sake sailajanath
-
జగన్ రైతులను కలిస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి?: శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: కనీస గిట్టుబాటు ధర లేక నానా అగచాట్లు పడుతున్న మిర్చి రైతులను పరామర్శించేందుకు వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్తే, ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమిటని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ప్రశ్నించారు. అసలు జగన్ కదిలే వరకు, రైతులను ఆదుకోవాలన్న కనీస ఆలోచన సీఎం చంద్రబాబు ఎందుకు చేయలేదని ఆయన నిలదీశారు.జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు పర్యటనలో అడుగడుగునా భద్రతా వైఫల్యం కనిపించిందని మాజీ మంత్రి వెల్లడించారు. జగన్ పర్యటనలో భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పోలీసులను మోహరించలేదని, అదే అనుమానాన్ని చివరకు రైతులు కూడా వ్యక్తం చేస్తున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సాకే శైలజానాథ్ తెలిపారు.శైలజానాథ్ ఇంకా ఏం మాట్లాడారంటే..:జగన్ కదిలితే తప్ప..:చంద్రబాబు అధికారంలో ఉండగా ఏరోజూ రైతుల బాగోగులు పట్టించుకున్న పాపాన పోలేదు. వైయస్ జగన్ గుంటూరు మిర్చి యార్డుకి వెళ్తే తప్ప, చంద్రబాబుకి మిర్చి రైతుల సమస్యలు గుర్తుకు రాలేదు. మిర్చి రైతులకు మద్ధతు ధర కల్పించాలంటూ ఆయన హడావుడిగా కేంద్ర మంత్రికి లేఖ రాశారు. మిర్చి రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకునేందుకే జగన్ గుంటూరు మిర్చి యార్డు సందర్శించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మిర్చి రైతులకు న్యాయం చేయడానికే ఆయన అక్కడ పర్యటించారు.భద్రత కల్పించలేదు:రైతులను పరామర్శించడానికి వైయస్ జగన్ వెళితే, యార్డు వద్ద కావాలనే రక్షణ వలయం ఏర్పాటు చేయలేదని మిర్చి రైతులే చెబుతున్నారు. జెడ్ ప్లస్ కేటగిరి భద్రత కలిగి ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ రైతులతో మాట్లాడటానికి వస్తుంటే భద్రత కల్పించాల్సిన పోలీసులు ఎక్కడా కనిపించకపోవడం దేనికి నిదర్శనం?. అసలు జగన్ రైతులతో మాట్లాడితే, చంద్రబాబుకి వచ్చిన ఇబ్బంది ఏంటో అర్థం కావడం లేదు. చంద్రబాబు వ్యవహారశైలిపై ప్రజలు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నా..:టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీసులను కూడా పార్టీ కార్యకర్తలను చూసినట్లే చూస్తున్నారు. పొలీస్ వ్యవస్థను పార్టీల పరంగా విడకొట్టే విష సంస్కృతికి చంద్రబాబు తెర తీశారు. పోలీస్ వ్యవస్థ వేధింపుల గురించి హైకోర్టు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నా చంద్రబాబుకి చీమ కుట్టినట్లు అయినా లేదు. పాలనలో చంద్రబాబు విఫలం:9 నెలల్లోనే పాలనలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు. కూటమిలో కీలక భాగస్వామిగా ఉండి కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు తెచ్చుకోవడం ఆయనకు చేతకావడం లేదు. చంద్రబాబు ప్రతీకార రాజకీయాలు, కక్షపూరిత పాలన పుణ్యమా అని రాష్ట్ర ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. ప్రతి మంగళవారం అప్పులు చేయడం తప్ప, 9 నెలల కాలంలో చంద్రబాబు నెరవేర్చిన హామీ ఒక్కటైనా ఉంటే చూపించాలి. ప్రజా సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టకుండా ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్‌తోనే కాలం గడుపుతున్నారు. విపక్ష వైఎస్సార్సీపీ నాయకుల మీద కేసులు బనాయించడం మినహా, చంద్రబాబు పాలనలో ప్రజలకు జరిగిన మేలు శూన్యం అని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ స్పష్టం చేశారు. -
వైఎస్ జగన్ నాయకత్వంలో పని చేయడానికి సిద్ధం: శైలజానాథ్
-
మొక్కవోని ధైర్యం.. వైఎస్ జగన్ నాయకత్వం: శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ నాయకత్వంలో పని చేస్తూ, ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకుని ప్రజల పక్షాన పోరాడాలని నిర్ణయించుకున్నానని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైఎస్సార్సీపీలోకి చేరారు. శైలజానాథ్‌తో పాటు ఏఐసీసీ మెంబర్, అనంతపురం డీసీసీ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి కూడా చేరారు.వైఎస్సార్సీపీలో చేరిన అనంతరం శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడం లేదని.. మరో వైపు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్వీర్యం చేయడం ద్వారా, పేదలకు వైద్య విద్య దూరం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో వైఎస్ జగన్ విద్యా రంగంలో చేసిన అమలు చేసిన అనేక సంస్కరణలను ఈ ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు.‘‘ప్రజల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని.. రాయలసీమ జిల్లాల్లో రైతుల కష్టాలను కూడా చంద్రబాబు ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదు. వారి తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తామని శైలజానాథ్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుల సహకారంతో ముందుకు వెళ్తాం. ప్రజల పక్షాన పోరాడుతాం. మొక్కవోని ధైర్యంతో పని చేసే నాయకత్వం జగన్‌ది. అందుకే ఆయన నేతృత్వంలో పని చేసేందుకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆయన వెల్లడించారు.చంద్రబాబు నిజ స్వరూపం బయటపడుతోంది: అనంత వెంకట్రామిరెడ్డిఈ రోజు శైలజానాథ్ మా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని ఆహ్వానిస్తున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చంద్రబాబు నిజ స్వరూపం బయటపడుతోంది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని అనేక మంది మా పార్టీలోకి వస్తున్నారు.రాయలసీమకు కృష్ణా జలాలు తీసుకొస్తానని చంద్రబాబు చెబుతున్నది శుద్ద అబద్దం. చంద్రబాబు 1996లో ఆ పనులకు శంకుస్ధాపన చేశారు. ఆ తర్వాత పట్టించుకోలేదు. కానీ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎం అయిన తర్వాత కృష్ణా జలాలను రాయలసీమకు అందించారు. చంద్రబాబు రాయలసీమకు ద్రోహం చేశారు. జగన్ సీఎంగా రాయలసీమ అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకున్నారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మా రాయలసీమకు మళ్లీ అన్యాయం చేస్తోంది.ఇదీ చదవండి: సీఎం రమేష్‌కు ఇక్కడేం పని.. ఎమ్మెల్యే ఆది ఆగ్రహం -
టీడీపీ అరాచకాలపై పోరాటం చేస్తా ..
-
‘బాబు పాలన అవినీతిమయం’
కూడేరు : సీఎం చంద్రబాబు మూడేళ్ల పాలనలో అవినీతి, అక్రమాలు విపరీతంగా పెరిగిపోయాయని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రి శైలజనాథ్ అన్నారు. శుక్రవారం కూడేరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు మూడేళ్లలో ఏం చేశారని విజయోత్సవాలు జరుపుకుంటున్నారని ప్రశ్నించారు. మూడేళ్లలో భూకబ్జాలు, ఇసుక దోపిడీలు అధికమైయ్యాయని మండిపడ్డారు. ఉపాధి హామీ పథకం కింద కొన్ని పనులు చేయకనే చేసినట్టు చూపించి ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు నిధులను నొక్కేస్తున్నారని ఆరోపించారు. అధికారం చేపట్టినప్పటి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క పక్కా ఇంటిని కూడా నిర్మించింది లేదన్నారు. సీఎం మాత్రం హైదరాబాద్‌లో ఇంటిని నిర్మించుకుని దానిని పార్టీ క్యాంపు కార్యాలయంగా ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు. జిల్లాలో కరువును రూపుమాపుతానని సీఎం జిల్లాకు వచ్చినపుడల్లా ప్రకటనలు చేయడం తప్పా చేసింది ఏమి లేదన్నారు. కూడేరు మండలం పీఏబీఆర్ డ్యాం వద్ద రూ.56 కోట్లతో నిర్మించిన తాగునీటి ప్రాజెక్ట్‌ను ప్రారంభించకుండా రాజకీయం చేస్తున్నారన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్, పీసీసీ అధికార ప్రతినిధి రమణ, కార్యదర్శి జయచంద్రనాయుడు, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ విష్ణునారాయణ, మండల కన్వీనర్ ఆంజనేయులు, మండల నాయకులు రంజిత్, జనార్దన్, రమణ, అక్కులప్ప తదితరులు పాల్గొన్నారు. -
‘నగర పాలన భ్రష్టు పట్టింది’
అనంతపురం అర్బన్ : నగర పాలక సంస్థ పాలన అస్తవ్యస్తంగా, అశాస్త్రీయంగా మారిందని, పైసలకు కక్కుర్తిపడి పనులు చేస్తున్నారంటూ మాజీ మంత్రి, పీసీసీ ఉపాధ్యక్షులు సాకే శైలజానాథ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. మూడున్నరేళ్లలో 12 మంది కమిషనర్లు మారడమంటే ఇంత కంటే సిగ్గుచేటన్నారు. ప్రస్తుతం వచ్చే కమిషనర్ అయినా బిల్లులపై సంతకాలు చేసేందుకు కాకుండా పాలన గాడిలో పెట్టాలన్నారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. నగర పాలక సంస్థ పాలనకు దిశా నిర్దేశం లేకుండా పోయిందన్నారు. పైప్‌లైన్ నిర్మాణం పేరుతో నగరాన్ని తవ్వేశారన్నారు. చేయని పనులకు బిల్లులు పెట్టారంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన కార్పొరేటర్లే రెండు వర్గాలు చీలిపోయి ధర్నాలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంతకు దిగజారిందో అర్థమవుతోందన్నారు. వాస్తవంగా నగరాన్ని నిర్మించి కాంగ్రెస్ పార్టీయే అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి చొరవతో పీఏబీఆర్ పైప్‌లైన్ పథకం ఏర్పాటయిందని, నగరాభివృద్ధికి నిధులు విడుదల చేసిందని కాంగ్రెస్ హయాంలోనే అనే విషయం ప్రజలకు తెలుసన్నారు. ప్రజలు కోరుకునే పాలన అందించకపోతే కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు దాదాగాంధీ, పీసీసీ అధికార ప్రతినిధి కేవీరమణ, ప్రధాన కార్యదర్శులు వాసు, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
'ప్రత్యేకం'లో టీడీపీ పూర్తిగా విఫలం
చిత్తూరు: రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించడంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి శైలజానాథ్ అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, టీడీపీ చేస్తున్న దగాకు నిరసనగా తిరుపతిలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో శనివారం పోరుసభ నిర్వహించనున్నట్లు శైలజానాథ్ తెలిపారు. గురువారం ఆయన చిత్తూరులో విలేకరులతో మాట్లాడారు. 'ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంలో టీడీపీ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని గట్టిగా అడిగే ధైర్యం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లేదు. బీజేపీ, టీడీపీ కలిసి ప్రజలను దగా చేస్తున్నాయి. రాజధాని నిర్మాణానికి ఇతర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం బాధాకరం. భారతదేశంలో మేధావులైన ఇంజినీర్లు ఉన్నప్పటికీ వారిని కాదని ఇతర దేశాల ఇంజినీర్లను ప్రోత్సహించడం సిగ్గుచేటు. పోలవరం ప్రాజెక్టుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 90 శాతం నిధులు ప్రకటించింది. హుద్ హుద్ తుపాన్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత డబ్బు దోచుకుందో వాటికి లెక్కలు లేవు. రాష్ట్రానికి హోదా రాకపోయినా కేంద్రం నుంచి ప్యాకేజీ వస్తే చాలులే అని ముఖ్యమంత్రి ధీమాగా ఉన్నారు' అని శైలజానాథ్ ఆరోపించారు. -
టీడీపీ పాలన అస్తవ్యస్తం
ఒంగోలు సబర్బన్ : రాష్ట్రంలో టీడీపీ పాలన అస్తవ్యస్థంగా మారిందని, సాధారణంగా ప్రభుత్వంపై రెండుమూడేళ్ల తర్వాత ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతుందని, అలాంటిది ఏడు నెలల్లోపే ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. సోమవారం ఒంగోలు వచ్చిన ఆయన స్థానిక డీసీసీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై విమర్శలు గుప్పించారు. మొన్నటి సాధారణ ఎన్నికల్లో అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి చంద్రబాబు రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేశాడని ధ్వజమెత్తారు. ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూయించటం మినహా ఇప్పటి వరకు ఆయన ఒరగబెట్టిందేమీలేదన్నారు. జిల్లా అభివృద్ధి చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందన్నారు. ఇసుక రీచ్‌లను డ్వాక్రా గ్రూపులకు అప్పగించామని చెప్పారని, చివరకు అవి టీడీపీ నాయకులు, కార్యకర్తల చేతుల్లోకి వెళ్లాయన్నారు. గతంలో ఉన్న ఇసుక ధరలు ప్రస్తుతం రెట్టింపు కావడంతో సామాన్య ప్రజలకు ఇళ్లు కట్టుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూడా ప్రజలను మోసం చేసే పనిలోనే నిమగ్నమై ఉందన్నారు. ప్రజలకు హక్కులు కల్పించటం, సుపరిపాలన అందించటం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమన్నారు. బీజేపీ స్వచ్ఛ భారత్ పేరిట ప్రజాధనం రూ.కోట్లు వృథా చేస్తోందని శైలజానాథ్ విమర్శించారు. డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో దొనకొండను పారిశ్రామిక కారిడార్ చేస్తానని చంద్రబాబు గెలిచినప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారని, ఇంత వరకు విధి విధానాలు కూడా విడుదల చేసిన దాఖలాలు లేవన్నారు. అసలు పారిశ్రామిక కారిడార్ ఎక్కడ పెడతారో తెలియని అయోమయంలో జిల్లా ప్రజలున్నట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలో ప్రజల్లో మార్పు రానుందన్నారు.సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ జి.రాజ్‌విమల్, ఎద్దు శశికాంత్‌భూషణ్, వేమా శ్రీనివాసరావు, దాసరి నాగలక్ష్మి, గాదె లక్ష్మారెడ్డి, పర్రె నవీన్‌రాయ్ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబును ఉరి తీయాలి: శైలజానాథ్
కళ్యాణదుర్గం: రైతులు, మహిళలను నట్టేట ముంచిన ముఖ్యమంత్రి చంద్రబాబును చెట్టుకు ఉరి తీయాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సాకే శైలజానాథ్ అన్నారు. టీడీపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ సోమవారం శైలజానాథ్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. అంతకుముందు కళ్యాణదుర్గం భవన్ (పీసీసీ అధ్యక్షుడు రఘువీరా నివాసం) నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద రెండు గంటల పాటు బైఠాయించారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ యోగ్యత లేనప్పుడు హామీలు గుప్పించి రైతులను, మహిళలను మోసం చేయడం ఎంత వరకు సమంజసమని సూటిగా ప్రశ్నించారు. ‘ఎన్నికల మేనిఫేస్టోలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చావో ప్రజల ముందుకొచ్చి ధైర్యంగా చెప్పగలరా’ అంటూ నిలదీశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 ఎన్నికల్లో ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చి ప్రమాణ స్వీకారం చేసిన రోజునే దాన్ని నెరవేర్చారని గుర్తు చేశారు. -
'వందరోజుల పాలనలో ఒరిగిందేమీ లేదు'
అనంతపురం: సీఎం చంద్రబాబుపై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. చంద్రబాబు రైతు వ్యతిరేకి అంటూ ధ్వజమెత్తారు. వ్యవసాయ రుణాల మాఫీ పేరుతో అధికారం చేపట్టి రైతుల్నే మోసం చేశారని విమర్శించారు. బంగారం వేలం పాటలను అడ్డుకుంటామని అన్నారు. వందరోజుల చంద్రబాబు పాలనలో ప్రజలకు ఒరిగిందేమి లేదని చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన రైతు రుణ మాఫీని అమలు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆరోపించారు. -
ఆ మూడు జిల్లాలకే ప్రాధాన్యతా?
అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని, అభివృద్ధి, కేంద్ర సంస్థల ఏర్పాటులో కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోందని మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వెనుబడిన ప్రాంతమైన అనంతపురం జిల్లా ప్రయోజనాల గురించి అధికారపక్ష ప్రజాప్రతినిధులు మాట్లాడడం లేదని విమర్శించారు. రాజధాని సహా కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నిటినీ గుంటూరు, విజయవాడ, విశాఖ ప్రాంతాలకే పరిమితం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరమైనట్లు కనిపిస్తోందని చెప్పారు. -
ఆ చికిత్స దేశంలో అందుబాటులో లేదా?
అసలు ఈ విషయాన్ని కనీసం పరిశీలించారా? శైలజానాథ్ చికిత్సకు రూ.43.66 లక్షలు కేటాయింపుపై సర్కారును నిలదీసిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: అమెరికాలో చికిత్స చేయించుకునేందుకు మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌కు రూ.43.66 లక్షలు కేటాయిస్తూ జారీ చేసిన జీవోపై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. శైలజానాథ్‌కు అవసరమైన చికిత్స మనదేశంలో అందుబాటులో లేదా? అని ప్రశ్నించింది. అసలు ఈ విషయాన్ని కనీసం పరిశీలించారా? అని అధికారులను నిలదీసింది. ఈ కేటాయింపులను ఎలా సమర్థించుకుంటారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. శైలజానాథ్‌కు వైద్యం కోసం రూ.43.66 లక్షలు కేటాయించడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్, శాంతినగర్‌కు చెందిన మంగీలాల్ వంకోదూత్ ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీనిని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం లోని ధర్మాసనం సోమవారం విచారించింది. ఛాతీ ఎడమభాగంలో వచ్చిన ట్యూమర్‌కు అమెరికా న్యూజెర్సీలోని మెమోరియల్ స్లాన్ కెట్టరింగ్ కేన్సర్ సెంటర్లో చికిత్స చేయించుకునేందుకు రూ.43.66 లక్షలు కేటాయిస్తూ ప్రభుత్వం గతనెల 17న జీవో జారీ చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది నివేదించారు. ఇందులో రూ.23.66 లక్షలు వైద్యఖర్చులకు, రూ.5 లక్షలు ప్రయాణ ఖర్చులకు, న్యూజెర్సీలో ఉండేందుకు రూ.15లక్షలు కేటాయించినట్టు తెలిపారు. శైలజానాథ్ పేదవాడు కాదని, ఆర్థికంగా ఉన్నవ్యక్తేనని, అలాంటి ఆయనకు ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వడం అన్యాయమన్నారు. ఇది ప్రజాధనాన్ని దుర్విని యోగం చేయడమేనన్నారు. ఈ వాదనలతో ప్రధాన న్యాయమూర్తి ఏకీభవిస్తూ.. పూర్తి వివరాలతో కౌంటర్ల దాఖలుకు ఆదేశించారు. విచారణను మూడు వారాలపాటు వాయిదా వేశారు. -
టీడీపీలో చేరేందుకు శైలజానాథ్ యత్నం
అనంతపురం: సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఝలక్ ఇవ్వనున్నారా? ఆదిలో టీడీపీలో చేరేందుకు తన సన్నిహితుడు ద్వారా జేసీ బ్రదర్స్‌తో నెరపిన రాయబారం విఫలమైందా? ఇప్పుడు చంద్రబాబు కోటరీలో కీలకమైన సీఎం రమేష్ ద్వారా శైలజానాథ్ బేరసారాలు సాగిస్తున్నారా? అనే ప్రశ్నలకు టీడీపీ వర్గాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. శింగనమలలో ఆదివారం ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ శమంతకమణి నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీ శ్రేణులు ఇదే విషయంపై మండిపడ్డాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభంజనంలో 2004 ఎన్నికల్లో శింగనమల నియోజకవర్గం నుంచి విజయం సాధించి.. శాసనసభలో అడుగుపెట్టిన శైలజానాథ్.. 2009 ఎన్నికల్లోనూ గెలుపొందారు. వైఎస్ హఠాన్మరణం శైలజానాథ్‌కు అనూహ్యంగా స్థానం దక్కింది. జేసీ దివాకర్‌రెడ్డికి మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి అంతరంగికుడిగా శైలజానాథ్ వ్యవహరిస్తున్నారు. సీఎంగా కిరణ్ ఉన్న కాలంలో ఆయన దన్నుతో శైలజానాథ్ భారీ ఎత్తున అక్రమార్జన సాగించారనే ఆరోపణలు అప్పట్లో కాంగ్రెస్ నేతల నుంచే వ్యక్తమయ్యాయి. కిరణ్‌తో కలిసి సమైక్యరాగం ఆలపిస్తూ ఆయన వెన్నంటే నడిచారు. ఇందుకు ప్రతిఫలంగానే కిరణ్.. శైలజానాథ్‌ను సమైక్యాంధ్ర పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించారు. కాగా, కిరణ్.. సీఎం పదవికి రాజీనామా చేయక ముందే శైలజానాథ్ పక్క చూపులు చూశారు. వైఎస్సార్సీపీలో ఖాళీ లేకపోవడంతో టీడీపీపై కన్నేశారు. వచ్చే ఎన్నికల్లో శింగనమల నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎత్తు వేశారు. ఆ క్రమంలోనే తన సన్నిహితుడు బొమ్మలాటపల్లి నర్సింహారెడ్డిని జేసీ బ్రదర్స్ వద్దకు రాయబారం పంపారు. టీడీపీలో తనకు శింగనమల నుంచి అవకాశం కల్పించేలా చంద్రబాబుపై ఒత్తిడి తేవాలన్న శైలజానాథ్ ప్రతిపాదనకు జేసీ బ్రదర్స్ అంగీకరించలేదు. ఆ సీటును తమ అనుచరుడు కంబగిరి రాముడుకు ఇప్పించుకుంటామని జేసీ బ్రదర్స్ తెగేసి చెప్పడంతోనే విధిలేని పరిస్థితుల్లో శైలజానాథ్.. కిరణ్ వెంట నడిచారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కిరణ్ ఏర్పాటు చేసిన సమైక్యాంధ్ర పార్టీకి భవిత లేదనే భావనకు వచ్చిన శైలజానాథ్.. మళ్లీ టీడీపీలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఆ క్రమంలోనే చంద్రబాబు కోటరీలో కీలకమైన సీఎం రమేష్‌తో ఆయన చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీలో తనకు శింగనమల నుంచి అవకాశం కల్పిస్తే.. పార్టీ ఫండ్ రూపంలో భారీ ఎత్తున ముట్టజెపుతానని శైలజానాథ్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు టీడీపీ సీనియర్ నేత ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు. ఆ బంపర్ ఆఫర్‌ను చంద్రబాబు దృష్టికి సీఎం రమేష్ తీసుకె ళ్లగా.. చంద్రబాబు ఆదేశాల మేరకు శింగనమల నియోజకవర్గ టీడీపీ శ్రేణుల అభిప్రాయాన్ని సేకరించాలని ఎమ్మెల్సీ శమంతకమణిని ఆయన కోరినట్లు తెలిసింది. శింగనమల నుంచి తన కుమారుడిని గానీ.. కుమార్తెను గానీ టీడీపీ తరఫున బరిలోకి దింపాలని శమంతకమణి భావించారు. కానీ.. ఇటీవల ఆ ఆలోచనను ఆమె విరమించుకున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆమె ఎందుకు వెనక్కి తగ్గారన్నది శైలజానాథ్‌కే ఎరుకని టీడీపీ నేతలు చలోక్తులు విసురుతున్నారు. శైలజానాథ్‌ను పార్టీలోకి చేర్చుకోవడంపై శ్రేణుల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి సీఎం రమేష్ సమావేశం ఏర్పాటు చేయమనగానే శమంతకమణి కార్యకర్తల సమావేశం నిర్వహించడంతో ఆ అనుమానాలు బలపడుతున్నాయి. కానీ.. సమావేశంలో కార్యకర్తలు శైలజానాథ్ చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. అదే జరిగితే పార్టీని వీడుతామని స్పష్టం చేసినట్లు సమాచారం. పార్టీ శ్రేణుల మనోభిప్రాయాలతో నిమిత్తం లేకుండానే ‘భారీ ప్యాకేజ్’ ద్వారా శైలజానాథ్‌కు టీడీపీ తీర్థం ఇచ్చేందుకు బాబు సిద్ధపడుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
అధికార వాహనం వదిలి ఆటోలో ఇంటికి...
