నెల్లూరు(దర్గామిట్ట), న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర సాధన కోసం టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేయనున్నట్లు ఆ పార్టీ నగర నియోజకవర్గ ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తెలిపారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం ఢిల్లీలో ఆమరణ దీక్ష చేస్తున్న నేపథ్యంలో సంఘీభావంగా నెల్లూరులో రాస్తారోకోలు నిర్వహించనున్నట్లు వివరించారు.
మైపాడు గేట్, ఆత్మకూరు బస్టాండ్, గాంధీబొమ్మ, వీఆర్సీ, హరనాథపురం, చిల్డ్రన్‌స పార్క్ సమీపంలోని జాతీయ రహదారిపై ఉదయం 11 నుంచి 12 గంటల వరకు అన్ని చోట్ల ఒకేసారి రాస్తారోకో నిర్వహించనున్నట్లు వివరించారు. సీఎం పదవి కోసం రామనారాయణరెడ్డి గుంటనక్కలా కాచుకొని ఉద్యమాన్ని ఎగతాళి చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ నాయకులు మండవ రామయ్య, మున్వర్, ధర్మవరపు సుబ్బారావు, బాలకృష్ణచౌదరి, రామకృష్ణారెడ్డి, పడవల కృష్ణమూర్తి, సుబ్బారావు, మురళి, తదితరులు పాల్గొన్నారు.
సమైక్యాంధ్ర సాధనకు ఉద్యమం తీవ్రతరం
Published Sun, Oct 6 2013 3:58 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement