
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ నాయకత్వంలో పని చేస్తూ, ఎన్‌డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకుని ప్రజల పక్షాన పోరాడాలని నిర్ణయించుకున్నానని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైఎస్సార్‌సీపీలోకి చేరారు. శైలజానాథ్‌తో పాటు ఏఐసీసీ మెంబర్, అనంతపురం డీసీసీ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి కూడా చేరారు.
వైఎస్సార్‌సీపీలో చేరిన అనంతరం శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడం లేదని.. మరో వైపు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్వీర్యం చేయడం ద్వారా, పేదలకు వైద్య విద్య దూరం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో వైఎస్ జగన్ విద్యా రంగంలో చేసిన అమలు చేసిన అనేక సంస్కరణలను ఈ ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు.
‘‘ప్రజల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని.. రాయలసీమ జిల్లాల్లో రైతుల కష్టాలను కూడా చంద్రబాబు ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదు. వారి తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తామని శైలజానాథ్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుల సహకారంతో ముందుకు వెళ్తాం. ప్రజల పక్షాన పోరాడుతాం. మొక్కవోని ధైర్యంతో పని చేసే నాయకత్వం జగన్‌ది. అందుకే ఆయన నేతృత్వంలో పని చేసేందుకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆయన వెల్లడించారు.
చంద్రబాబు నిజ స్వరూపం బయటపడుతోంది: అనంత వెంకట్రామిరెడ్డి
ఈ రోజు శైలజానాథ్ మా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని ఆహ్వానిస్తున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చంద్రబాబు నిజ స్వరూపం బయటపడుతోంది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని అనేక మంది మా పార్టీలోకి వస్తున్నారు.
రాయలసీమకు కృష్ణా జలాలు తీసుకొస్తానని చంద్రబాబు చెబుతున్నది శుద్ద అబద్దం. చంద్రబాబు 1996లో ఆ పనులకు శంకుస్ధాపన చేశారు. ఆ తర్వాత పట్టించుకోలేదు. కానీ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎం అయిన తర్వాత కృష్ణా జలాలను రాయలసీమకు అందించారు. చంద్రబాబు రాయలసీమకు ద్రోహం చేశారు. జగన్ సీఎంగా రాయలసీమ అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకున్నారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మా రాయలసీమకు మళ్లీ అన్యాయం చేస్తోంది.
ఇదీ చదవండి: సీఎం రమేష్‌కు ఇక్కడేం పని.. ఎమ్మెల్యే ఆది ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment