సాక్షి, న్యూఢిల్లీ/కోల్‌కతా: ఎప్పటినుంచో కొనసాగుతున్న ట్రిపుల్ తలాక్ విధానానికి త్వరలో తెరపడనుంది. ఇకమీదట ఎవరైనా మూడు పర్యాయాలు తలాక్ చెప్పి విడాకులు తీసుకోవడం అక్రమం. ఇలా చేసినవారికి మూడేళ్ల వరకూ కారాగారశిక్ష పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మేరేజ్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని అంతర్గత మంత్రుల బృందం ఈ ముసాయిదాని రూపొందించింది.
ఈ బృందంలో విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, ఆయన జూనియర్ మంత్రి చౌదరి ఉన్నారు. ఎవరి భర్త అయినా మూడు పర్యాయాలు తలాక్ చెప్పిన సందర్భంలో ఈ చట్టం వర్తిస్తుంది. ఈ ముసాయిదాకు ఆధ్యాత్మిక గురువు రవిశంకర్‌ప్రసాద్ మద్దతు పలికారు. కోల్‌కతలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పురుషులు, మహిళలు సమానంగా హక్కులను అనుభవించాలని, లింగసమానత్వం ఉండాలని, 21వ శతాబ్దంలో అందరూ గౌరవించాల్సిందేనన్నారు.
మూడుసార్లు తలాక్ అంటే ఇక కటకటాల్లోకే...
Published Fri, Dec 15 2017 9:30 PM | Last Updated on Mon, Aug 20 2018 4:55 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment