సాక్షి, యాదగిరిగుట్ట: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే తెలంగాణలో ఎన్నికల హీట్ పెరిగింది. అధికార పార్టీ సహా ప్రతిపక్ష పార్టీలోని నేతలు సీట్ల వేటలో ఉన్నారు. ఈ క్రమంలో కొందరికి ఇప్పటికే సీట్ల కేటాయింపు జరిగిపోయింది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆసక్తికర కామెంట్స్ చేశారు.
అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఏ స్థానం నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ఆయన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యాదగిరిగుట్టలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.
మరోవైపు.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మంగళవారం సికింద్రాబాద్ మహంకాళి దేవాలయంలో తలసాని విలేకరులతో మాట్లాడారు. ఈ క్రమంలో తలసాని మాట్లాడుతూ.. ‘నేను రాజకీయాల్లో ఈ స్థాయికి చేరుకున్నా.. నాకు సీఎం కావాలనే ఆశ లేదు, ఆశకు కూడా ఓ హద్దు ఉండాలి. ఇప్పుడున్న దాంతో సంతోషంగా ఉన్నా’ అని అన్నారు. కాంగ్రెస్‌లో గిరిజన ఎమ్మెల్యే సీతక్క ముఖ్యమంత్రి కావొచ్చనే వ్యాఖ్యలు వచ్చాయని, మీ పార్టీలో బీసీ సీఎం అనే ఆలోచన వస్తే మీరు పోటీలో ముందుంటారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తలసాని ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: మంత్రి కేటీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్
Comments
Please login to add a commentAdd a comment