నెల్లూరు(బారకాసు), న్యూస్‌లైన్ : సీమాంధ్రలో పుట్టి, తొమ్మిదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి సమైక్యాంధ్రకు ఎందుకు జైకొట్టరని చంద్రబాబు నాయుడిని వైఎస్సార్‌సీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర విభజనకు నిరసనగా నెల్లూరులోని కేవీఆర్ పెట్రోలు బంక్ సెంటర్‌లో ఆదివారం నరకాసురుడితో పాటు సోనియాగాంధీ, కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు, కేసీఆర్ చిత్రపటాలు తగిలించిన 15 అడుగుల ఎత్తై దిష్టిబొమ్మను టపాసులు కట్టి దహనం చేశారు.
రాష్ట్రాన్ని విభజించాలనే దుర్మార్గపు నిర్ణయం వచ్చినప్పటి నుంచి కోట్లాది మంది ప్రజలు జీవితాలను పణంగా పెట్టి సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నారని తెలిపారు. వీరందరికి బాసటగా, సమైక్య రాష్ట్రమే లక్ష్యంగా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అవిశ్రాంత పోరాటం చేస్తున్నారని చెప్పారు. సోనియాగాంధీ సీమాంధ్ర ప్రజల పాలిట రాక్షసిలా మొండిగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబునాయుడు రెండుకళ్ల సిద్ధాంతంతో ప్రజలను మోసం చేస్తూ సోనియా డెరైక్షన్‌లో పనిచేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌ను వేరుచేస్తుంటే సీమాంధ్రకు ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు.
సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందేనన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తాటి వెంకటేశ్వరరావు, కె.వి.రాఘవరెడ్డి, పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మందా బాబ్జీ, నరసింహయ్య ముదిరాజ్, బిరుదవోలు శ్రీకాంత్‌రెడ్డి, బత్తల వెంకటేశ్వర్లు, వైఎస్సార్‌సీపీ సేవాదళం రాష్ట్ర కమిటీ సభ్యుడు చిం తంరెడ్డి జనార్దన్‌రెడ్డి, పురుషోత్తం యా దవ్, జానా శివప్రసాద్, మస్తాన్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, మల్లికార్జునరెడ్డి, తో టకూర అశోక్‌నాయుడు, జి.నరేష్, మ హేష్, హజరత్‌నాయుడు, మందా పెద్దబాబు, పట్రంగి అజయ్, రమమ్మ, హ సీనా, సుజిత, సరళ, విద్యార్థి విభాగ రూరల్ అధ్యక్షుడు అశోక్‌కుమార్, గగ న్, హరీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమైక్యాంధ్రకు ఎందుకు జై కొట్టవు ?
Published Mon, Nov 4 2013 2:58 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement