legislation
-
తండ్రికి కూడా ప్రసూతి సెలవులు ఇవ్వాల్సిందే!
తండ్రికీ కావాలి ప్రసూతి సెలవు తల్లికి ప్రసూతి సెలవు ఇస్తున్నట్టే తండ్రికి కూడా ప్రసూతి సెలవు ఇవ్వడం గురించి ఆలోచించే సమయం వచ్చేసిందని మద్రాసు హైకోర్టు వ్యాఖ్యానించింది. భార్య ప్రసవ సమయంలో బాలింతను, నవజాత శిశువును చూసుకోవడానికి తండ్రికి సెలవు ఇవ్వకతప్పదని, ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాలు శాసనపరమైన చట్టాలు తేవాలని జస్టిస్ విక్టోరియా గౌరి సూచించారు. నిజమే. తండ్రికి సెలవు భార్యభర్తల మధ్య అనేక చికాకులను దూరం చేయగలదు. ఒక పరిశీలన. బిడ్డకు జన్మనివ్వడమంటే సమాజానికి కొత్త సభ్యుణ్ణి ఇవ్వడమే. పుట్టిన బిడ్డ తల్లిదండ్రులకు సంతానం కావచ్చు కాని సమాజానికి ప్రతినిధే. బిడ్డకు సురక్షితంగా జన్మనివ్వడంలో తల్లిదండ్రుల బాధ్యత ఎంతో, ఆ తల్లిదండ్రులకు తగిన సౌకర్యాలు కల్పించడంలో సమాజానిదీ అంతే బాధ్యత. కనేందుకు ఆస్పత్రి, పెంచేందుకు తండ్రికి కనీస ఆదాయం లేకపోతే సమాజం తప్పవుతుంది. గతంలో స్త్రీ ఇంటి పట్టునే ఉండేది. ఉమ్మడి సంసారాల్లో కాన్పులకు సులువుగా సాయం దొరికేది. కాని ఇప్పుడు ఇలా తాళి కడితే అలా విడిగా కాపురం పెట్టే పరిస్థితులు వచ్చాయి. దానివల్ల పిల్లల్ని కనడం, పెంచడం చాలా పెద్ద బాధ్యతగా మారింది తల్లిదండ్రులకు. ఉద్యోగం చేసే స్త్రీలకు ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో ప్రసూతి సెలవులు మంజూరు అవుతున్నా ఆ స్త్రీలకు, పుట్టిన శిశువులకు కాన్పు సమయంలో తోడుగా ఉండాల్సిన పురుషులకు మాత్రం సెలవు గురించి ఇంకా ఆలోచన రావడం లేదు. సమాజం ఇంకా అంత‘నాగరికం’గా ఆలోచించడం లేదు. కాని తాజా ఘటన ఈ అంశాన్ని చర్చకు తెచ్చింది. కోర్టుకెక్కిన తండ్రి తమిళనాడులోని తెన్‌కాశీలో ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న బి.శరవణన్ తన భార్యకు కాన్పు సమయంలో తోడు ఉండేందుకు 90 రోజుల సెలవు అడిగాడు. దానికి కారణం అతని భార్య ఐ.వి.ఎఫ్. ద్వారా గర్భం దాల్చడమే. ఐ.వి.ఎఫ్.ద్వారా గర్భం దాల్చితే కాన్పు అయ్యేంత వరకూ జాగ్రత్తగా ఉండాలి. అందుకే సెలవు అడిగాడు. పరిస్థితి విన్న అధికారులు శాంక్షన్ చేశారు. కాని ఆ సెలవు ఉపయోగంలోకి రాక ముందే అతను విధుల్లో లేకపోతే లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయని సెలవు కేన్సిల్ చేశారు. దాంతో శరవణన్ కోర్టుకు వెళ్లాడు. డెలివరీ డేట్ మే 30 కనుక కోర్టు మే 1 నుంచి సెలవు ఇమ్మంది. అధికారులు 30 రోజులు సెలవు మంజూరు చేశారు. కాని డెలివరీ మే 31న జరిగింది. దాంతో మే 31న శరవణన్ విధులకు హాజరు కాలేకపోయాడు. అంతే కాదు సెలవు పొడగింపును కోరాడు. అధికారులు సెలవును పొడిగించకపోగా చెప్పాపెట్టకుండా విధులకు హాజరుకానందున ఎందుకు చర్య తీసుకోకూడదో జూన్ 22న వచ్చి వ్యక్తిగతంగా సంజాయిషీ ఇమ్మని ఆదేశించారు. ఆ ఆదేశాలను శరవణన్ హైకోర్టులో సవాలు చేశాడు. కోర్టు ఆ ఆదేశాలను కొట్టేస్తూ మగవారికి కూడా ప్రసూతి సెలవలు అవసరమని అభిప్రాయపడింది. ఆందోళన లేకుండా కాన్పు సమయంలో భార్యకు ఎంత ఆందోళన ఉంటుందో భర్తకూ అంతే ఆందోళన ఉంటుంది. రెండు ప్రాణాలు పరీక్ష సమయాన్ని ఎదుర్కొనే వేళ సహజంగానే లేబర్ రూమ్ బయట పురుషుడు ఒత్తిడికి లోనవుతాడు. అదొక్కటే కాదు బిడ్డ పుట్టాక భార్యకు శక్తి వచ్చే వరకు, బిడ్డ కుదుట పడేవరకు ఇంట్లో పనులు ఎన్నో ఉంటాయి. ఆస్పత్రుల చుట్టూ తిరుగుళ్లు ఉంటాయి. ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇంటి నుంచి ఫోన్ రాగానే కంగారు పడుతూ భర్తలు ఆ సమయంలో వేదన అనుభవిస్తారు. మరోవైపు తోడుండాల్సిన భర్త ఇంటి పట్టున లేకపోతే, డబ్బు సంపాదన ఎంత తప్పనిసరి అయినప్పటికీ, భార్యకు నిస్పృహ రావడం సహజం. రాత్రిళ్లు చంటి పిల్లల ఏడ్పు వల్ల ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్లాల్సిన భర్త నిద్ర చెడి చిరాకు పడితే ఆ గొడవ కాస్తా విడాకుల వరకు వెళ్లిన కేసులెన్నో. అందువల్ల భార్యతో పాటు భర్తకు సెలవులు ఇవ్వడం ఎంతో అవసరం. ‘కనేది ఆమె అయితే ఇతనికేం నొప్పి’ అని హేళన చేసే రోజులు పోయాయి. ఈ బిజీ రోజుల్లో మనిషి తోడు కష్టమైన రోజుల్లో భర్తకు భార్య, భార్యకు భర్త ఒకరికొకరై సంతానాన్ని సాకాలంటే ఇలాంటి నాగరికమైన ఆలోచనలు తప్పక చేయాల్సిందే. సమయం వచ్చేసింది మద్రాసు హైకోర్టులో ఈ కేసును విన్న జస్టిస్ ఎల్.విక్టోరియా మేరి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల్లో మగవారికి ప్రసూతి సెలవులు తప్పనిసరి చేస్తూ చట్టాలు తేవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సమస్యకు స్పందించాల్సిన సమయం వచ్చేసిందని అన్నారు. ‘పిల్లల్ని కని, పెంచడంలో స్త్రీ, పురుషులిరువురికీ సమాన బాధ్యత ఉంటుంది. ప్రపంచంలోని అనేక దేశాలు ప్రసూతి సమయంలో తల్లితోపాటు తండ్రికీ సెలవులు ఇస్తున్నాయి. అవి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రమాణాలకు సరితూగకపోయినా ఏదో ఒక మేరకు ఇస్తున్నాయి. మన దేశంలో సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ (1972) ప్రకారం భార్య ప్రసూతి సమయంలో పురుషులకు లీవ్ పెట్టే వీలు ఉంది. కాని ఆ రూల్స్ చాలా రాష్ట్రాల్లో అమలు కావడం లేదు’. –జస్టిస్ విక్టోరియా గౌరి, మద్రాసు హైకోర్టు (చదవండి: పొల్యూషన్‌కి చెక్ పెట్టేలా.. వేగన్ ఫ్యాషన్ బ్రాండ్స్! అరటిచెట్టు బెరడుతో బ్యాగ్‌లు, ఆభరణాలు) -
ఆ అధికారం వారికి లేదు: వెంకయ్య నాయుడు
న్యూఢిల్లీ: భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జాతీయ శాసనసభ్యుల సదస్సులో మాట్లాడుతూ న్యాయస్థానాలకు చట్టాల రూపకల్పనలో జోక్యం చేసుకునే హక్కు లేదన్నారు. రాజ్యాంగం న్యాయస్థానాల విధులను, చట్టసభల విధులను స్పష్టంగా వివరించిందని, మేము గొప్పంటే మేము గొప్పని ఎవ్వరూ ఆధిపత్యం ప్రదర్శించాల్సిన అవసరం లేదని అన్నారు. ఇటీవల సుప్రీం కోర్టు పార్లమెంటు చట్టం చేసే లోపు ప్రధాన ఎన్నికల కమీషనరును, ఎన్నికల కమీషనర్లను ఎన్నుకునేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో వెంకయ్య నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. శనివారం జరిగిన జాతీయ శాసనసభ్యుల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. శాసనాలను చేసే అధికారం రాజ్యాంగం శాసనసభలకు మాత్రమే ఇచ్చింది. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు చట్టాలు చేసేటప్పుడు బిల్లు ప్రయోజనాలపై కూలంకషంగా చర్చించి, వాదోపవాదాలు చేస్తారు. అనంతరం అవి ప్రజలకు ఉపయోగపడే అంశమై అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని ఆమోదయోగ్యమైతే తప్ప వాటిని ఆమోదించరు. ప్రజాస్వామ్యంలో అదొక భాగమని తెలిపారు. చట్టసభల్లో ఆమోదించిన బిల్లులు చట్టబద్ధంగానూ, రాజ్యాంగబద్ధంగానూ ఉన్నాయా? లేదా? అని మాత్రమే న్యాయవ్యవస్థ చూడాలి తప్ప చట్టాలు చేసి అధికారం రాజ్యాంగం వారికి ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఈ చట్టాలన్నిటినీ శాసనసభ నిర్ణయిస్తుంది, ఎగ్జిక్యూటివ్ అమలు చేస్తుంది. ఈ క్రమంలో ఎక్కడైనా నిబంధనలను ఉలంఘించినట్లు అనిపిస్తే ఎవ్వరైనా కోర్టును ఆశ్రయించవచ్చని, అలాంటి సందర్భాల్లో మాత్రం వారు సత్వర న్యాయం చేయాలని ఆయన అన్నారు. ఇది కూడా చదవండి: ప్లాట్ఫారం నాయకుడిలా మాట్లాడకండి.. నోరు జాగ్రత్త! -