హైదరాబాద్: విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపడంతో సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు రాజీనామాల బాట పట్టారు. కాంగ్రెస్ పార్టీకి, పదవులకు రాజీనామా సమర్పిస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎం, ఎమ్మెల్యే పదవులతో సహా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన బాటలో మిగతా సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు పయనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా చేశారు. మంత్రి సాకే శైలజానాథ్ అధికారిక వాహనాన్ని వదిలి సీఎం క్యాంపు కార్యాలయం వద్ద వదిలి ఆటోలో వెళ్లిపోయారు. అయితే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం లేదు. కేంద్ర మంత్రి పురందేశ్వరి, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు నిన్న రాజీనామా చేశారు. -
‘వక్రీకరణలు వినే దౌర్భాగ్యం వచ్చింది’
హైదరాబాద్: చరిత్రను వక్రీకరిస్తుంటే వింటూ కూర్చోవాల్సిన దౌర్భాగ్యం కలిగిందని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శైలజానాథ్ వ్యాఖ్యానించారు. నిజాం నవాబు సెక్యులర్ వాది అని ఇటీవల పోస్టర్లు చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. నిజాం నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా, విశాలాంధ్ర కోసం పోరాడిన సాయుధ కమ్యూనిస్టుల ఉద్యమ చరిత్రను మార్చే విధంగా మాట్లాడడం తగదని అన్నారు. విశాలాంధ్ర అన్న వారు ఓట్లు, సీట్ల కోసం విధానం మార్చుకోవచ్చు కాని, చరిత్రను వక్రీకరించరాదని ఆయన అన్నారు. శుక్రవారం శాసనసభలో ‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2013’పై చర్చ సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. -
నువ్వా.. నేనా..
సాక్షి ప్రతినిధి, అనంతపురం : జిల్లా కాంగ్రెస్‌లో సరి కొత్త వర్గపోరుకు తెరలేచింది. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్ష పదవి వేదికగా రెవెన్యూ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి, ప్రాథమిక విద్యా శాఖ మంత్రి సాకే శైలజానాథ్ అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. పదవీ కాలం ముగియకున్నా రషీద్ అహ్మద్‌ను ఆ పదవి నుంచి తొలగించడంపైనా.. తన వర్గీయుడైన బొమ్మలాటపల్లి నర్సింహారెడ్డికి పదవి కట్టబెట్టడంలో శైలజానాథ్ వ్యవహరించిన తీరుపై మంత్రి రఘువీరా, అనంత వెంకట్రామిరెడ్డి మండిపడుతున్నారు. ఈ వ్యవహారంలో క్విడ్‌ప్రోకో జరిగిందంటూ రఘువీరా వర్గం కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి రెవెన్యూ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి మధ్య విభేదాలు పొడచూపాయి. ఇద్దరూ ఎడమొహం పెడమొహం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో జిల్లాలో రఘువీరా వర్గానికి చెక్ పెట్టడం కోసం సీఎం కిరణ్ ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్‌ను దగ్గరకు తీశారు. శైలజానాథ్ మాటకే ఎక్కువ ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో 2011 జనవరి 18న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియమితులైన రషీద్ అహ్మద్ ఆ పదవిలో రెండేళ్లపాటు కొనసాగేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2013 జనవరి 18 నాటికి రషీద్ అహ్మద్ పదవీకాలం ముగిసింది. అప్పట్లో తన పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించాలన్న రషీద్ అహ్మద్ అభ్యర్థనను ప్రభుత్వం మన్నించింది. రషీద్ అహ్మద్ పదవీకాలం 2014 జనవరి 18తో ముగియనుంది. కానీ.. మంత్రి శైలజానాథ్ ఇవేవీ పట్టించుకోలేదు. తన శాఖ పరిధిలోని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిని అనుచరుడైన కాంట్రాక్టర్ బొమ్మలాటపల్లి నర్సింహారెడ్డికి కట్టబెట్టాలని సీఎం కిరణ్‌పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గిన సీఎం.. బొమ్మలాటపల్లి నర్సింహారెడ్డిని గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియమిస్తూ డిసెంబర్ 20న ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై మంత్రి రఘువీరా, ఎంపీ అనంత.. సీఎం కిరణ్ వద్ద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రషీద్ అహ్మద్ పదవీకాలం ముగియకున్నా ఎందుకు తొలగించారంటూ సీఎంను నిలదీశారు. ఇది పసిగట్టిన మంత్రి శైలజానాథ్ డిసెంబర్ 21నే తన నివాసంలోనే బొమ్మలాటపల్లి నర్సింహారెడ్డితో రహస్యంగా ప్రమాణ స్వీకారం చేయించేశారు. ఈ వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. సీఎం తమ మాటలు లెక్క చేయకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాలని రషీద్ అహ్మద్‌కు రఘువీరా, అనంత సూచించారు. జిల్లాలో కొత్తచెరువు వద్ద నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదంలో 26 మంది సజీవ దహనమైన రోజే.. అనంతపురంలో ఘనంగా బొమ్మలాటపల్లి నర్సింహారెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ సభ నిర్వహించారు. రఘువీరా సూచన మేరకు రషీద్ అహ్మద్ హైకోర్టును ఆశ్రయించారు. పదవీ కాలం ముగిసే వరకూ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిలో రషీద్ అహ్మద్ కొనసాగేలా చూడాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుపై విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఆదివారం బాధ్యతలు స్వీకరిస్తానని రషీద్ అహ్మద్ ‘సాక్షి’కి తెలిపారు. బొమ్మలాటపల్లి నర్సింహారెడ్డికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిని కట్టబెట్టడంలో క్విడ్‌ప్రోకో జరిగిందని రఘువీరా వర్గం ఆరోపిస్తోంది. అనంతపురం మున్సిపాల్టీ పరిధిలో వివాదంలో ఉన్న సర్వే నెంబరు 342లోని 25.50 సెంట్ల భూమిని మంత్రి శైలజానాథ్‌కు బొమ్మలాటపల్లి నర్సింహారెడ్డి ముట్టజెప్పిన తర్వాతనే.. ఆయనను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియమించారని రఘువీరా వర్గం ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంలో క్విడ్‌ప్రోకో జరిగిందంటూ కాంగ్రెస్ అధిష్టానానికి రఘువీరా వర్గం ఫిర్యాదు చేయడం కొసమెరుపు. -
శైలజానాథ్‌ను అడ్డుకున్న సీఎం!
