Susmaswaraj
-
మూడుసార్లు తలాక్ అంటే ఇక కటకటాల్లోకే...
సాక్షి, న్యూఢిల్లీ/కోల్‌కతా: ఎప్పటినుంచో కొనసాగుతున్న ట్రిపుల్ తలాక్ విధానానికి త్వరలో తెరపడనుంది. ఇకమీదట ఎవరైనా మూడు పర్యాయాలు తలాక్ చెప్పి విడాకులు తీసుకోవడం అక్రమం. ఇలా చేసినవారికి మూడేళ్ల వరకూ కారాగారశిక్ష పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మేరేజ్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని అంతర్గత మంత్రుల బృందం ఈ ముసాయిదాని రూపొందించింది. ఈ బృందంలో విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, ఆయన జూనియర్ మంత్రి చౌదరి ఉన్నారు. ఎవరి భర్త అయినా మూడు పర్యాయాలు తలాక్ చెప్పిన సందర్భంలో ఈ చట్టం వర్తిస్తుంది. ఈ ముసాయిదాకు ఆధ్యాత్మిక గురువు రవిశంకర్‌ప్రసాద్ మద్దతు పలికారు. కోల్‌కతలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పురుషులు, మహిళలు సమానంగా హక్కులను అనుభవించాలని, లింగసమానత్వం ఉండాలని, 21వ శతాబ్దంలో అందరూ గౌరవించాల్సిందేనన్నారు. -
సామాన్యుల కష్టాలన్నీ తీరుస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: విద్యుత్ చార్జీలు 30 శాతం తగ్గింపు, కూరగాయల ధరల నియంత్రణ, సబ్సిడీపై అదనపు గ్యాస్ి సలిండర్లు, ఢిల్లీకి పూర్తి రాష్ట్రస్థాయి హోదా వంటి హామీలతో సామాన్యులను ఆకట్టుకునేలా ఢి ల్లీ విధానసభ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ విడుదల చేసింది. పార్టీ ఢిల్లీ ప్రదేశ్ కార్యాలయంలో మంగళవారం మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్‌తో పాటు పార్టీ ఢి ల్లీ సీఎం అభ్యర్థి డాక్టర్ హర్షవర్ధన్, నగరశాఖ అధ్యక్షుడు విజయ్ గోయల్, విజయేంద్ర గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ వాసుల నుంచి సేకరించిన అభిప్రాయాలు ప్రతిబింబించేలా, వారి కష్టాలు తీర్చేలా మేనిఫెస్టోను రూపొందించినట్టు డాక్టర్ హర్షవర్ధన్ వివరించారు. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు: ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోపే పూర్తిస్థాయి రాష్ట్రహోదా కల్పనకు కృషి నిత్యావసరాలు, కూరగాయల ధరలు తగ్గించేందుకు చర్యలు ప్రతి ఇంటిపై సోలార్ విద్యుత్ ఉత్పాదక వ్యవస్థ ఏర్పాటు ద్వారా ఢిల్లీని విద్యుత్ కొరత లేని రాష్ట్రంగా మార్చడం ప్రస్తుతం సబ్సిడీపై ఇస్తున్న తొమ్మిది సిలిండర్లకు అదనంగా మరో మూడు పంపిణీ ‘ఎసెన్షియల్ డ్రగ్ పాలసీ’ అమలులో భాగంగా అత్యవసరమైన 25 రకాల మందులను ఢిల్లీవాసులందరికీ ఉచితంగా అందుబాటులోకి తేవడం. ఢిల్లీలోని అన్ని జిల్లాల్లో ట్రామా కేంద్రాల ఏర్పాటు మోనో రైలును అందుబాటులోకి తేవడం, మెట్రో రైలును అన్ని ప్రాంతాలకు విస్తరింపజేయడం. -
సుష్మాస్వరాజ్ వ్యాఖ్యలు సరికాదు
భీమవరం అర్బన్, న్యూస్‌లైన్: ఇటీవల పాలమూరులో జరిగిన సభలో సీమాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా బీజేపీ జాతీయ నాయకురాలు సుష్మాస్వరాజ్ వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. భీమవరంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయాలంటూ సుష్మాస్వరాజ్ ఏకపక్షంగా మాట్లాడడం సరికాదని అన్నారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ప్రాంతం ఏవిధంగా నష్టపోతుందో ఈనెల 2, 3 తేదీల్లో ఢిల్లీ నాయకులకు వివరిస్తామని చెప్పారు. ఇందుకు అద్వానీ, రాజ్‌నాథ్‌సింగ్, సుష్మాస్వరాజ్‌ల అపాయింట్మెంట్ తీసుకున్నట్టు తెలిపారు. రాష్ట్రం విడిపోవడం అనివార్యమైతే హైదరాబాద్ పరిస్థితి, ఆదాయ, వ్యయాలు, జల వనరులు తదితర సమస్యలపై పూర్తి స్థాయిలో ఆలోచన చేయాలని, అప్పుడే కేంద్రానికి విభజనపై మద్దతునివ్వాలని చెబుతామన్నారు. సీమాంధ్రలోని 13 జిల్లాల పార్టీ అధ్యక్షులతో పాటు రాష్ట్ర నాయకులు ఢిల్లీ వెళుతున్నట్టు ఆయన తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకుడు పాకా వెంకట సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు అరసవల్లి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.