WFH: మారిన పరిస్థితి.. ఇక ఆ దేశంలో వర్క్ ఫ్రం హోం చట్టబద్ధ హక్కు
హేగ్: కరోనా మహమ్మారి పని సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా అనూహ్యంగా మార్చేసింది. సుమారు రెండేళ్లపాటు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం పద్ధతికి అలవాటు పడ్డారు. ఇప్పటికీ కొన్ని సంస్థలు ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నాయి. వర్క్ ఫ్రం హోం నచ్చిన ఉద్యోగులు కొందరు ఆఫీసులకు వెళ్లి పనులు చక్కబెట్టేందుకు విముఖత చూపుతున్నారు. ఈ నేపథ్యంలో నెదర్లాండ్స్ ప్రభుత్వం వర్క్ ఫ్రం హోం విధానాన్ని చట్టబద్ధ హక్కుగా మార్చేందుకు నడుం బిగించింది. దీని ప్రకారం..ఉద్యోగులకు తమ యాజమాన్యాలను వర్క్ ఫ్రం హోం డిమాండ్ చేసే హక్కుంటుంది. తిరస్కరించే సంస్థలు అందుకు గల కారణాలను వివరించాల్సి ఉంటుంది. సంబంధిత బిల్లును ఆ దేశ దిగువ సభ ఇటీవల ఆమోదించింది. ఎగువ సభ కూడా ఆమోదిస్తే చట్ట రూపం దాల్చుతుంది. ఇలాంటి అవకాశం కల్పించిన మొట్టమొదటి దేశం నెదర్లాండ్స్ కానుంది. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు వారంలో నాలుగు రోజులు ఇంటి నుంచే విధులు నిర్వహించవచ్చంటూ స్కాట్లాండ్ ప్రభుత్వం గత నెలలో ఓ ప్రతిపాదన తీసుకువచ్చింది. బదులుగా వేతనంలో కోత ఉంటుందని మెలికపెట్టడం వివాదాస్పదమైంది. ఆఫీసుకు రావాలంతే..!! ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పడుతుండగా, ఆఫీసులకు రావాలంటూ కొన్ని సంస్థలు తమ ఉద్యోగులను గట్టిగా కోరుతున్నాయి. అందుకు తాజా ఉదాహరణ, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్..! ఆఫీసుకు రండి, లేదా రాజీనామా చేయండి అంటూ నెల క్రితం ఈయన తన ఉద్యోగులకు అల్టిమేటం ఇచ్చారు. యాపిల్ సంస్థ సీఈవో టిమ్ కుక్ కూడా ఇలాగే ఆదేశించి కంగు తిన్నారు. ఉద్యోగమైనా మానేస్తాం గానీ ఆఫీసులకు మాత్రం రాబోమంటూ ఉద్యోగులు తెగేసి చెప్పారట. -
పురోహితుడికి గ్రామానికి గ్రామమే దానం
సాక్షి, హైదరాబాద్: పురోహితుల కోసం ప్రత్యేకంగా అగ్రహారాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కానీ, రాజ పురోహితులకు గ్రామం మొత్తాన్ని దానంగా సమర్పించిన ఉదంతాలు అరుదు. అలాంటి ఓ దాన శాసనం తాజాగా వెలుగు చూసింది. నల్లగొండ జిల్లా గుండ్లపల్లి మండలంలోని వావికొల్లు గ్రామం పొలిమేరలోని చారగొండవాగు తీరంలోని పొలాల్లో స్థానిక యువకుడు దీనిని గుర్తించాడు. దాన్ని తగుళ్ల గోపాల్ అనే కవి తన దృష్టికి తెచ్చారని, ఏడడుగుల ఎత్తు అడుగున్నర మందంతో ఉన్న ఈ శిలపై నాలుగు వైపులా 81 పంక్తులలో తెలుగులో చెక్కిన శాసనం ఉందని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. చదవండి: మణికొండ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతికి బాధ్యత వహిస్తాం: మంత్రి కేటీఆర్ కళ్యాణీ చాళుక్యుల చక్రవర్తి త్రిభువన మల్లదేవ రెండో జగదేకమల్ల పాలనా కాలంలో, పానగల్లు రాజధానిగా కందూరు నాడును పాలించిన సామంతుడైన ఉదయనచోడ మహారాజు ఈ శాసనాన్ని వేయించారని హరగోపాల్ పేర్కొన్నారు. క్రీ.శ.1158 ఆగస్టు 10న బోడవిప్పఱ్రు అనే గ్రామాన్ని దానం చేసినట్టు, బహుధాన్య నామ సంవత్సరం భాద్రపద శుద్ధ పౌర్ణమినాడు చంద్రగ్రహణ ప్రత్యేక వేళ ఈ దానాన్ని సమర్పించినట్టు తెలుస్తోందని చెప్పారు. చదవండి: టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో కేవలం 10 వేలే, బంగారం, బండి లేనే లేదు గ్రామం నుంచి వసూలయ్యే పన్నులు రాజ్యానికి సమర్పించాల్సిన అవసరం లేకుండా, ఆ రాజ పురోహితులే అనుభవించేలా అవకాశం కల్పించారు. పుర హితానికి తోడ్పాటునందించే పురోహితులకు ఇలా దానాలు సమర్పించటం అప్పట్లో ఆనవాయితీగా ఉండేదని ఈ శాసనం ద్వారా తెలుస్తోంది. ఉదయనచోడుడి పాలన 1158 వరకు కొనసాగిందన్న ఆధారాన్ని చూపిన శాసనమిది కావటం విశేషం. గతంలో ఇదే రాజు వేయించిన 1157 నాటి శాసనం భువనగిరి సమీపంలో లభించింది. -
నిర్దిష్ట చర్చ లేకుండా చట్టాలా!?
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో చట్టాలను రూపొందిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టాల రూపకల్పన ప్రక్రియ సక్రమంగా సాగడం లేదని చెప్పారు. పార్లమెంట్లో నిర్దిష్ట చర్చ జరగకుండానే చట్టాలు రూపొందుతున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల వాటిలో స్పష్టత లేకుండా పోతోందని తెలిపారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఢిల్లీలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడారు. రాజ్యాంగ సవరణ బిల్లులపై, అవి ప్రజలపై చూపించే ప్రభావంపై గతంలో పార్లమెంట్లో ఎన్నో చర్చలు, సంవాదాలు జరిగేవని గుర్తుచేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదని పేర్కొన్నారు. న్యాయ పరిజ్ఞానం కలిగిన వారు చట్టసభలో లేకపోవడంవల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందన్నారు. పార్లమెంట్లో చట్టాలను రూపొందించే సమయంలో విస్తృతమైన చర్చ జరిగితే కోర్టులు వాటి ఉద్దేశాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటాయని, తద్వారా న్యాయ వివాదాలు తగ్గుతాయని సూచించారు. తొలి పార్లమెంట్లో చాలామంది న్యాయవాదులు ఉన్నారు. మహత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, బాబూ రాజేంద్ర ప్రసాద్ తదితర నేతలు న్యాయవాదులే. న్యాయవాదులు తమ జ్ఞానాన్ని, అనుభవాన్ని దేశానికి అందించాలి’’ అని జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాల నిరసనల కారణంగా చర్చ లేకుండానే కీలకమైన బిల్లులను ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
చట్టాలు మేమెలా రూపొందిస్తాం: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: చట్టాలు రూపొందించే బాధ్యత పార్లమెంట్‌దేనని, తామెలా రూపొందిస్తామని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై వచ్చే అనర్హత విజ్ఞప్తులపై లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు, రాజ్యసభ చైర్పర్సన్ నిర్ణయం తీసుకోవడానికి కాలపరిమితిని విధించేలా కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. దేశవ్యాప్తంగా అనర్హత పిటిషన్లకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించాలని, ఆయా కేసుల్లో ఏకరూప నిర్ణయం తీసుకొనేలా ఆదేశించాలంటూ ఏఐసీసీ సభ్యుడు రణజిత్ ముఖర్జీ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హృషికేశ్ రాయ్‌ల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ చేసిన విజ్ఞప్తి పార్లమెంట్ పరిధిలోనిదని, కోర్టు చట్టాల రూపకల్పన చేయదని ధర్మాసనం అభిప్రాయపడింది. ‘‘చట్టాలు మేమెలా రూపొందిస్తాం? అది పార్లమెంటుకు సంబంధించిన విషయం’’ అని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ‘‘కర్ణాటక ఎమ్మెల్యే విషయంలో అభిప్రాయం ఇప్పటికే చెప్పాం. ప్రస్తుత పిటిషన్‌లోని అంశమే కర్ణాటక ఎమ్మెల్యే కేసులోనూ వచ్చింది. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఇదే వాదన వినిపించారు. ఆ విషయాన్ని మేం పార్లమెంటుకు విడిచిపెట్టాం. ఆ తీర్పు చదువుకొని సుప్రీంకోర్టుకు రావాల్సింది’’ అని ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. -
‘రామ మందిర నిర్మాణానికి ఇదే సరైన సమయం’
ఫైజాబాద్, ఉత్తరప్రదేశ్ : మరో నాలుగు నెలల్లోపు రామమందిరం నిర్మాణం చేపట్టకపోతే దేశ వ్యాప్తంగా నిరసనలు చేస్తామని హెచ్చరించారు విశ్వ హిందూ పరిశత్ మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ తోగాడియా. రామ మందిర నిర్మాణం, గో రక్షణ వంటి అంశాల కోసం పని చేయడానికి బుధవారం ఫైజాబాద్‌లో ‘అంతరాష్ట్రీయ హిందు పరిషత్’ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ‘అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించి తీరతామని బీజేపీ ప్రజలకు హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు మాట మార్చి రామ మందిర నిర్మాణ అంశాన్ని సుప్రీం కోర్టు నిర్ణయిస్తుందంటున్నారు. ఇలా మాటా మార్చడం పార్టీకే మంచిది కాదని తోగాడియా హెచ్చరించారు. ‘అక్టోబర్ నాటికి కేంద్ర ప్రభుత్వం రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా పార్లమెంట్లో చట్టాన్ని తీసుకురావాలి. అలా చేయని పక్షంలో దేశంలోని హిందువులందరూ రోడ్లపైకి వచ్చి బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తార’ని హెచ్చరించారు తోగాడియా. అంతేకాక ‘ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మసీదులను సందర్శించడానికి తీరిక ఉంటుంది. కానీ అయోధ్యలో ఉన్న రామ మందిరాన్ని దర్శించడానికి మాత్రం తీరిక లేదు. మోదీ ఇలా మసీదులను సందర్శిస్తూ హిందువుల మనో భావాలను దెబ్బతీస్తున్నార’ని తొగడియా విమర్శించారు. ‘ఎందుకు మోదీ రామ మందిరం నిర్మాణం విషయంలో నిర్ణయం తీసుకోలేక పోతున్నారని’ ప్రశ్నించారు. ‘నేను బీజేపీకి ఒక్కటే చెప్పదల్చుకున్నాను. రామ మందిర నిర్మాణానికి ఇదే సరైన సమయం. దేశంలో ఉన్న కోట్లాది హిందువుల మనోభావాలను మనం గౌరవించాలి. రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేస్తే అది నిజంగా మన పార్టీకి చాలా గొప్ప విజయం అవుతుంది అన్నారు తోగాడియా. అయితే తోగాడియా వ్యాఖ్యల గురించి మాజీ బీజేపీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు వినయ్ కటియార్ ‘రామ మందిర నిర్మాణానికి మద్దతు పలికిన వీహెచ్‌పీకి ధన్యవాదాలు. రామ మందిర నిర్మాణం గురించి సుప్రీంకోర్టు 2019 నాటికి తన నిర్ణయాన్ని తెలపకపోతే అప్పుడు మోదీనే మందిర నిర్మాణానికి సంబంధించి పార్లమెంటులో చట్టం చేస్తార’ని తెలిపారు. -
అట్రాసిటీ చట్టాన్ని నీరుగారుస్తున్నారు
హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చేవిధంగా కేంద్రం, న్యాయస్థానం వ్యవహరిస్తున్నాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ దళితులు, గిరిజనుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా సుప్రీంకోర్టు తీర్పు ఉండటం బాధాకరమన్నారు. దేశంలో 25 శాతమున్న దళితులు తలెత్తుకోకుండా చెయ్యడంలో భాగంగానే కేంద్రం, సుప్రీంకోర్టు నిర్ణయాలున్నాయని అన్నారు. నమోదవుతున్న కేసుల్లో 90% వీగిపోతున్నాయని, అలాంటప్పుడు చట్టాలు రద్దు చెయ్యడమే పరిష్కారమా అని ప్రశ్నించారు. 302, 307 కేసులు వీగిపోతున్నాయని, వరకట్న వేధింపుల కేసుల్లో 97%, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో 75% వీగిపోతున్నాయని, కేవలం అట్రాసిటీ చట్టంపైనే చర్యలు తీసుకోవడమెందుకని ప్రశ్నించారు. న్యాయవ్యవస్థలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అన్ని రంగాల్లో దళిత, గిరిజనులకు రిజర్వేషన్లు సాధించే దిశగా దక్షిణాది రాష్ట్రాలను కలుపుకుని మే 20న వరంగల్, హైదరాబాద్, అమరావతిలలో ఏదో ఒకచోట సింహగర్జన సభ నిర్వహిస్తామని చెప్పారు. శుక్రవారం దళిత సంఘాల నేతలతో సమావేశమై ఉద్యమ కార్యాచరణపై సమాలోచనలు చేస్తామని తెలిపారు. -
మూడుసార్లు తలాక్ అంటే ఇక కటకటాల్లోకే...
సాక్షి, న్యూఢిల్లీ/కోల్‌కతా: ఎప్పటినుంచో కొనసాగుతున్న ట్రిపుల్ తలాక్ విధానానికి త్వరలో తెరపడనుంది. ఇకమీదట ఎవరైనా మూడు పర్యాయాలు తలాక్ చెప్పి విడాకులు తీసుకోవడం అక్రమం. ఇలా చేసినవారికి మూడేళ్ల వరకూ కారాగారశిక్ష పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మేరేజ్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని అంతర్గత మంత్రుల బృందం ఈ ముసాయిదాని రూపొందించింది. ఈ బృందంలో విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, ఆయన జూనియర్ మంత్రి చౌదరి ఉన్నారు. ఎవరి భర్త అయినా మూడు పర్యాయాలు తలాక్ చెప్పిన సందర్భంలో ఈ చట్టం వర్తిస్తుంది. ఈ ముసాయిదాకు ఆధ్యాత్మిక గురువు రవిశంకర్‌ప్రసాద్ మద్దతు పలికారు. కోల్‌కతలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పురుషులు, మహిళలు సమానంగా హక్కులను అనుభవించాలని, లింగసమానత్వం ఉండాలని, 21వ శతాబ్దంలో అందరూ గౌరవించాల్సిందేనన్నారు. -
'చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలి'
జహీరాబాద్: జనాభా ప్రాతిపదికన బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మెదక్ జిల్లా జహీరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్లో బిల్లు పెట్టాలని కోరుతూ ఈనెల 13న బీసీ నేతలంతా ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వినతిపత్రం సమర్పిస్తామని తెలిపారు. చట్ట సభల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత లభించకపోతే కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ప్రజల నుంచి ఒత్తిడి వస్తోందన్నారు. రూ.50 వేల కోట్లతో కేంద్రం, రూ.10 వేల కోట్లతో రాష్ట్రం బీసీలకు ఉప ప్రణాళికలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే బీసీలకు కూడా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలన్నారు. -
ఇరు రాష్ట్రాల్లో మూడేసి ఎమ్మెల్సీ స్థానాలు పెంపు
త్వరలో కేంద్ర కేబినెట్ ముందుకు ప్రతిపాదనలు పెంపునకు సిఫార్సు చేస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సీఈఓ లేఖ స్థానిక ఎమ్మెల్సీ స్థానాల, నియోజకవర్గాల పునర్విభజనపై ఈసీ సమీక్ష సీఈఓ కార్యాలయాలకు పోస్టుల మంజూరుపై సీఎస్‌లకు లేఖలు హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసనమండలిలో స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాల సంఖ్యను మూడేసి చొప్పున పెంచేం దుకు కేంద్ర ఎన్నికల కమిషన్ రంగం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను త్వరలోనే కేంద్ర కేబినెట్ ముందుకు పంపనుంది. స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాల పునర్విభజన, ఎమ్మెల్యే సీట్ల పెంపునకు నియోజవర్గాల పునర్విభజన అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఢిల్లీలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌తో పాటు కేంద్ర హోం, న్యాయ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించింది. ప్రస్తుతం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ శాసన మం డలిలో స్థానిక నియోజవర్గాల ఎమ్మెల్సీ స్థానాలు 17 మాత్రమే ఉండాల్సి ఉంది. అలాగే తెలంగాణ శాసనమండలిలో స్థానిక నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాల సంఖ్య 14 ఉండాల్సి ఉంది. అయితే ఏపీ మండలిలో స్థానిక నియోజకవర్గాల ఎమ్మెల్సీలు 20మంది ఉండగా తెలంగాణలో 11 మందే ఉన్నారు. తొలుత ఏపీలో మూడు స్థానిక నియోజవర్గాలను తగ్గించాలని, తెలంగాణలో మూడు పెంచాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ కేంద్రాన్ని కోరారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంలో జోక్యం చేసుకుని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సంపత్ తో సంప్రదించారు. ఏపీలో స్థానిక ఎమ్మెల్సీ స్థా నాలను తగ్గించబోమని, వాటిని పెంచాలని కో రారు. దీనికి అనుగుణంగానే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఏపీలో, తెలంగాణ లోనూ ఎమ్మెల్సీ స్థానాలను మూడుకు పెంచాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం నిర్వహించిన సమావేశంలో చర్చించింది. ఏపీ లో మూడు ఎమ్మెల్సీ స్థానాల తగ్గింపు చేయకుం డానే ఆ మేరకు మూడు స్థానాలను పెంచుతూ తెలంగాణలో కూడా మూడు స్థానాలను పెం చుతూ ప్రతిపాదనలను కేంద్ర కేబినెట్‌కు పం పించాలని సోమవారం జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీని కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఎమ్మెల్సీల స్థానాల సంఖ్య 53కు పెరుగుతుంది. అయితే తెలంగాణలో మాత్రం 40 స్థానాలే ఉంటాయి. వేర్వేరుగా ఈసీఓ కార్యాలయాలకు పోస్టులు మంజూరు చేయండి విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయాలకు తగినన్ని పోస్టులను మంజూరు చేయాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది. రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగులు ఇరు రాష్ట్రాలకు పంపిణీ అనంతరం రెండు ప్రభుత్వాలు సీఈఓ కార్యాలయాలకు పోస్టులను మంజూరు చేయనున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. నియోజకవర్గాల పునర్విభజనపై సమీక్ష రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణలో ఎమ్మెల్యే స్థానాలను 119 నుంచి 153కు, ఏపీలో ఎమ్మెల్యే స్థానాలను 175 నుంచి 225కు పెంచాల్సి ఉన్నందున నియోజవర్గాల పునర్విభజనపై కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం సమీక్ష నిర్వహిం చింది. 2011 ఎస్సీ, ఎస్టీ జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సి ఉంది. ఇందుకు సంబంబంధించిన పూర్తి సమాచారాన్ని, మ్యాప్‌లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించారు. కేంద్ర ఎన్నికల సంఘం మరింత సమాచారం కోసం కేంద్ర హోంశాఖను కోరింది. -
ఎన్టీఆర్ భవన్లో ప్రభుత్వ తీర్మానాల తయారీ
టీడీపీ నాలెడ్జ్ సెంటర్లో తయారైన బీసీ తీర్మానం అవే ప్రతులను మండలిలో పంచిపెట్టిన సర్కారు హైదరాబాద్: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కి, ప్రభుత్వానికి తేడా లేకుండా పోయింది. అధికార పార్టీ చట్టసభలను సైతం చులకన చేస్తోంది. ప్రభుత్వం తయారు చేయాల్సిన బీసీ తీర్మానం ప్రతులను ఎన్టీఆర్ భవన్లో తయారుచేయడమే కాకుండా శనివారం ఆ తీర్మానం ప్రతులను శాసనమండలిలో సభ్యులకు అందజేశారు. (తీర్మా నం ప్రతి పేజీ చివర్లో ‘సి/డాటాపీఎం05/టీడీపీ నాలెడ్జి సెంటర్ పేజి నెం.28 అని స్పష్టంగా ఉం ది). దీనిపై పెద్దల సభలో సభ్యులు తీవ్ర అభ్యం తరం వ్యక్తంచేస్తూ ప్రభుత్వంపై దండెత్తారు. ఒక పార్టీ కార్యాలయంలో తయారైన తీర్మానాన్నిమండలిలో ఎలా అనుమతిస్తారంటూ నిలదీశా రు. మండలి చైర్మన్ చక్రపాణి అసహనం వ్యక్తం చేశారు. మండలిలో విషయం బయటపడటం తో శాసనసభకు వచ్చేసరికి దాన్ని సవరించారు. టీడీపీ ఆఫీసులో తయారైనట్లు తెలిపే లైన్‌ను చించేసి కొత్తగా జిరాక్సు ప్రతులు తయారుచేసి ఇచ్చారు. సభలో సీఎం చంద్రబాబు బీసీల కోసం తీర్మానం పెట్టినప్పుడు టీడీపీ మేనిఫెస్టో పుస్తకాన్ని చదవడం ఆశ్చర్యానికి గురిచేసింది. మండలిలో తీవ్ర నిరసన మంత్రి కొల్లు రవీంద్ర బీసీ తీర్మానం మండలిలో ప్రవేశపెట్టగానే విపక్ష సభ్యులందరూ మూకుమ్మడిగా తీవ్ర నిరసన తెలిపారు. ఆ ప్రతులు టీ డీపీ ఆఫీసులోని నాలెడ్జ్ సెంటర్ నుంచి తయా రైనట్లు ముద్రించి ఉండటాన్ని కాంగ్రెస్ పక్షనేత సి.