-
శైలజానాథ్‌ను అడ్డుకున్న సీఎం!
* రాష్ట్రపతికి సమైక్య వినతిపత్రం ఇవ్వకుండా లాక్కున్న వైనం సాక్షి, అనంతపురం: సమైక్య ముసుగులో విభజన వీరుడిని తానేనని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మరోసారి చాటుకున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి వినతిపత్రం సమర్పించేందుకు యత్నించిన ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సాకే శైలజానాథ్‌ను అడ్డుకున్నారు. సాక్షాత్తూ ప్రణబ్ ముఖర్జీ, వందలాదిమంది అధికారులు, వేలాదిమంది విద్యార్థులు చూస్తుండగా వినతిపత్రాన్ని లాక్కున్నారు. ఈ సంఘటనకు నీలం సంజీవరెడ్డి శత జయంతి ముగింపు వేడుకలు వేదికయ్యాయి. వివరాల్లోకి వెళితే.. మాజీ రాష్ట్రపతి నీలం శత జయంతి ముగింపు వేడుకలు సోమవారం అనంతపురంలో నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా రాష్ట్రపతి పాల్గొన్నారు. మంత్రి శైలజానాథ్ ప్రారంభోపన్యాసం చేశారు. రాష్ట్రాన్ని క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కించాలని.. సమైక్యంగా ఉంచాలని కోరుతూ రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పిస్తున్నానని సభాముఖంగా ప్రకటించారు. రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించేందుకు వెళ్లారు. కానీ రాష్ట్రపతి పక్కనే కూర్చున్న కిరణ్.. శైలజానాథ్ చేతుల్లో ఉన్న వినతిపత్రాన్ని విసురుగా లాక్కున్నారు. ఇప్పుడు వినతిపత్రం ఇవ్వొద్దంటూ మంత్రిపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరణ్ ఒత్తిడి మేరకు శైలజానాథ్ వెనక్కి తగ్గి, తన స్థానంలో కూర్చుండిపోయారు. ఆ తర్వాత ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ముగింపు ఉపన్యాసం చేస్తూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ప్రణబ్‌ను డిమాండ్ చేశారు. తెలుగుజాతి ఐక్యతను కాపాడాల్సిన ధర్మం రాష్ట్రపతిపై ఉందన్నారు. ప్రణబ్ వేదిక దిగుతున్న సమయంలో మంత్రిని వెంట తీసుకుని వెళ్లారు. వినతిపత్రాన్ని రాష్ట్రపతికి సమర్పించారు. ఆ సమయంలో సీఎం కిరణ్ అక్కడే ఉన్నా మిన్నకుండిపోవడం గమనార్హం. సమైక్యవాదులను నిర్బంధించిన పోలీసులు రాష్ట్రపతి పర్యటనను సమైక్యవాదులు అడ్డుకుంటారనే భావనతో వైఎస్సార్సీపీ, విద్యార్థి, ప్రజాసంఘాల నేతలను సోమవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
సీఎంతో శైలజానాథ్, ధర్మాన భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సాకే శైలజానాధ్, మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావులు మంగళవారం క్యాంపు కార్యాలయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన నిర్ణయంపై తీవ్ర నిరసనతో ఉన్న ధర్మాన గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. త్వరలో కాంగ్రెస్‌ను వీడనున్నారంటూ వార్తలు వస్తున్న సమయంలో ఆయన ముఖ్యమంత్రితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగి ఉంటుందని కాంగ్రెస్‌వర్గాలు భావిస్తున్నాయి. తన నియోజకవర్గంలో ఇటీవల జరిగిన రచ్చబండలో సీఎం పాల్గొన్నారని, దానికి కృతజ్ఞతలు తెలిపేందుకే సీఎంను కలిశానని శైలజానాథ్ చెప్పారు. అయితే తెలంగాణ ముసాయిదా బిల్లుపై కేంద్ర మంత్రుల బృందం కసరత్తు, అది అసెంబ్లీకి రానుండడం తదితర అంశాలపైనా వారు చర్చించినట్లు తెలుస్తోంది. -
వాడీవేడిగా
ఒంగోలు, న్యూస్‌లైన్: జిల్లా అభివృద్ధిపై అధికారులకు ఏమాత్రం చిత్తశుద్ధిలేదని జిల్లా ఇన్చార్జి మంత్రి సాకే శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లా సమీక్ష మండలి(డీఆర్సీ) సమావేశం వాడీవేడిగా జరిగింది.‘జిల్లాలో ఏం జరుగుతుందో తెలియడంలేదు. నిధులు ఎలా మంజూరు చేయించుకోవాలో తెలియదు. వచ్చిన వాటిని ఎలా ఖర్చు చేయాలో మీకు అర్థం కాదు’ అని మంత్రి ధ్వజమెత్తారు. సభ్యుల ప్రశ్నలతో సమావేశం ఉత్కంఠగా సాగింది. ఒక పూట భోజనం పెడితే సరిపోతుందా? గత నెలలో సంభవించిన వరదల వల్ల ముంపునకు గురైన ప్రాంతాల గురించి అధికారులు పట్టించుకోలేదని వైఎస్సార్సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. సంకువానిగుంట గ్రామస్తులు ఆరురోజులపాటు నడుం లోతు నీళ్లల్లో ఉన్నారని.. వారంతా దళితులేనని తెలిపారు. వారి బాగోగులు పట్టించుకోకుండా ఒక్కరోజు భోజనం పెడితే సరిపోతుందా? అని ప్రశ్నించారు. ఇప్పటివరకు బాధితులకు ఎలాంటి పరిహారం