
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీతో టీడీపీ చీకటి ఒప్పందం కుదుర్చుకుందని బీజేవైఎం ఏపీ అధ్యక్షుడు విష్టువర్ధన్‌రెడ్డి విమర్శించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..600 హామీల్లో 590 అమలు చేయలేదు.. బీజేపీని ముద్దాయిలుగా చేయాలని చూస్తే టీడీపీనే మునిగిపోతుందన్నారు.
చంద్రబాబు 40 లక్షల మంది నిరుద్యోగులను వంచించారని మండిపడ్డారు. ఖాళీగా ఉన్న లక్షన్నర ఉద్యోగాలను భర్తీ చేయలేదని.. రుణమాఫీ కూడా అసంపూర్ణంగా చేశారని ఆయన ఆరోపించారు.