కేసీఆర్ రూపంలో నిజాం బతికొచ్చినట్టున్నాడు
దళితులను అణచివేస్తూ ఎవరి కోసం ప్లీనరీ?: మోత్కుపల్లి
సాక్షి, హైదరాబాద్: నిరంకుశత్వ పాలనతో ప్రజలకు నరకం చూపిన నిజాం నవాబు కేసీఆర్ రూపంలో బతికొచ్చినట్టున్నాడని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఎద్దేవా చేశారు. ఎవరు మెచ్చుకోని నిజాంను గొప్పవాడిగా కీర్తించిన కేసీఆర్ అదే తరహాలో దళితులు, ఇతర వర్గాలను అణచివేస్తూ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మంత్రివర్గంలో దళితులకు, మహిళలకు స్థానం కల్పించకుండా నిరంకుశ ధోరణితో కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, ప్లీనరీ ద్వారా వారికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.