అందలేదన్నారు. తామే పడవలో వెళ్లి బాధితులకు ఆహారం అందించాల్సి వచ్చిందని తెలిపారు. హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలి.. బాధితులను ఆదుకోవాలని తాను కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం సరిగా చర్యలు తీసుకోలేదని వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు జూపూడి ప్రభాకరరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ ప్రాంత సమస్య పరిష్కరించాలంటే వాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలని కోరారు. దీనిపై ఒంగోలు ఆర్డీఓ మాట్లాడుతూ రోడ్లు కోతకు గురికావడంతో ఆ ప్రాంతానికి వెళ్లలేకపోయామని.. ఇప్పుడు పంపిణీ చేయిస్తామనడంతో సభ్యులతో పాటు మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. సాయంత్రం లోగా ఆ గ్రామంలో బియ్యం, కిరోసిన్ పంపిణీ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వమే శనగలు కొనుగోలు చేయాలి జిల్లాలోని కోల్డుస్టోరేజీల్లో పేరుకుపోయిన శనగలను ప్రభుత్వమే వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా కొనుగోలు చేయాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, పర్చూరు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావులు ప్రతిపాదించారు. శనగ రైతులపై బ్యాంకర్ల ఒత్తిడి తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. తమ ప్రాంతంలో 44 వేల ఎకరాల్లో పంట నష్టం సంభవించిందని చీరాల ఎమ్మెల్యే ఆమంచి తెలిపారు. నియోజకవర్గంలో ఒక అంగన్వాడీ కేంద్రం భవనాన్ని కూల్చివేసి అందులోని సామగ్రిని అమ్ముకున్నారని ఆరోపించారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఐసీడీఎస్ సమస్యలను ప్రస్తావించారు. విద్యాశాఖలో పదోన్నతులు కల్పించాలని ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసరెడ్డి కోరారు. జిల్లాలో 18 హెచ్ఎం పోస్టులు.. 150 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. హాస్టళ్ల నిర్మాణాలు ఎక్కడ? సింగరాయకొండ, తిమ్మసముద్రంలో చేపట్టిన బీసీ హాస్టళ్ల నిర్మాణాలు గత నాలుగైదు సంవత్సరాలుగా అర్ధాంతరంగా నిలిచిపోయాయని కొండపి, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు జీవీ శేషు, బీఎన్ విజయ్‌కుమార్‌లు సమావేశం దృష్టికి తెచ్చారు. ఈ విషయం తమకు సంబంధంలేదంటూ బీసీ సంక్షేమ శాఖ అధికారి ప్రకటించడంతో.. మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ కూడా ఎవ రో తెలియకుండానే పని చేస్తున్నారా? అని ప్రశ్నించారు. విచారణ చేపట్టి.. కారకులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టులపై రచ్చ.. పాలేటిపల్లి, మల్లవరం రిజర్వాయర్లు, కొరిశపాడు చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం, వెలిగొండ ప్రాజెక్టుల పురోగతిపై అధికారుల వివరణ ఎవరినీ సంతృప్తి పరచలేదు. వెలిగొండ టన్నెల్ నిర్మాణం కేవలం 46 శాతం పూర్తయితే.. నిర్మాణం మొత్తం ఎప్పటికి పూర్తవుతుందని ఎస్ఈని ప్రశ్నించారు. కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టు పరిధిలోని తమ భూములు స్వాధీనం చేసుకొని కాలువలు తవ్వుతున్నారని.. కానీ ఇప్పటికీ నష్టపరిహారం పంపిణీ చేయలేదన్నారు. ప్రాజెక్టు వ్యవహారాలపై ఇంజినీరింగ్, నీటిపారుదల, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ, జాతీయరహదారుల శాఖల తో మరోసారి సమావేశం కావాలని తీర్మానించా రు. రిమ్స్ నిర్మాణాల్లో జాప్యం జరిగితే కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేయాలని కోరారు. బ్యాంకర్లు సహకరించడంలేదు.. బ్యాంకర్ల వల్ల రైతుల నష్టపరిహారం పంపిణీ జాప్యమవుతోందని వ్యవసాయశాఖ జేడీ దొరసాని తెలిపారు. నీలం తుపాను పరిహారంగా జిల్లాకు రూ 5.12 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఇప్పటికి రూ 2.38 కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఎస్బీఐ, ఎస్బీహెచ్ అధికారులు రైతుల అకౌంట్లలో నగదు జమ చేయడానికి సహకరించడంలేదని ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ విజయకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లీడ్‌బ్యాంకు మేనేజర్ వివరణ ఇస్తూ సోమవారమే అకౌంట్లకు జమయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
నేడు ‘ఢీ’ఆర్సీ
