చిత్తూరు: రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించడంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి శైలజానాథ్ అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, టీడీపీ చేస్తున్న దగాకు నిరసనగా తిరుపతిలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో శనివారం పోరుసభ నిర్వహించనున్నట్లు శైలజానాథ్ తెలిపారు. గురువారం ఆయన చిత్తూరులో విలేకరులతో మాట్లాడారు.
'ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంలో టీడీపీ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని గట్టిగా అడిగే ధైర్యం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లేదు. బీజేపీ, టీడీపీ కలిసి ప్రజలను దగా చేస్తున్నాయి. రాజధాని నిర్మాణానికి ఇతర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం బాధాకరం. భారతదేశంలో మేధావులైన ఇంజినీర్లు ఉన్నప్పటికీ వారిని కాదని ఇతర దేశాల ఇంజినీర్లను ప్రోత్సహించడం సిగ్గుచేటు. పోలవరం ప్రాజెక్టుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 90 శాతం నిధులు ప్రకటించింది. హుద్ హుద్ తుపాన్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత డబ్బు దోచుకుందో వాటికి లెక్కలు లేవు. రాష్ట్రానికి హోదా రాకపోయినా కేంద్రం నుంచి ప్యాకేజీ వస్తే చాలులే అని ముఖ్యమంత్రి ధీమాగా ఉన్నారు' అని శైలజానాథ్ ఆరోపించారు.
'ప్రత్యేకం'లో టీడీపీ పూర్తిగా విఫలం
Published Thu, Aug 6 2015 7:51 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement