతం చులకన చేస్తోంది. ప్రభుత్వం తయారు చేయాల్సిన బీసీ తీర్మానం ప్రతులను ఎన్టీఆర్ భవన్‌లో తయారుచేయడమే కాకుండా శనివారం ఆ తీర్మానం ప్రతులను శాసనమండలిలో సభ్యులకు అందజేశారు. (తీర్మా నం ప్రతి పేజీ చివర్లో ‘సి/డాటాపీఎం05/టీడీపీ నాలెడ్జి సెంటర్ పేజి నెం.28 అని స్పష్టంగా ఉం ది). దీనిపై పెద్దల సభలో సభ్యులు తీవ్ర అభ్యం తరం వ్యక్తంచేస్తూ ప్రభుత్వంపై దండెత్తారు. ఒక పార్టీ కార్యాలయంలో తయారైన తీర్మానాన్నిమండలిలో ఎలా అనుమతిస్తారంటూ నిలదీశా రు. మండలి చైర్మన్ చక్రపాణి అసహనం వ్యక్తం చేశారు. మండలిలో విషయం బయటపడటం తో శాసనసభకు వచ్చేసరికి దాన్ని సవరించారు. టీడీపీ ఆఫీసులో తయారైనట్లు తెలిపే లైన్‌ను చించేసి కొత్తగా జిరాక్సు ప్రతులు తయారుచేసి ఇచ్చారు. సభలో సీఎం చంద్రబాబు బీసీల కోసం తీర్మానం పెట్టినప్పుడు టీడీపీ మేనిఫెస్టో పుస్తకాన్ని చదవడం ఆశ్చర్యానికి గురిచేసింది.

మండలిలో తీవ్ర నిరసన
 
మంత్రి కొల్లు రవీంద్ర బీసీ తీర్మానం మండలిలో ప్రవేశపెట్టగానే విపక్ష సభ్యులందరూ మూకుమ్మడిగా తీవ్ర నిరసన తెలిపారు. ఆ ప్రతులు టీ డీపీ ఆఫీసులోని నాలెడ్జ్ సెంటర్ నుంచి తయా రైనట్లు ముద్రించి ఉండటాన్ని కాంగ్రెస్ పక్షనేత సి.రామచంద్రయ్య తప్పుపట్టారు. పార్టీ కార్యాలయంలో ముద్రించిన ప్రతులను సభలో ప్రవేశపెట్టడానికి అర్హత లేదని కాంగ్రెస్ పార్టీ సభ్యుడు మహమ్మద్ జానీ ప్రతిని సభలో చింపేశారు.  చైర్మన్ ఎ.చక్రపాణి కలుగచేసుకొని ఈ పద్ధతి మంచిదికాదని మంత్రికి అక్షింతలు వేశారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఇకముందు ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. తర్వాత హడావిడిగా టీడీపీ నాలెడ్జ్ సెంటర్ అన్నది తొలగించి కొత్త ప్రతులను సభ్యులకు పంపిణీ చేశారు.

రాజకీయ ప్రయోజనాల కోసమే...

వాస్తవానికి శుక్రవారమే డిమాండ్లు అన్నీ పూర్తవ్వడంతో రాజకీయ ప్రయోజనాల కోసం శని వారం సభలో ఏదో ఒక తీర్మానం ప్రవేశపెట్టాలని టీడీపీ నిర్ణయించుకుంది. శుక్రవారం రాత్రి బాబు సమక్షంతో పార్టీ నేతలు సమావేశమై తమకు రాజకీయంగా లాభం చేకూర్చే ప్రచారం జరిగేలా తీర్మానం ఏది చేస్తే బాగుంటుందోనని బుర్రలు బద్దలుకొట్టుకున్నారు. శనివారం బాబు తో ఆయన చాంబర్లో నాయకులు సమావేశమై తర్జనభర్జనపడ్డారు. చివరకు బీసీలకు చట్టసభల్లో  33.33 శాతం రిజర్వేషన్లు తదితర అంశాలపై కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేయాలని నిర్ణయించారు. తీర్మానం గురించి స్పీకర్ కోడెల కు తెలియచేశారు. తీర్మానం కాపీని ప్రభుత్వం అసెంబ్లీకి, మండలికి సమర్పించాలి. కానీ తీర్మా నం కాపీని ప్రభుత్వంతో కాక  టీడీపీ కార్యాలయమైన ఎన్టీఆర్ ట్రస్టుభవన్లో రూపొందించారు.

కొసమెరుపు

కేంద్రంలో 25 శాతం నిధులను బీసీలకు ఉప ప్ర ణాళిక కేటాయించాలని చెబుతున్న బాబు రాష్ట్ర బడ్జెట్లో వారికి మొండిచేయే చూపించారు. బీసీలకు బడ్జెట్లో నిధులు ఇచ్చారంటే అదీలేదు. బా బు చేసిన సూచనల ప్రకారం 25 శాతం నిధులు బీసీలకు ఇవ్వాలంటే రాష్ట్ర బడ్జెట్లో రూ.27,750 కోట్లు కేటాయించాలి. కానీ బాబు బీసీలకు విదిలించింది రూ.3,130 కోట్లు మాత్రమే.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement