nizam nawab
-
ఖమ్మం.. చారిత్రక గుమ్మం!
ఖమ్మం మయూరి సెంటర్: చారిత్రక నేపథ్యం కలిగిన ఖమ్మం జిల్లాను 1953లో పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేశారు. అప్పటి వరకు ఖమ్మం జిల్లా.. వరంగల్ జిల్లాలో భాగంగా ఉంది. ఖమ్మం, మధిర, ఇల్లెందు, బూర్గంపాడు, పాల్వంచ రెవెన్యూ డివిజన్లను విడదీసి ఖమ్మం జిల్లాగా ఏర్పాటు చేశారు. అలాగే 1959లో అప్పటివరకు తూర్పుగోదావరి జిల్లాలోని భద్రాచలం, వెంకటాపురం రెవెన్యూ డివిజన్లను జిల్లాలో కలిపారు. ఈ జిల్లా భూభాగం వేర్వేరు రాజవంశాల కాలాల్లో వేరుగా ఉంది. ఖమ్మం నగరం మధ్యలోని స్తంభాద్రి నుంచే మండపాలు, స్తంభాలకు కావల్సిన రాళ్లు తరలిస్తూ ఉండేవారు. అందుకే ఖమ్మంకు స్తంభాద్రి అనే ప్రాచీన నామం ఉంది. చరిత్రకారుల కథనం ప్రకారం ఖమ్మం అనే పేరు.. నగరంలోని నృసింహాద్రి అని పిలిచే నారసింహాలయం నుంచి వచి్చనట్లు, కాలక్రమంలో స్తంభ శిఖరిగా.. ఆ పై స్తంభాద్రిగా మారినట్లు చరిత్రకారులు స్పష్టం చేస్తున్నారు. ఉర్దూ భాషలో కంబ అంటే రాతి స్తంభం అని.. అందుకే ఖమ్మం అనే పేరు నగరంలోని నల రాతి శిఖరం నుంచి వచి్చనట్లు మరో వాదన ఉంది. నైజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా.. చివరి నైజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వాన జరిగిన సాయుధ రైతాంగ పోరాటానికి కాకలుతీరిన నాయకులు, యోధులను అందించిన ప్రాంతంగా ఖమ్మం చరిత్రలో నిలిచిపోయింది. 1931లో ఖమ్మంలో మొదటి స్వాతంత్య్ర ఉద్యమం జరిగింది. 1945లో ఖమ్మంలో 12వ రాష్ట్ర ఆంధ్ర మహాసభ నిర్వహించారు. ఖమ్మం నగరంతోపాటు జిల్లా ప్రజలు గర్వంగా చెప్పుకునే గాంధీ ఖమ్మం సందర్శన 1946లో జరిగింది. 1946 ఆగస్టు 5న మహాత్మాగాంధీ ఖమ్మం సందర్శించారు. ఖమ్మం కోట చారిత్రక నేపథ్యం.. సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ 1531లో అప్పటి ఖమ్మం పాలకుడైన సీతాబ్‌ఖాన్ (సీతాపతిరాజు)ను ఓడించి ఖమ్మం కోటను స్వా«దీనం చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ దుర్గం కుతుబ్షాహి పాలనలో ఉంది. గ్రానైట్ రాళ్లతో నిర్మించిన ఈ పటిష్టమైన కోట నాలుగు చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. కోటకు 10 ద్వారాలున్నాయి. పశి్చమం వైపు దిగువ కోట ప్రధాన ద్వారం, తూర్పు వైపు రాతి దర్వాజా, కోట చుట్టూ 60 ఫిరంగులను మోహరించే వీలుంది. కోట లోపల జాఫరుద్దౌలా కాలంలో నిర్మించిన ఒక పాత మసీదు, మహల్ ఉన్నాయి. 60 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు ఉన్న జాఫర్‌టౌలి అనే బావి కూడా ఉంది. కోట ముట్టడి జరిగినప్పుడు తప్పించుకోవడానికి ఒక రహస్య సొరంగం కూడా ఉంది. అభివృద్ధి వైపు అడుగులు.. ఖమ్మం కోటగా కీర్తి గడించిన ఖిల్లాను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే కోటలోని జాఫర్‌టౌలి (బావి)ని ఆధునికీకరించారు. కోటపైకి పర్యాటకులు వెళ్లేందుకు రోప్ వే నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన ప్రభుత్వం.. పనుల ప్రారంభానికి చర్యలు చేపట్టింది. రోప్‌వే నిర్మాణం జరిగితే ఖిల్లాను సందర్శించే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని, దీనిద్వారా కోటకు ఉన్న ఘనమైన చరిత్ర ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. -
బురఖా ధరించి మహిళ వేషంలో గోడ దూకి పరారైన... నిజాం నవాబు ప్రధాని
సాక్షి, హైదరాబాద్: ఏడో నిజాం నవాబు హయాంలో హైదరాబాద్ సంస్థానం ప్రధానమంత్రి మీర్ లాయఖ్ అలీ.. నరనరాన భారత దేశంపై ద్వేషాన్ని, హిందువులపై కోపాన్ని నింపుకున్న వ్యక్తి. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కాకుండా చివరివరకూ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. నిజాంకు విశ్వాసపాత్రుడైన లాయఖ్ అలీ చివరలో ప్రాణభయంతో పాకిస్తాన్‌కు పారి పోయాడు. ఇక్కడే పెద్ద హైడ్రామా చోటు చేసుకుంది. అచ్చు సినిమా ఫక్కీలో ఆయన పరారీ కథ నడిచింది. మీర్ లాయఖ్ అలీ ఓ ఇంజనీరు, పారి శ్రామిక వేత్తగా నిజాం ఆంతరంగికుల్లో ఒకడిగా ఉండేవాడు. ఈ క్రమంలోనే రజాకార్ల నేత కాసిం రజ్వీ దారుణాలకు అండదండలందిస్తూ హిందువుల ఊచకోతలను ప్రోత్సహించాడని చెబుతారు. దేశ విభజన అనంతరం అనేక కుట్రలు చేశా డనీ అంటారు. ఈయన ఎత్తుగడలకు మెచ్చే, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మీర్ లాయఖ్ అలీని నిజాం నవాబు ప్రధానమంత్రిగా నియమించారు. కథ క్లైమాక్స్‌కు వచ్చేసరికి.. నిజాం నవాబు కూడా భారత సేనల ముందు దోషిగా నిలబడక తప్పలేదు. దిల్కుషా నుంచి పరారీ.. నిజాం నవాబు తన ఓటమిని అంగీకరించిన వెంటనే భారత సైన్యం రజాకర్ల నేత ఖాసిం రజ్వీని అరెస్టు చేసింది. హైదరాబాద్ సంస్థానం ప్రధాన మంత్రి మీర్ లాయఖ్ అలీ సహా ఇతర నేతలను గృహనిర్బంధంలో ఉంచింది. తొలుత లాయఖ్ అలీని ఆయన ఇంటిలోనే ఉంచి ఆ తర్వాత దిల్కుషా (తర్వాత ప్రభుత్వ వసతి గృహంగా మార్చారు) భవనానికి మార్చారు. అప్పటికే నిజాం రేడియో ప్రసంగం ద్వారా కాసిం రజ్వీ, లాయఖ్ అలీలను దోషులుగా తేల్చి.. స్వయంగా ప్రాసిక్యూషన్‌కు ఆదేశించారు. చదవండి: ఇది టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫైట్ కాదు.. కేంద్రం తీరుపై కేటీఆర్ ఫైర్ అయితే ఇక్కడే నిజాం దుష్టబుద్ధి చూపించుకున్నారు. లాయఖ్ అలీకి స్వయంగా నిజామే లోపాయికారిగా సహాయం చేశారని చెబుతారు. ఆయన పారిపోయేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. దిల్‌కుషాకు కారును పంపారు. దీంతో లాయఖ్ అలీ బురఖా ధరించి మహిళ వేషంలో గోడదూకి ఆ కారులో బొంబాయికి పారిపోయాడు. అక్కడి నుంచి విమానంలో పాకిస్తాన్ చేరుకున్నాడు. కానీ ఈ విషయం బయటకు పొక్కకుండా నిజాం చక్రం తిప్పారు. పాకిస్తాన్‌లోని కరాచీలో ఓ పార్టీ జరుగుతోంది. అందులో పాకిస్తాన్లో భారత రాయబారి కూడా పాల్గొన్నారు. కొద్దిసేపటి తర్వాత ఓ వ్యక్తి వచ్చి, భారత రాయబారిని పరిచయం చేసుకోవటంతో ఆశ్చర్యపోవటం ఆ రాయబారి వంతైంది. తాను మీర్ లాయఖ్ అలీ అని, హైదరాబాద్ సంస్థానం మాజీ ప్రధానినంటూ ఆయన పేర్కొనటమే దీనికి కారణం. వెంటనే ఆయన భారత అధికారుల దృష్టికి ఈ విషయం తెచ్చారు. అప్పటికి గాని లాయఖ్ అలీ పారిపోయిన విషయం తెలియలేదు. 4రోజుల తర్వాత.. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ భారత్‌కు రాని లాయఖ్ అలీకి పాకిస్తాన్ ప్రభుత్వం ప్రముఖ స్థానమిచ్చింది. తర్వాత ఆయన న్యూయార్క్‌లో స్థిరపడ్డాడు. 1971లో అక్కడే చనిపోగా ఆయన శవాన్ని సౌదీ అరేబియాలోని మదీనాలో ఖననం చేసినట్టు చరిత్ర చెబుతోంది. -
నిజాం నవాబుకు పటేల్ 3 నెలలు గడువు ఎందుకిచ్చారు?.. దీని వెనుక కారణాలేమిటంటే..
భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా దేశవ్యాప్తంగా సమస్యలు ఎన్నో కొనసాగాయి. మిగిలిన సంస్థానాలతో పాటు హైదరాబాద్ స్టేట్‌ను భారత్‌లో విలీనం చేయడం అంత ఈజీ కాదన్న విషయాన్ని అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ ముందే గుర్తించారు. అందుకే భారత్‌లో విలీనం అయ్యేందుకు.. నిజాం నవాబుకు 3 నెలల సమయం ఇచ్చారు. దీనికి చాలా కారణాలున్నాయి. చదవండి: నిజాం నిరంకుశత్వంపై నినదించిన ‘మా భూమి’ ముఖ్యంగా నిజాం సంస్థానం దేశంలోనే అత్యంత పెద్ద రాజ్యం. భారతదేశంలో విలీనానికి ముందు నిజాం రాజ్యం 82 వేల చదరపు మైళ్ల విస్తీర్ణంతో ఉంది. అంటే ఇప్పటి బ్రిటన్-స్కాట్లాండ్ దేశాలకన్నా వైశాల్యంలో పెద్దది. ఇక ప్రపంచంలోనే నిజాం అత్యంత ధనికుడు. 1924లో ప్రఖ్యాత టైమ్ మ్యాగజీన్ తన కవర్ పేజీపై ప్రపంచంలోనే అత్యంత ధనికుడంటూ అప్పటి నిజాం ఉస్మాన్ అలీఖాన్ ఫోటో ప్రచురించింది. ఇక నిజాం రాష్ట్రంపై వెంటనే భారత్ సైనికచర్య చేపట్టకపోవడానికి ముఖ్యకారణం... నిజాం ప్రభువుకు దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలలో ఉన్న మతపరమైన అభిమానం. అందుకే హైదరాబాద్ సంస్థానాన్ని చర్చల ద్వారానే విలీనం చేసుకునేందుకు భారత ప్రభుత్వం ఏడాది పాటు ప్రయత్నించింది. ఏవిధంగానైనా నిజాం రాష్ట్రాన్ని భారత్‌లో విలీనం చేసుకోవాలని ప్రధాని నెహ్రూ ముందు హోంమంత్రి పటేల్ ప్రతిపాదన పెట్టారు. భారతదేశం మధ్యలో ఉన్న హైదరాబాద్ స్వాతంత్ర్యంగా ఉండటం దేశభద్రతకు ముప్పు అని పటేల్ భావించారు. అయితే హైదరాబాద్ రాష్ట్రంపై సైనికచర్యకు దిగితే అంతర్జాతీయ సమాజం తలదూర్చే ప్రమాదం ఉందని నెహ్రూ అనుమానాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఓ వైపు పాకిస్తాన్‌తో సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో దేశం మధ్యలో ఉన్న హైదరాబాద్‌లో సైనిక చర్యకు దిగడం సరికాదనే నెహ్రూ సూచనకు పటేల్ సరేనన్నారు. దీంతో తాను స్వతంత్ర్యంగా ఉంటానని ప్రకటించిన నిజాంను ఎలాగైనా లొంగదీసుకోవాలని ఢిల్లీ పెద్దలు భావించారు. చివరికి మూడునెలల పాటు యథాతథ స్థితికి నిజాంతో భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధపడింది. అయితే మూడునెలల తరువాత నిజాం తన సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేస్తేనే ఈ ఒడంబడిక చెల్లుతుందని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. దాదాపు నాలుగు దఫాల చర్చల తరువాత నిజాం 1947 నవంబర్ 29 ఈ ఒప్పందంపై సంతకం పెట్టాడు. -
96 శవాల చుట్టు మహిళలతో బతుకమ్మ
దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణ ప్రజలు మాత్రం బానిస సంకెళ్లతో మగ్గిపోయారు. అప్పటి నిజాం హయాంలోని రజాకార్ల దాష్టికాలతో అనుక్షణం భయం భయంగా బతికారు. ఈ బానిస బతుకుల విముక్తి కోసం కొనసాగిన మహత్తర రైతాంగ సాయుధ పోరాటం ద్వారా తెలంగాణ విమోచనోద్యమానికి పురుడుపోసిన నేలగా ఉమ్మడి మెదక్ జిల్లా నిలిచింది. బైరాన్‌పల్లి, కూటిగల్, లింగాపూర్, దూల్మిట్ట తదితర గ్రామాల్లో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. నాటి వీరుల వీరోచిత పోరాటానికి తలొగ్గిన నిజాం నవాబు 1948 సెప్టెంబర్ 17న లొంగుబాటు ప్రకటన చేశాడు. నేడు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం... మద్దూరు(హుస్నాబాద్) : దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినా కూడా తెలంగాణ ప్రాంతంలో మాత్రం నిజాం రజాకార్ల ఆగడలకు ఎదురొడ్డి నిలిచిన గ్రామంగా బైరాన్‌పల్లి కీర్తి గడించిన ఘనత దక్కించుకుంది. అంతే కాదు రజాకార్ల అన్యాయాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో అనేక మంది వీర మరణం పొందారు. ముస్లింలు అధికంగా ఉన్న మద్దూరు, లద్నూర్, సలాఖపూర్, రేబర్తి, మర్మాముల గ్రామాలను రజాకార్లు తమ స్థావరాలుగా చేసుకొని దాడులు చేస్తుండే వారు. ఈ క్రమంలో బైరాన్‌పల్లి గ్రామాన్ని కేంద్రంగా చేసుకొని రజాకార్ల దాడులను తిప్పి కొట్టడంలో చుట్టు పక్కల గ్రామాలు కీలక పాత్ర పోషించాయి. (రంగు మారిన పవన్ రాజకీయం) గ్రామ రక్షక దళాలు రజాకార్ల అరచకాలను ఎదురించేందుకు గ్రామాల్లోని యువకులంత కలిసి రక్షణ దళాలుగా ఏర్పడ్డాయి. బైరాన్‌పల్లి, కూటిగల్, లింగాపూర్, దూల్మిట్ట గ్రామాల్లో ఏర్పడిన రక్షణ దళాలు బైరాన్‌పల్లిని కేంద్రంగా చేసుకొని నిరంతరం రజాకార్ల దాడులను తిప్పికొట్టేవి. దీంతో రజాకార్లు 1948లో దూల్మిట్ట, లింగాపూర్ గ్రామాలపై దాడులు చేసిదొరికిన వారిని దొరికినట్లు చంపడంతో పాటు ఆయా గ్రామాలను తగులబెట్టారు. ఆపై తిరిగి వస్తున్న రజాకార్లపై బైరాన్‌పల్లి వద్ద రక్షణ దళాలల నాయకులు దువ్వురి రాంరెడ్డి, మురళీధర్‌రావు, ముకుందర్ రెడ్డి నాయకత్వంలో కాపు కాచి గేరిల్లా దాడులు చేశారు.అంతే కాకుండా లింగాపూర్ దూల్మిట్ట గ్రామాలలో దోచుకున్న సంపదను స్వాధీనం చేసుకున్నారు. (అనూహ్య ఘటన.. భట్టి ఇంటికి తలసాని) కూటిగల్‌పై దాడి బైరాన్‌పల్లి గ్రామ రక్షక దళాలకు కూటిగల్ ప్రజలు సఆయ సహకారులు అందించడంతో మూడు సార్లు దాడిని బైరాన్‌పల్లి గ్రామస్తులు తిప్పి కొట్టారని కోపంతో 1948 ఆగస్టు27న బైరాన్‌పల్లి దాడి తర్వాత కొంత మంది రజాకార్లు కూటిగల్ గ్రామంపై దాడి చేసి బురుజుపై ఉన్న వారిని కిందకు దింపి తూటల మర్రి వరకు తీసుకొచ్చి రెక్కలు కట్టి నిల్చొబెట్టి 22 మందిని కాల్చి చంపి రజాకార్లు పైసాచిక ఆనందం పొందారు. ఊరంతా దిగ్బంధం బైరాన్‌పల్లి గ్రామ రక్షక దళాలు దాడులు చేయడంపై రజాకార్లు ఆగ్రహించుకొని ఆ గ్రామంపై రజాకార్లు మూడుసార్లు దాడులు చేసి విఫలమయ్యారు. ఈ క్రమంలో 1948 ఆగస్టు 27వ తేదీ అర్ధరాత్రి ఖాసీం రజ్వీ నాయకత్వంలో రజాకార్లు జనగామ నుంచి 10 ట్రక్‌లతో బయలుదేరి రాత్రి 2గంటల ప్రాంతంలో తమకు అడ్డాగా ఉన్న లద్నూర్ గ్రామానికి చేరుకున్నారు. తెల్లవారుజాము 3గంటల సమయంలో బైరాన్‌పల్లి గ్రామాన్ని మందుగుండు సామగ్రితో 12వందల మంది సైనికులు దిగ్భందించారు. బహిర్బూమికి వెళ్ళిన ఉల్లెంగల(వడ్ల) నర్సయ్యను పట్టుకొని గ్రామంలో ఉన్న బురుజు వద్దకు దారి చూపించమని తీసుకెళ్లారు. అదే సమయంలో నర్సయ్య వారిని నెట్టివేస్తూ రజాకార్లు గ్రామంలోకి వచ్చారని కేకలు వేస్తూ పరుగులు తీశాడు. దీంతో బురుజుపై ఉన్న కాపలదారుడు నగార మోగించారు. దీంతో రజాకార్లు కాల్పులు ప్రారంభించడంతో బురుజుపై ఉన్న మోటం రామయ్య, పోచయ్య, బలిజ భూమయ్యలు మృతి చెందారు. కాల్పులు జరుగుతుండగా బురుజుపై ఉన్న మందు గుండు సామగ్రిపై నిప్పు రవ్వలు ఎగిసి పడటంతో ఒక్కసారిగా బురుజుపైభాగం పేలిపోయింది. దీంతో రజాకార్లు గ్రామంలోకి చొరబడి దొరికిన వారిని దొరికినట్లు కాల్చి చంపారు. ఇలా ఒకే రోజు బైరాన్‌పల్లి గ్రామంలో 96 మందిని చంపి శవాల చుట్టు మహిళలతో బతుక్మ ఆటలాడించారు. శవాల చుట్టూ బతుకమ్మ ఆడించారు బురుజు వద్ద అనేక మందిని పట్టుకొని చంపుతుంటే భయంతో పరుగులు పెడుతున్న మహిళలను వివస్త్రలను చేసి శవాల చుట్టూ బతుకమ్మ ఆట ఆడించి పైశాచిక ఆనందం పొందారు. కొందరు మహిళలు పారి పోతుంటే పట్టుకొని అత్యాచారం చేశారు. మహిళలు ఆ అవమానం తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. –ఓజమ్మ స్వాతంత్య్ర సమరయోధురాలు, బైరాన్‌పల్లి లెంకలు కట్టి చంపినారు బైరాన్‌పల్లిలో దాడి కొనసాగుతుండగానే కూటిగల్‌పై దాడి చేసి కొందరిని బంధీగా పట్టుకొని బురుజుపై ఉన్న వారికి కిందకు దింపి వాగు ఒడ్డుకు ఉన్న తూటల మర్ర వద్దకు తీసుకెళ్ళి లెంకలు కట్టి చంపారు. నా కాలుకు తూటా తగిలిని తప్పించుకొని ప్రాణాలు దక్కించుకున్నాను. –వంగపల్లి బాలయ్య, స్వాతంత్య్ర సమరయోధుడు, కూటిగల్ -
లాయక్ అలీ విషాదం
మీర్ లాయక్ అలీ (1903–71) హైద్రాబాద్ సంస్థానం అస్తమించే రోజుల్లో తొమ్మిదిన్నర నెలలపాటు ప్రధానమంత్రిగా పనిచేసిన రాజమంత్ర ప్రవీణుడు. స్వతంత్ర భారత ప్రభుత్వం 566 స్వదేశీ సంస్థానాల్ని విలీనం చేసుకొన్న తర్వాత నిజాం సరకారును స్వాధీనం చేసుకొనేందుకు ప్రయత్నిస్తే, సైంధవునిలా అడ్డుకోవడానికి కృషి చేసిన అభినయ చతురుడు. నిజాం ప్రభుత్వాన్ని స్వతంత్ర భారతదేశంలో ప్రత్యేక స్వతంత్ర దేశంగా నిలపాలని శతధా ప్రయత్నించి విఫలుడైన వ్యక్తి. మునుపటి నిజాం ప్రభుత్వ ప్రధానులైన సర్ అక్బర్ హైదరీ, మిర్జా ఇస్మాయిల్ ఛత్తారీలను అసమర్థులుగా చిత్రించి, తన్ను తాను పరిపాలనా దక్షునిగా చెప్పుకొన్న చతుర వచోనిధి. ఈ మీర్ లాయక్ అలీ తన అనుభవాలను, భావాలను ‘హైద్రాబాద్ ట్రాజెడీ’ అన్న ఇంగ్లిష్ గ్రంథ రూపంలో(1962) గుదిగుచ్చాడు. లాయక్ అలీ హైద్రాబాద్ స్వతంత్ర దేశంగానే వుండాలని వాదించాడు. నవాబు అదే భల్లూకపు పట్టు పట్టాడు. కాని సంస్థానపు ప్రజలు మాత్రం భారత ప్రభుత్వంలోనే విలీనం కావాలని అభిలషించారు. కానీ లాయక్ అలీ వాదన ఇంకోలా ఉంది: ‘‘హిందువులంతా మున్షీ, భారత్ భావించినట్లు భారత్ వైపు నిలబడక మాతృభూమి వైపు నిలబడ్డారు’’. అలాగే ఖాసిం రజ్వీని కూడా ఎంతో ఉదాత్త నాయకునిలా చిత్రించాడు. ‘‘మతసామరస్య నిర్వహణ పట్ల ఆయన చాలా ఆసక్తిగా ఉండేవాడు. రజాకార్లలో హిందువుల సంఖ్యను పెంచడం ఆయన జీవితాశయములలో ఒకటిగా ఉండేది. రజాకార్ల ఛత్రఛాయలో ఉన్నవారు అన్ని వర్గాల ప్రజలను కలుపుకుపోవాలని, అందరి అభిప్రాయాలను గౌరవించే సహన శీలతను పెంచుకోవాలని ఆయన బోధిస్తూ ఉండేవారు.’’ ఇక, నిజాం నవాబు గురించి రాసిన ఈ మాటలు ఆయన ప్రజా సంరక్షణకు ఎంతటి ప్రాధాన్యమిచ్చేవాడో తెలుస్తుంది. ‘‘మొదట డబ్బుకు, తర్వాత తన వ్యక్తిగత ఆధిపత్యానికే ప్రాధాన్యతనిచ్చేవాడు. వయసు పెరిగినకొద్దీ ఆయన అధికార కాంక్ష ఎంతగా పెరిగిందంటే, ఈర్ష్యతో ప్రభుత్వానికి కూడా స్వేచ్ఛనివ్వకపోయేవాడు.’’ హైద్రాబాద్ సంస్థానంపై భారత ప్రభుత్వ మిలిటరీ చర్యను ‘దుర్మార్గమైన బలం’గా పేర్కొన్న లాయక్ అలీ రచన ఇంకో వెర్షన్ వినడానికి పనికొస్తుంది. కానీ వ్యాఖ్యానం పట్ల జాగరూకతతో ఉండాలి. ఈ పుస్తకాన్ని కవి, విమర్శకుడు ఏనుగు నరసింహారెడ్డి సరళమైన భాషలో, సాఫీగా సాగే శైలిలో చక్కగా తెలుగులోకి అనువదించారు. ఘట్టమరాజు -
భద్రం కాదు.. ఛిద్రం
సాక్షి, హైదరాబాద్: చారిత్రక పత్రం.. ఇక చేతికందడం కష్టం.. పత్రాలు చిరిగె.. అక్షరాలు చెదిరె.. నవాబుల పత్రాలు.. ఖరాబు చిత్రాలవుతున్నాయి. రాజ పత్రం రాజసం కోల్పోయింది. వందల ఏళ్లనాటి చారిత్రక సాక్ష్యాలు, కోట్లకొద్దీ డాక్యుమెంట్లు, ఫర్మానాలు, గెజిట్లు రాజ్యాభిలేఖ పరిశోధనాలయంలో కొలువుదీరాయి. కాకపోతే ఛిద్రంగా! ఏ పత్రం ఏ క్షణంలో నుసిగా రాలి పోతుందో తెలియని దుస్థితి. మొదటి నవాబు నుంచి నేటి పాలకుల వరకు తీసుకున్న కీలక నిర్ణయాలు, ఫర్మానాలు, జీవోలు ఈ భాండాగారంలోనే నిక్షిప్తమై ఉన్నాయి. హుస్సేన్‌సాగర్, గండిపేట్, ఉస్మానియా వర్సిటీ, ఆస్పత్రులు వంటి అనేక చారిత్రక కట్టడాల నిర్మాణానికి నవాబులు విడుదల చేసిన ఫర్మానాలు, ముంతఖాబ్‌లు, అప్పటి సామాజిక, ఆర్థిక పరిణామాలను తెలిపే ఎన్నో కీలకమైన డాక్యుమెంట్లు, హైదరాబాద్ స్టేట్ చరిత్రకు సంబంధించిన పత్రాలు ఇక్కడ ఉన్నాయి. ముందుకు సాగని డిజిటలైజేషన్.. మొదటి నిజాం నవాబు ఖమృద్దీన్ అలీఖాన్ నుంచి ఆఖరి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ వరకు, 1406వ సంవత్సరం నుంచి ఇటీవలి వరకు సుమారు 4.3 కోట్ల డాక్యుమెంట్లు, 1724 నుంచి 1890 వరకు విడుదలైన ఫర్మానాలు, సనత్‌లు, జాగీర్ ఇనాంలకు సంబంధించిన పత్రాలన్నీ పర్షియన్, ఉర్దూ భాషల్లోనే ఉన్నాయి. ఏడో నిజాంకాలంలో బ్రిటిష్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలకు ఇక్కడ ఆధారాలు ఉన్నాయి. రౌండ్‌టేబుల్ సమావేశాల్లో గాంధీజీ, జిన్నా, అంబేడ్కర్, నెహ్రూతోపాటు అప్పటి హైదరాబాద్ ప్రధానమంత్రి అక్బర్ హైదరీ పాల్గొన్నప్పటి విశేషాలు, మినిట్స్ బుక్స్‌ను ఇక్కడ భద్రపరిచారు. 2012లో అప్పటి ఉమ్మడి ప్రభుత్వం విడుదల చేసిన రూ.2.75 కోట్లతో సుమారు 60 లక్షల పేజీలను, సుమారు 1896 నుంచి 1948 వరకు ఉన్న డాక్యుమెంట్లన్నీ డిజిటలైజ్ చేశారు. కానీ 1896కు ముందు , 1948 తరువాత విడుదలైన గెజిట్ పత్రాలు, జీవోలు, ఇతర అనేక డాక్యుమెంట్లు, జీవోలు డిజిటలైజేషన్ చేయవలసి ఉందని రాజ్యాభిలేఖ పరిశోధనాలయం అధికారి ఒకరు తెలిపారు. ఒక్క రూపాయీ విడుదల కాలేదు.. ‘‘తెలంగాణ ఏర్పడిన తరువాత డిజిటలైజేషన్ కోసం ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. మరో నాలుగైదేళ్లలో చాలా పత్రా లు చేతికందకుండా పోయే ప్రమాదం ఉంది. ముఖ్యం గా 1724 నుంచి వెలువడిన అనేక పత్రాలు అప్పటికీ శిథిలాస్థకు చేరుకున్నాయి. వాటిని కాపాడడం చాలా కష్టంగా ఉంది’’అని పరిశోదనాలయ అధికారి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. నిలిచిపోయిన ఫుమిగేషన్... వందల ఏళ్లుగా వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా పుస్తకాలు, డాక్యుమెంట్లకు పురుగుపట్టవచ్చు. దీనిని నివారించేందుకు ఫుమిగేషన్ చేస్తారు. పుస్తకాలు, డాక్యుమెంట్లు ఉన్న చాంబర్‌లోని ఆక్సిజన్‌ను పూర్తిగా తొలగించి కార్బన్‌డయాక్సైడ్‌తో నింపేస్తారు. తద్వారా ఎలాంటి పురుగులు ఉన్నా చనిపోతాయి. కానీ, సిబ్బంది కొరత కారణంగా ఈ ప్రక్రియ కుంటుపడింది. ఇక్కడ కనీసం 76 మంది సిబ్బంది ఉండాలి. కానీ, ప్రస్తుతం 40 మంది మాత్రమే ఉన్నారు. అనువాదకుల కొరత కూడా ఉంది. -
నిజాం నిధులెవరికి?
సాక్షి, హైదరాబాద్: నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ దాచుకున్న భారీ నగదు వివా దం త్వరలో తేలిపోనుంది. హైదరాబాద్‌పై సైనిక చర్యకు కొన్ని రోజుల ముందు పాకిస్తాన్‌లోని బ్రిటిష్ హైకమిషనర్‌కు బదిలీ అయిన మొత్తం రూ.వందల కోట్లకు చేరటంతో భారత్, పాకిస్తాన్‌తో పాటు నిజాం వారసుల్లోనూ కదలిక మొదలైంది. హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసే దిశగా భారత సైన్యాలు వస్తున్నాయన్న సమాచారంతో ఆరో నిజాం ఉస్మాన్ అలీఖాన్ 1948లో 1.7 లక్షల పౌండ్లను పాకిస్తాన్‌లోని బ్రిటిష్ హైకమిషనర్‌కు బదిలీ చేశారు. అయితే ఈ నిధులపై అప్పటి నుంచి భారత్, పాకిస్తాన్‌లు న్యాయ పోరాటం చేస్తుండగా, ఇందులో నిజాం వారసులు ముకర్రంజ, ముఫకంజ కూడా నిధులు తమకే చెందుతాయంటూ వాదనలు వినిపించారు. అన్ని పక్షాల వాదనలు విన్న బ్రిటన్ హైకోర్టు వచ్చే నెలలో తీర్పు ఇవ్వనుందని నిజాం వారసులు పేర్కొంటున్నారు. లండన్‌లోని నాట్‌వెస్ట్‌లో బ్యాంక్‌లో జమ అయిన నిధులు.. ప్రస్తుత లెక్కల ప్రకారం సుమారు రూ.304 కోట్లకు చేరాయి. ఈ నిధులు మావంటే, మావేనని ఇరు దేశాలు నాలుగున్నర దశాబ్దాలుగా న్యాయ పోరాటం చేస్తున్నాయి. కుమారుడు ఆజంజా, కోడలు దుర్రేషెవార్, మనుమలు ముకర్రం, ముఫకంజాలతో ఉస్మాన్ అలీఖాన్. చిత్రంలో అప్పటి గవర్నర్ భీంసేన్ సచార్ ఆయుధాల కోసమన్న పాకిస్తాన్.. హైదరాబాద్ విలీనానికి ముందు ఉస్మాన్ అలీఖాన్ వద్ద ప్రధానమంత్రిగా ఉన్న లాయక్ అలీ నగదును పాకిస్తాన్‌లోని బ్రిటిష్ హైకమిషనర్‌కు బదిలీ చేశారు. దేశ విభజన అనంతరం లాయక్ అలీ పాకిస్తాన్ పౌరసత్వం పొందటంతో ఈ నిధులు తమకే చెందుతాయని పాకిస్తాన్ వాదించింది. దీనికి తోడు భారత్ దాడిని ఎదుర్కొనేందుకు ఉస్మాన్ అలీఖాన్ ఆయుధాల సరఫరా కోసం ఆ మొత్తాన్ని తమకు పంపాడని కూడా పేర్కొంది. తీర్పు భారత్, నిజాం వారసులకు అనుకూలంగా వస్తే ఎవరి వాటా ఎంత అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. నిజాం అసలు వారసులతో పాటు మరో 4 వేల మంది వరకు క్లెయిమ్ చేసుకుంటున్నారని నిజాం పాలనపై పరిశోధన చేసిన ఇజాస్ ఫారుఖీ ‘సాక్షి’కి తెలిపారు. సుప్రీంకోర్టు న్యాయవాది వెంకటరమణ మాట్లాడుతూ.. హైదరాబాద్ రాష్ట్ర ప్రజల ఆస్తినే నిజాం పంపారని పేర్కొన్నారు. అందుకే ఈ మొత్తాన్ని తెలంగాణకు వచ్చేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముకర్రంజ పరివారం: భార్యలు: ఎస్త్రా(టర్కీ)హెలెన్, మనోలియా ఒనూర్, జమీల (మొరాకో), ఒర్చిడ్ (టర్కీ), వీరందరికీ ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. వీరంతా ఇప్పుడు టర్కీ, ఆస్ట్రేలియా, లండన్‌లో స్థిరపడ్డారు. ముఫకంజ: భార్య ఏసెస్(టర్కీ), పిల్లలు: రఫత్ జా, ఫర్హత్ జా వీరు కాకుండా నిజాం వారసులుగా మరో 3,600 మంది చలామణి అవుతున్నారు. ప్రస్తుతం ముకర్రంజ ఆస్ట్రేలియా, టర్కీలలో, ముఫకంజ లండన్, హైదరాబాద్‌లలో నివసిస్తున్నారు. -
ఇది ప్రాణదాత... నూరేళ్ల చరిత
ఫీవర్ ఆస్పత్రికి శత వసంతాలు రేపు వేడుకలు సిటీబ్యూరో/నల్లకుంట: అధికమెట్ట ఒక అడవి. కొండలు, గుట్టలు, పెద్ద పెద్ద చెట్లు, రాళ్లు,రప్పలు... జనసంచారం అంతగా లేని ఆ ప్రాంతంలో పశువుల కాపరులు మాత్రమే కనిపించేవారు. అలాంటి అడవిలో విషాదం చోటుచేసుకుంది. ఏ చెట్టు కింద చూసినా జీవచ్ఛవాలులా కొట్టుమిట్టాతున్న మనుషులే. మహమ్మారి ప్లేగు బారి నుంచి ఊరిని కాపాడుకొనేందుకు వ్యాధిగ్రస్తులను అలా అడవిలో ఉంచి చికిత్స ప్రారంభించారు వైద్యులు. ప్లేగు ప్రబలిన ప్రతిసారీ అధికమెట్ట రోగులతో నిండిపోయేది. బతికితే ఇంటికి. లేదంటే ఆ అడవిలోనే పూడ్చిపెట్టేవాళ్లు. ఆ ‘అధికమెట్టే’ ఇప్పుడు ‘అడిక్‌మెట్’. అటు ఈసీఐఎల్ వరకు, ఇటు నల్లకుంట, కాచిగూడ, అంబర్పేట్, రామంతాపూర్ వరకు చెరువులు, కుంటలు, కొండలు, గుట్టలతో అధికమెట్ట ఉండేది. ఒకవైపు పరవళ్లు తొక్కే మూసీనది. మరోవైపు పచ్చటి అడవి. ప్లేగు వ్యాధిగ్రస్తులను అక్కున చేర్చుకున్న ఆ అడవిలోనే తదనంతర కాలంలో చరిత్రాత్మక ఆస్పత్రి నిర్మాణానికి పునాది వేశాడు నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్. ‘కోరంటి దవాఖాన’గా,‘ ఫీవర్ ఆస్పత్రి’గా పేరొందిన ఈ వైద్య శాల వందేళ్ల వేడుకను శనివారం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఒక్కసారి చరిత్రలోకి తొంగి చూస్తే... మూసీ ఒడ్డునే ఆస్పత్రి జనరంజక పరిపాలన సాగించిన ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ కాలంలోనే ప్రజలు ఒకవైపు సంతోషాన్ని... మరోవైపు ప్రకృతి వైపరీత్యాలతో విషాదాన్ని అనుభవించారు. మూసీ ఉప్పొంగి అనేక మందిని పొట్టన పెట్టుకొంది. అంటువ్యాధులతో జనం పిట్టల్లా రాలిపోయారు. అలాంటి గడ్డు రోజుల్లో మూసీ పరీరక్షణ, ప్రజారోగ్యం రెండూ సవాల్‌గా నిలిచాయి. మూసీ మరోసారి ఉప్పొంగకుండా దానికి రెండువైపులా పటిష్టమైన నిర్మాణాలు, అడవులు ఉండాలని గుర్తించారు. మూసీ పరీవాహక ప్రాంతంలో ఆస్పత్రుల నిర్మాణంతో రోగులకు త్వరగా స్వస్థత లభించగలదని భావించారు. ఉస్మానియా ఆస్పత్రికీఅలాగే బీజం పడింది. ఆరో నిజాం కాలంలో ప్రారంభమైన ఈ పనులను ఏడో నవాబు ఉస్మాన్ అలీఖాన్ పూర్తి చేశారు. అలా మూసీ ఒడ్డున అధికమెట్ట అటవీ ప్రాంతంలో వీరన్నగుట్ట దగ్గర అంటువ్యాధులకు వైద్య సేవలందించే ఒక చిన్న ఆస్పత్రి 1915 ఆగస్టు 20న ఆవిర్భవించింది. 1920 నాటికి దీన్నినల్లకుంటకు తరలించి పక్కా భవనాలు కట్టించారు. అదే ఇప్పటి ఫీవర్ ఆస్పత్రి. మొదట ప్లేగు, కలరా, డయేరియా వంటి వ్యాధులకు వైద్య సేవలందించారు.క్రమంగా మలేరియా, డెంగీ, ధనుర్వాతం, చికెన్‌గున్యా, గవదబిళ్లలు, తట్టు, పొంగు, కుక్కకాటు, స్వైన్‌ఫ్లూ వంటి వ్యాధులకు వైద్య సేవలు విస్తరించాయి. ‘క్వారెంటైన్’ నుంచి సర్ రోనాల్డ్ రాస్ ఆస్పత్రిగా... అంటువ్యాధులతో బాధ పడే వారిని ఊరికి దూరంగా ఉంచి వైద్యం అందించే పద్ధతి ‘క్వారెంటైన్’. అలా క్వారంటైన్ ఆస్పత్రిగా ఏర్పడి... క్రమంగా జనం వాడుకలో ‘కోరంటి దవాఖాన’గా పేరొందింది. తెలంగాణలోని అన్ని జిల్లాల రోగులు ఇక్కడకు వచ్చేవారు. మరోవైపు బ్రిటిష్ కంటోన్మెంట్ ప్రాంతమైన సికింద్రాబాద్‌లో సైనికులు ఆడ ఎనాఫిలిస్ దోమ కుట్టి మలేరియా బారిన పడుతున్నట్లు గుర్తించిన సర్ రోనాల్డ్ రాస్ పరిశోధనలు సైనికులకే కాకుండా తెలంగాణలో మలేరియా నిర్మూలనకు తోడ్పడ్డాయి. మలేరియాను అంతమొందించడంలో ఆయన కృషికి గుర్తుగా 1997లో ఈ ఆస్పత్రికి ‘సర్ రోనాల్డ్ రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోఫికల్ అండ్ కమ్యూనికేబుల్ డిసీజెస్’గా నామకరణం చేశారు. అభివృద్ధి పథంలో.. 1960లో ఇక్కడ వైరల్ జ్వరాల పరిశోధన కేంద్రం ప్రారంభమైంది.మొత్తం 330 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రిలో నిత్యం 50 మంది ఇన్పేషెంట్లుగా, 600 మంది అవుట్పేషేంట్లుగా చికిత్స పొందుతున్నారు.అప్పటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2004 జూన్ 4న ఈ ఆస్పత్రికి ‘బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఏపీ ఇన్ బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ ’అవార్డును అందించారు. రోగుల వివరాలన్నింటినీ కంప్యూటర్లో నిక్షిప్తం చేసి ఎప్పటికప్పుడు చికిత్సలను రికార్డు చేయడం ఇక్కడి ప్రత్యేకత. ఘనంగా వేడుకలు ఈ నెల 21నఫీవర్ ఆస్పత్రి వందేళ్ల వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు సూపరెంటెండెంట్ డాక్టర్ శంకర్ తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆస్పత్రిలో చాలాకాలం సేవలందించిన పలువురు వైద్యులు, వివిధ విభాగాల ప్రముఖులను సన్మానించనున్నారు. ఈ సందర్భంగా సావనీర్ విడుదల చేయనున్నట్లు ఆయన చెప్పారు. -
కేసీఆర్ రూపంలో నిజాం బతికొచ్చినట్టున్నాడు
దళితులను అణచివేస్తూ ఎవరి కోసం ప్లీనరీ?: మోత్కుపల్లి సాక్షి, హైదరాబాద్: నిరంకుశత్వ పాలనతో ప్రజలకు నరకం చూపిన నిజాం నవాబు కేసీఆర్ రూపంలో బతికొచ్చినట్టున్నాడని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఎద్దేవా చేశారు. ఎవరు మెచ్చుకోని నిజాంను గొప్పవాడిగా కీర్తించిన కేసీఆర్ అదే తరహాలో దళితులు, ఇతర వర్గాలను అణచివేస్తూ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మంత్రివర్గంలో దళితులకు, మహిళలకు స్థానం కల్పించకుండా నిరంకుశ ధోరణితో కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, ప్లీనరీ ద్వారా వారికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. -
రెండో రాజధాని హైదరాబాద్
హైదరాబాద్ నగరం దేశంలోని పలు రాష్ట్రాలకు సమీపంగా ఉండి రైల్వే, విమాన, బస్సు మార్గాలను కూడా కలిగి ఉంది. అల నాటి నైజాం నవాబుల కాలంలోనే ఇది అంతర్జాతీయ నగరాలలో ఒకటిగా పేరుగాంచింది. అలాంటి దీనిని దక్షిణ భారతీయులకు కేంద్రపరంగా దేశము యొక్క రెండవ రాజధానిగా హైదరాబాద్ అని ప్రకటిస్తే దేశ వాసులందరికీ ప్రయోజన కరం. అదీగాక ఈ నగరంలో మరాఠీ, బెంగాలీ, తమిళ, కన్నడిగ, ఆంధ్రసీమ వారలకే గాక ఉత్తర భారతం నుండి వలస వచ్చిన యూపీ, బిహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ లాంటి వారికి ఆశ్రయమిచ్చి అక్కున చేర్చుకొన్నది. సింధీలు, ముస్లింలు, పార్శీలు, కిరస్తానీలు, జైనులు, సిక్కులను సైతం తనలో కలుపు కొని సాహితీ సంగమ క్షేత్రంగా విరాజిల్లుతున్నది కదా! మరి అలాంటి దీనిని మన భారతదేశానికి ఉపరాజధానిని చేస్తే రాజ ధాని కూడా సురక్షిత కేంద్రంగా భాసిల్లుతుందన్న విషయాన్ని విజ్ఞులు, మేధావులు రాజకీయ నాయకులు మరియు కేంద్ర మంత్రివర్యులు (తెలుగు ప్రాంతాల నుండి ప్రాతినిధ్యం వహి స్తున్న వారు) కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొనేలా ఆలోచిస్తే బావుంటుందని అనిపిస్తుంది. - కూర్మాచలం వేంకటేశ్వర్లు, కరీంనగర్ -
'నిజాం నవాబుకు ధన్యవాదాలు తెలపాలి'
-
కోటలోకి ప్రవేశించేందుకు యత్నం, అరెస్ట్
హైదరాబాద్ : గోల్కొండ కోట వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. గోల్కొండ కోటలో జెండా ఎగరవేయడానికి వెళ్తున్న బిజెపి కార్యకర్తలను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. కోటకు వెళ్లే అన్ని దారుల వద్దా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు కోటలో జెండా ఎగురవేయడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. అరెస్ట్ చేసిన బీజేపీ కార్యకర్తలను అసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు బాపూ ఘాట్ నుంచి బీజేపీ నేతలు గోల్కొండ కోట వరకూ ర్యాలీగా వెళ్లనున్నారు. -
'నిజాం నవాబుకు ధన్యవాదాలు తెలపాలి'
హైదరాబాద్ : తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి బుధవారం తెలంగాణ భవన్‌పై జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 17 రాజుల పాలన నుంచి...ప్రజా పాలన వచ్చిన రోజుని అన్నారు. నిజాం నవాబుకు ధన్యవాదాలు తెలిపాలని నాయిని అన్నారు. సొంత దేశాన్ని వదులుకుని హైదరాబాద్‌ను నిజాం నవాబు భారతదేశంలో విలీనం చేశారని ఆయన పేర్కొన్నారు. -
పోరు మాగాణం
ఓరుగల్లు ఓ ఆయుధం.. ఓ తూటా.. ఓ సైనికుడు.. పోరాటాలకు దిశానిర్దేశం చేసిన గడ్డ. నైజాం నవాబును, ఆయన తొత్తులు.. రజాకార్లు, దేశ్‌ముఖ్‌లను తరిమికొట్టిన చోటు. చాకలి ఐలమ్మ శౌర్యం, దొడ్డి కొమురయ్య ధీరత్వం, బందగీ అమరత్వం పుణికిపుచ్చుకున్న భూమి. దొరల పెత్తందారీ, భూస్వామ్య వ్యవస్థపై సమరశంఖం పూరించిన మాగాణం. భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం తెలంగాణ ప్రజలు చేసిన సాయుధ గెరిల్లా పోరాటం ఎందరికో స్ఫూర్తినిచ్చింది. ఇంకెందరికో ఉత్తేజాన్నిచ్చింది. సుమారు 900 మంది వీరుల రక్తంతో తడిసిన ఈ గడ్డమీది నుంచే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మెుదలైంది. తొలిసారిగా 1969లో ఉద్యమ బీజాలు పడ్డారుు. ఆ తర్వాత 2001 నుంచి ఉద్యమం మహా కెరటమై ఎగిసింది. పల్లె, పట్నం కదం తొక్కాయి. 143 మంది విద్యార్థులు, యువకులు ఆత్మార్పణ చేసుకున్నారు. నాడు నిజాం పాలన నుంచి విముక్తి పొందితే.. నేడు ప్రత్యేక రాష్ట్ర కల నెరవేరింది. సాయుధ పోరులో.. స్వరాష్ట్ర ఉద్యమంలో జిల్లా ప్రజలు చూపిన ధైర్యసాహసాలు చిరస్మరణీయం. రజాకార్ల దురాగతాలపై అక్షర సమరం కేసముద్రం : రజాకార్ల ఆగడాలను ఎదిరించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఒద్దిరాజు సీతారామచందర్‌రావు, రాఘవరంగారావు ‘తెనుగు పత్రిక’ను స్థాపించారు. ఈ తెలుగు పత్రిక తొలి సంచికను 1922 ఆగస్టు 22న అప్పటి నిజాం ప్రభుత్వం హయంలో కుగ్రామంగా ఉన్న కేసము ద్రం మండలం ఇనుగుర్తిలోనే ముద్రించారు. అప్పటి వరకు తెలుగు పత్రికలు లేవు. ఇదే తొలి పత్రిక. ఒద్దిరాజు సోదరు లు పత్రికకు సంపాదకులుగా వ్యవహరించారు. వీరిద్దరూ కవిత్వంలో దిట్టకావడంతో జంటకవులుగా ప్రసిద్ధికెక్కారు. నిజాంకు వణుకు పుట్టించిన పత్రిక నిజాం పాలనలో అన్ని రకాలుగా అణిచివేతకు గురైన తెలంగాణ ప్రజలందరినీ మేల్కొలిపి వారిని చైతన్యవంతులుగా చేయడానికి ఒద్దిరాజు సోదరులు తమ కలానికి పదునుపెట్టారు. వారు రాసిన అనేక శీర్షికలు నిజాం, రజాకారుల గుండెల్లో గుబులు పుట్టించడమేకాక, అణచివేతకు గురైన ప్రజలను ఉత్తేజపరిచాయి. పత్రికకు చందాదారులు లేకపోవడంతో సోదరులిద్దరూ స్వయంగా హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, సూర్యాపేట, విజయవాడ, బందరు, చైన్నై, మానుకోట తదితర ప్రాంతాలలో చందాదారులను చేర్పించారు. పత్రికలో వచ్చిన కథనాలకు మంచి స్పందనరావడంతో హైదరాబాద్‌కు చెందిన బూర్గుల రామకృష్ణారావు, మాడపాటి హన్మంతరావు, కొదాటి రామకృష్ణారావు, వెంకటేశ్వర్రావు లాంటి ప్రముఖులు తెనుగు పత్రికలో వార్తలు, వ్యాసాలు రాయడానికి ముందుకొచ్చారు. వారి స్ఫూర్తితో ఒద్దిరాజు సోదరుల సమీప బంధువు నల్గొండకు చెందిన షబ్నాలీస్ వెంకటనర్సింహారావు ‘నీలగిరి’ పత్రికను 1923లో స్థాపించారు. ఇనుగుర్తిలో రజాకార్ల దాడులు తెనుగు పత్రికలో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేఖంగా వస్తున్న వార్తలకు మండిపడ్డ రజాకార్లు ఇనుగుర్తి గ్రామానికి చేరుకుని దాడులకు దిగారు. ఒద్దిరాజు సోదరులకు చెందిన గ్రంథాలను, ముద్రణ మిషన్లను ధ్వంసం చేసి తగుల బెట్టారు. ఈ క్రమంలో స్నేహితుల సహకారంతో పత్రిక నిర్వహణను జిల్లా కేంద్రానికి మార్చారు. తర్వాత కొద్ది నెలలకు పలు కారణాల వల్ల పత్రిక ప్రచురణ నలిచిపోయిం ది. మొత్తం మీద తెనుగు పత్రిక ఆరు సంవత్సరాల పాటు విజయవంతంగా ప్రచురితమైంది. గోలకొండ పత్రిక తెనుగు పత్రిక తర్వాత పుట్టిన గోలకొండ పత్రిక కూడా స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్ దక్కన్ కేంద్రంగా ప్రతీ సోమ, గురువారాల్లో వెలువడిన ఈ పత్రికలో జవహర్లాల్ నెహ్రూ వ్యాసాలతో పాటు ఆ సమయంలో జరుగుతున్న పోరాటాల తీరు, వార్తా కథనాలను ప్రచురించారు. -
‘వక్రీకరణలు వినే దౌర్భాగ్యం వచ్చింది’
హైదరాబాద్: చరిత్రను వక్రీకరిస్తుంటే వింటూ కూర్చోవాల్సిన దౌర్భాగ్యం కలిగిందని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శైలజానాథ్ వ్యాఖ్యానించారు. నిజాం నవాబు సెక్యులర్ వాది అని ఇటీవల పోస్టర్లు చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. నిజాం నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా, విశాలాంధ్ర కోసం పోరాడిన సాయుధ కమ్యూనిస్టుల ఉద్యమ చరిత్రను మార్చే విధంగా మాట్లాడడం తగదని అన్నారు. విశాలాంధ్ర అన్న వారు ఓట్లు, సీట్ల కోసం విధానం మార్చుకోవచ్చు కాని, చరిత్రను వక్రీకరించరాదని ఆయన అన్నారు. శుక్రవారం శాసనసభలో ‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2013’పై చర్చ సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. -
వందేళ్ల వైభవం
=నాటి టౌన్హాలే.. నేటి అసెంబ్లీ =భవనం నిర్మించి నేటికి వందేళ్లు =దీని సాక్షిగా ఎన్నో చర్చలు, శాసనాలు అద్భుత నిర్మాణశైలి.. మిలమిలలాడే శ్వేతవర్ణంతో మెరిసిపోతున్న ఈ భవనాన్ని గుర్తుపట్టారా?. నాడు మహబూబియా టౌన్‌హాలుగా ఒక వెలుగు వెలిగిన ఈ భవనం కాలక్రమంలో శాసనసభ భవనంగా మారింది. టౌన్‌హాలుగా వ్యవహరించిన కాలంలో తీసిన మొట్టమొదటి చిత్రమిది. ప్రస్తుతం భవనాన్ని నిర్మించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కథనం... అది 1904వ సంవత్సరం. ఆరోజు హైదరాబాద్ అంతా సందడిగా ఉంది. ఉదయం నుంచి ఆయన రాకకోసం ఎదురుచూస్తున్న నగరవాసులు తండో పతండాలుగా ఒక ప్రదేశానికి చేరుకున్నారు. నగర ప్రముఖులు, మంత్రులు, ప్రతినిధులు అందరూ నిరీక్షిస్తున్నారు. నగరంలోని అన్నివర్గాల ప్రజల ప్రేమాభిమానాలకు పాత్రుడైన ఆయన ఏం చెబుతాడోననేది ఉత్కంఠ. సాయంత్రం ఐదున్నర సమయంలో ఆరో నిజాంనవాబు మీర్‌మహబూబ్ అలీఖాన్ సభాస్థలికి చేరుకున్నారు. ఆయన కోసమే ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేదికపై నుంచి ప్రసంగించారు. దేశంలోని వివిధ సంస్థానాదీశులతో జరిగిన ఢిల్లీదర్బార్ కార్యక్రమంలో పాల్గొని నగరానికి చేరుకున్న మహబూబ్‌కు సాదరస్వాగతం పలికేందుకు చేసిన వేదిక అది. ఆవేదిక పైనుంచే ఆయన మాట్లాడారు. హైదరాబాద్ రాజ్యంలో తాను చేపట్టిన ప్రజాసంక్షేమ కార్యక్రమాలను వివరించారు. భవిష్యత్తులో చేయదల్చిన పనులను చెప్పారు. ఆ క్షణంలోనే నగరవాసులంతా ఒక నిర్ణయానికి వచ్చారు. నిజాం నవాబు ఢిల్లీ దర్భార్ సభల్లో పాల్గొని వచ్చిన ఆ చారిత్రక సందర్భం చిరకాలం గుర్తుండిపోయేలా ఒక అందమైన భవనాన్ని కట్టించాలని తీర్మానించారు. ఆకట్టడం కోసం అన్నివర్గాల ప్రజలు పరిశ్రమించారు. చందాలు పోగుచేశారు. మరోఏడాది తర్వాత అంటే 1905లో మహబూబ్‌అలీఖాన్ 40వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు నగరవాసుల బహుమానంగా ఆ అందమైన భవన నిర్మాణం ప్రారంభంకాగా..1913లో పూర్తయ్యింది. కానీ మహబూబ్‌అలీఖాన్ 1911లోనే చనిపోయారు. ఆయన తనయుడు ఏడోనిజాం మీర్ఉస్మాన్అలీఖాన్ హయాంలో ఆభవనం పూర్తయ్యింది. మిలమిలలాడే తెలుపు వర్ణంలో నింగినంటేలా వెలిసిన ఆశ్వేతసౌధానికి మహబూబ్ జ్ఞాపకార్ధం మహబూబియా టౌన్‌హాల్‌గా నామకరణం చేశారు. ఆ టౌన్హాలే ఆతర్వాత రాష్ట్ర శాసనసభ అయ్యింది. 