ఒంగోలు, న్యూస్‌లైన్: మూడు నెలలకోసారి జరగాల్సిన డీఆర్సీ సమావేశాన్ని ఈసారి ఏకంగా ఎనిమిది నెలల తరువాత ఆదివారం నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి స్థానిక సీపీఓ సమావేశ మందిరంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి సాకే శైలజానాథ్ అధ్యక్షతన సమావేశం జరుగుతుందని కలెక్టర్ విజయ్‌కుమార్ ప్రకటించారు. సమస్యల కొలిమిలో కొట్టుమిట్టాడుతున్న జనం తమ కోసం ప్రజాప్రతినిధులు ఏమేరకు నోరు విప్పుతారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. రైతు సమస్యలపై స్పష్టమైన ప్రకటన వెలువడేనా.. జిల్లాలో భారీ వర్షాలకు పంటలన్నీ తుడిచి పెట్టుకుపోయినా..రైతులకు ఇంత వరకు ప్రభుత్వం నుంచి కనీస సాయం లభించలేదు. సీఎం వచ్చి..రూ 600 కోట్ల మేర వరద నష్టం సంభవించిందని ప్రకటించారు. రైతులకు అవసరమైన వరి విత్తనాలు జిల్లాకు పంపుతామని ప్రకటించారు. కానీ ఇంత వరకు అవి జిల్లాకు చేరనే లేదు. గతంలో తుపాన్ల వల్ల పంట నష్టపోయిన వారికే ఇంత వరకు పరిహారం ఇవ్వకపోవడంపై రైతుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పర్చూరు, చీరాల ప్రాంతంలో వరద కాల్వల నిర్మాణం సరిగా లేదు. డ్రైనేజీ కాల్వలు ఆక్రమణలకు గురయ్యాయి. అటువంటి వాటిపై ఎన్నిసార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా కనీస చర్యలు లేవు. ఈ సమావేశంలోనైనా వాటి పరిష్కారానికి స్పష్టమైన హామీలు లభిస్తాయేమోనని రైతులు ఎదురుచూస్తున్నారు. విత్తనాలకూ వెనకాడుతున్నారు: ప్రభుత్వం రైతులకు నగదు బదిలీ పథకం అమలుచేయడంతో సబ్సిడీ విత్తనాలు తీసుకునేందుకు సైతం వారు వెనుకాడుతున్నారు. కిలో శనగలు బహిరంగ మార్కెట్లో రూ 33 ఉంటే సబ్సిడీపై ఇచ్చే శనగల రేటు మాత్రం రూ 43.65 ఉంది. విత్తనాల ధర నిర్ణయంలోనే చాలా అక్రమాలు చోటుచేసుకున్నాయి. దాదాపు రెండేళ్లుగా శనగలన్నీ కోల్డు స్టోరేజీల్లోనే నిల్వ ఉన్నా విత్తన గిడ్డంగుల అధికారులు మాత్రం ముందు ప్రభుత్వ ధర ప్రకారం కొంటే తరువాత 25 శాతం సబ్సిడీ మొత్తాన్ని వారి ఖాతాలకు జమచేస్తామని ప్రకటిస్తుండడం రైతుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించింది. ముంపునకు ముగింపేదీ... ఒంగోలు నగరంలోని జనావాసాల ముంపునకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అధికారులు దాని ఊసే పట్టించుకోవడం లేదు. ఒంగోలును కార్పొరేషన్‌గా ప్రకటించారే తప్ప కనీసం మంచినీటి సమస్యకు కూడా పరిష్కారం చూపలేకపోతున్నారు. మున్సిపల్ నిధులు వెచ్చించి తాగునీరు ట్యాంకర్ల ద్వారా నీర ందించడమే తప్ప అందుబాటులో ఉన్న ఓవర్‌హెడ్ ట్యాంకులను ప్రారంభించేందుకు సైతం అధికారులు చొరవ చూపడంలేదు. శివారు కాలనీలు కార్పొరేషన్లో కలిసినా ఇంతవరకు కనీసం వీధి లైట్లు కూడా వెలగడంలేదు. ముంపునకు కారణమైన పోతురాజు కాలువ ఆధునికీకరణకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ రూ18 కోట్లు వెచ్చించినా పనులు ముందుకు సాగడం లేదు. ప్రజారోగ్యంపై చిత్తశుద్ధి ఏదీ.. రిమ్స్‌లో సీటీ స్కాన్ పనిచేయడం లేదు. సాక్షాత్తు అప్పటి వైద్య ఆరోగ్య శాఖామంత్రి ప్రకటించినా నేటికీ ప్లేట్లెట్స్ మెషీన్ అందుబాటులోకి రాలేదు. రాష్ట్ర పురపాలక శాఖామంత్రి సొంత జిల్లా అయిన ఒంగోలు నగర పాలక సంస్థలో అయిదు నెలలుగా ప్రజారోగ్య శాఖ అధికారి పోస్టు కూడా ఖాళీగా ఉండడం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. రోడ్లు- ప్రాజెక్టుపైనా చర్చ: ఒంగోలు- చీరాల రోడ్డులో ఉన్న గుండ్లకమ్మ వాగుపై బ్రిడ్జి గతంలో కొంత భాగం కొట్టుకుపోయింది. అప్పట్లో తాత్కాలిక మరమ్మతులు చేసి వదిలేశారు. శాశ్వత నిర్మాణం చేస్తామని జాతీయరహదారుల శాఖ ప్రకటించింది. అయినా ఇప్పటికీ దిక్కులేదు. ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్ రహదారులు కోతకు గురయ్యాయి. పలు బ్రిడ్జిలు సైతం శిథిలావస్థకు చేరాయి. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగింది. దీంతో ఏడాదికేడాదికి అంచనాలు పెరిగిపోతూ వస్తున్నాయి. కానీ కేటాయిస్తున్న బడ్జెట్ మాత్రం అరకొరగానే ఉంటోంది. ఈ అంశాలు కూడా డీఆర్సీ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. చివరి డీఆర్సీ: గత డీఆర్సీ ఎనిమిది నెలల క్రితం జరిగింది. ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వ హయాంలో మరో మూడు నెలల్లో డీఆర్సీ జరుగుతుందనేది ఆశావాదమే.