రామచంద్రయ్య తప్పుపట్టారు. పార్టీ కార్యాలయంలో ముద్రించిన ప్రతులను సభలో ప్రవేశపెట్టడానికి అర్హత లేదని కాంగ్రెస్ పార్టీ సభ్యుడు మహమ్మద్ జానీ ప్రతిని సభలో చింపేశారు. చైర్మన్ ఎ.చక్రపాణి కలుగచేసుకొని ఈ పద్ధతి మంచిదికాదని మంత్రికి అక్షింతలు వేశారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఇకముందు ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. తర్వాత హడావిడిగా టీడీపీ నాలెడ్జ్ సెంటర్ అన్నది తొలగించి కొత్త ప్రతులను సభ్యులకు పంపిణీ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే... వాస్తవానికి శుక్రవారమే డిమాండ్లు అన్నీ పూర్తవ్వడంతో రాజకీయ ప్రయోజనాల కోసం శని వారం సభలో ఏదో ఒక తీర్మానం ప్రవేశపెట్టాలని టీడీపీ నిర్ణయించుకుంది. శుక్రవారం రాత్రి బాబు సమక్షంతో పార్టీ నేతలు సమావేశమై తమకు రాజకీయంగా లాభం చేకూర్చే ప్రచారం జరిగేలా తీర్మానం ఏది చేస్తే బాగుంటుందోనని బుర్రలు బద్దలుకొట్టుకున్నారు. శనివారం బాబు తో ఆయన చాంబర్లో నాయకులు సమావేశమై తర్జనభర్జనపడ్డారు. చివరకు బీసీలకు చట్టసభల్లో 33.33 శాతం రిజర్వేషన్లు తదితర అంశాలపై కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేయాలని నిర్ణయించారు. తీర్మానం గురించి స్పీకర్ కోడెల కు తెలియచేశారు. తీర్మానం కాపీని ప్రభుత్వం అసెంబ్లీకి, మండలికి సమర్పించాలి. కానీ తీర్మా నం కాపీని ప్రభుత్వంతో కాక టీడీపీ కార్యాలయమైన ఎన్టీఆర్ ట్రస్టుభవన్లో రూపొందించారు. కొసమెరుపు కేంద్రంలో 25 శాతం నిధులను బీసీలకు ఉప ప్ర ణాళిక కేటాయించాలని చెబుతున్న బాబు రాష్ట్ర బడ్జెట్లో వారికి మొండిచేయే చూపించారు. బీసీలకు బడ్జెట్లో నిధులు ఇచ్చారంటే అదీలేదు. బా బు చేసిన సూచనల ప్రకారం 25 శాతం నిధులు బీసీలకు ఇవ్వాలంటే రాష్ట్ర బడ్జెట్లో రూ.27,750 కోట్లు కేటాయించాలి. కానీ బాబు బీసీలకు విదిలించింది రూ.3,130 కోట్లు మాత్రమే. -
ఎమ్మెల్సీగా నేడు మంత్రి నారాయణ నామినేషన్
హైదరాబాద్: శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఎన్నికకు ఆంధ్రప్రదేశ్ మంత్రి డాక్టర్ పి.నారాయణ సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కావడంతో నారాయణ ఉదయం 11 గంటలకు తన నామినేషన్‌ను అసెంబ్లీ ఇన్చార్జి కార్యదర్శి, రిటర్నింగ్ అధికారి సత్యనారాయణకు అందించనున్నారు. కోలగట్ల వీరభద్రస్వామి రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఈనెల 21న ఎన్నిక జరగనుంది. ఆదివారం వరకూ ఒక్క నామినేషనూ దాఖలు కాలేదు. 12న నామినేషన్ల పరిశీలన, 14న ఉపసంహరణ ఉంది. -
'పార్లమెంటులో ఏ బిల్లూ ఆమోదం పొందకపోవచ్చు'
న్యూఢిల్లీ : కీలకమైన తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేందుకు యూపీఏ సర్కారు సిద్దమైన వేళ.. బిల్లుల ఆమోదంపై కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బిల్లులు ఆమోదం పొందడం కష్టమేనని ఆయన బుధవారమిక్కడ అన్నారు. ఢిల్లీలోని ఓ బిజినెస్ కాన్క్లేవ్ కార్యక్రమంలో పాల్గొన్న చిదంబరం ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బిల్లులు ఆమోదం పొందుతాయో లేదోనని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన జీఓఎంలో సభ్యునిగా వ్యవహరిస్తున్న ఆయన బిల్లుల ఆమోదం జరిగేలా లేదని అభిప్రాయపడ్డారు.