1913 డిసెంబర్ నుంచి వినియోగంలోకి వచ్చిన అద్భుతమైన టౌన్‌హాల్‌కు ఇప్పుడు నూరేళ్లు. ఆసందర్భంగా ప్రత్యేక కథనం ఇది. అద్భుతమైన నిర్మాణ శైలి: నాటి నుంచి నేటివరకు ఎందరెందరో రాజనీతిజ్ఞులు, మరెందరో పరిపాలనా దురంధురులు, విధానరూపకర్తలు, ప్రజ సమస్యలపై ఎలుగెత్తిన రాజకీయ నాయకులు, ప్రజాజీవితంలో తలపండిన నేతలు ఆ భవనంలో కొలువుదీరారు. శాసనాల రూపకల్పనలో భాగస్వాములయ్యారు. ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం చర్చోపర్చలు జరిగాయి. ఆనాటి నిజాంకాలంలో హైదరాబాద్ సంస్థానప్రముఖులు, ప్రజలు సమావేశాలు ఏర్పాటు చేసుకొన్నారు. సంస్థాన విలీనానంతరం కొలువుదీరిన కొత్త ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజల సర్వతోముఖాభివృద్ధి కోసం శాసనాలను రూపొందించాయి. ఈ శతాబ్ద కాలంలో అనేక కీలకమైన ఘట్టాలకు,సంక్లిష్టమైన సందర్భాలకు వేదికగా నిలిచిన ఒకప్పటి టౌన్‌హాల్, ఇప్పటి అసెంబ్లీ భవనం వైవిధ్యభరిమైన సంస్కృతుల కలయిక. విభిన్న శైలులను సంతరించుకొని వెలసిన నిలువెత్తు హిమవన్నగం. ఉట్టిపడే రాజసానికి ప్రతీక. అందమైనగోపురాలు, ఆకాశాన్ని తాకే శిఖరాలు, మరెంతో అందంగా తీర్చిదిద్దిన డోమ్‌లు, భవనం గోడలపై మంత్రముగ్ధులను చేసే డిజైన్లు ప్రత్యేకాకర్షణగా నిలుస్తాయి. కుత్‌బ్‌షాహీ,ఆసిఫ్‌జాహీల కాలంలో కట్టించిన అనేక చారిత్రక భవనాల కంటే కూడా అత్యాధునిక నిర్మాణ శైలిని సంతరించుకొన్న టౌన్‌హాల్ ఇప్పటికీ దేశవిదేశాలకు చెందిన ప్రముఖులను, పర్యాటకులను ఆకట్టుకుంటూనే ఉంది. ఇరానీ, మొగలాయి,రాజస్థానీ వాస్తు నిర్మాణ శైలులతో దీన్ని నిర్మించారు. ఆరోనిజాం కాలంనాటి అధికారిక భవన నిర్మాణ నిపుణుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇది రూపుదిద్దుకుంది. టౌన్‌హాల్ నిర్మాణం కోసం రాజస్థాన్‌లోని మఖ్రానా నుంచి రాళ్లను తెప్పించారు. రెండొంతుస్థులతో నిర్మించిన టౌన్‌హాల్ మొత్తంగా ఒక సువిశాలమైనహాల్, దాని చుట్టూ సుమారు 20 గదులతో ఉంటుంది. గోపురాలను డంగుసున్నం, బంకమట్టిని వినియోగించారు. గోపురాలు,కమాన్లు మొగలాయి వాస్తుశైలిని సంతరించుకొంటే గోడలపై రూపొం దించిన కళాత్మక దృశ్యాలు, లతలు,వివిధ రకాల డిజైన్లు ఇరాన్,రాజస్థానీ శైలిలతో రూపుదిద్దుకున్నాయి. అంతేకాదు ఈ భవంతిలో చక్కటిగాలి, వెలుతురు వస్తాయి. చలికాలంలో వెచ్చగా, వేసవిలో చల్ల గా ఉండేలా టౌన్‌హాల్ ఎంతో వైవిధ్యభరితంగా ఉం టుంది. అప్పట్లో రూ.20లక్షల వ్యయంతో దీనిని కట్టిం చారు. 1985లో వినియోగంలోకి వచ్చిన నూతన అసెంబ్లీ భవనం కూడా పాతటౌన్హాల్ నిర్మాణశైలిలోనే జరిగింది. సత్యమేవ జయతే: ప్రపంచశాంతిదూత , స్ఫూర్తిప్రదాత, అహింసామూర్తి గాంధీజీ కాంస్య విగ్ర హం అసెంబ్లీ భవనానికి మరింత పరిపూర్ణతను తెచ్చిపెట్టింది. పాలకులు,ప్రతిపక్షాలు అంతా ఒకేచోట సమావేశమై ప్రజల ఆకాంక్షలను,కోరికలను,అవసరాలను,సమస్యలను,అభివృద్ధిని, వెనుకబాటుపై చర్చిస్తూ, తీర్మానిస్తూ, సమీక్షిస్తూ సాగే శాసనసభా సమావేశాలు రాష్ట్ర ప్రగతికి మైలురాళ్లు. అలాంటి జనరంజకమైన పాలనకు కేంద్రబిందువైన టౌన్‌హాల్‌పై ఇప్పుడు నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. నగరంలోని అ న్ని చారిత్రక కట్టడాల పరిరక్షణ పురావస్తుశాఖ ఆధీనంలో ఉంటే అసెంబ్లీ మాత్రం రాష్ట్రప్రభుత్వ ఆధీనంలో ఉంది. ఈ అద్భుతమైన కట్టడాన్ని ఇప్పటికీ వారసత్వ కట్టడంగా పరిగణించకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. నిబంధనలు బేఖాతర్: చారిత్రక కట్టడాలకు వందమీటర్లదూరంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దనే ఆదేశాలున్నా పట్టి ంచుకునే వారు లేరు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో ఈనిబంధన కచ్చితంగా పాటిస్తున్నారు. కానీ నగరంలో మాత్రం దీన్ని ఉల్లంఘించారు. అసెంబ్లీ భవనానికి సమీపం నుంచే మెట్రోరైలు మార్గాన్ని నిర్మించడమే ఇందుకు నిదర్శనం. మిగతా నగరాల్లో అండర్‌గ్రౌండ్ మార్గాలు నిర్మించగా ఇక్కడ మాత్రం ఆ పరిస్థితి లేదు. -
హైదరాబాద్ నవాబు కుటుంబ సభ్యుడికి అవార్డు
లండన్: హైదరాబాద్‌ను పాలించిన నిజాం నవాబు కుటుంబ సభ్యుడు ప్రిన్స్ మోసిన్ అలీఖాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచశాంతికి, స్వంచ్ఛంద సంస్థల తోడ్పాటుకు విశేష సేవలందించినందుకుగాను ఆయనను లండన్‌లో ఘనంగా సత్కరించారు.‘వరల్డ్ పీస్ అండ్ ప్రాస్పరిటీ పౌండేషన్’కు అలీఖాన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ వార్షికోత్సవం లండన్‌లో నిర్వహించారు. కార్యక్రమానికి నగరంలోని అనేకమంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోసిన్ అలీఖాన్‌తో పాటు, సియాసత్ ఉర్దూ దినపత్రిక చీఫ్ ఎడిటర్ జాహిద్ అలీఖాన్, ఇండియన్ ఏయిర్‌ఫోర్స్‌లో పనిచేసిన ఉస్మాన్ షాహిద్‌లతో పాటు వివిధ రంగాలలో సేవలందించిన మరికొందరిని అవార్డులతో సత్కరించారు.