‘వక్రీకరణలు వినే దౌర్భాగ్యం వచ్చింది’ | Sake Sailajanath comments on Nizam Nawab | Sakshi
Sakshi News home page

‘వక్రీకరణలు వినే దౌర్భాగ్యం వచ్చింది’

Published Fri, Jan 10 2014 8:10 PM | Last Updated on Sat, Jun 2 2018 3:39 PM

‘వక్రీకరణలు వినే దౌర్భాగ్యం వచ్చింది’ - Sakshi

‘వక్రీకరణలు వినే దౌర్భాగ్యం వచ్చింది’

 హైదరాబాద్: చరిత్రను వక్రీకరిస్తుంటే వింటూ కూర్చోవాల్సిన దౌర్భాగ్యం కలిగిందని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శైలజానాథ్ వ్యాఖ్యానించారు. నిజాం నవాబు సెక్యులర్ వాది అని ఇటీవల పోస్టర్లు చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. నిజాం నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా, విశాలాంధ్ర కోసం పోరాడిన సాయుధ కమ్యూనిస్టుల ఉద్యమ చరిత్రను మార్చే విధంగా మాట్లాడడం తగదని అన్నారు.

విశాలాంధ్ర అన్న వారు ఓట్లు, సీట్ల కోసం విధానం మార్చుకోవచ్చు కాని, చరిత్రను వక్రీకరించరాదని ఆయన అన్నారు. శుక్రవారం శాసనసభలో ‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2013’పై చర్చ సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement