లండన్: హైదరాబాద్‌ను పాలించిన నిజాం నవాబు కుటుంబ సభ్యుడు ప్రిన్స్ మోసిన్ అలీఖాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచశాంతికి, స్వంచ్ఛంద సంస్థల తోడ్పాటుకు విశేష సేవలందించినందుకుగాను ఆయనను లండన్‌లో ఘనంగా సత్కరించారు.‘వరల్డ్ పీస్ అండ్ ప్రాస్పరిటీ పౌండేషన్’కు అలీఖాన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ వార్షికోత్సవం లండన్‌లో నిర్వహించారు. కార్యక్రమానికి నగరంలోని అనేకమంది ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మోసిన్ అలీఖాన్‌తో పాటు, సియాసత్ ఉర్దూ దినపత్రిక చీఫ్ ఎడిటర్ జాహిద్ అలీఖాన్, ఇండియన్ ఏయిర్‌ఫోర్స్‌లో పనిచేసిన ఉస్మాన్ షాహిద్‌లతో పాటు వివిధ రంగాలలో సేవలందించిన మరికొందరిని అవార్డులతో సత్కరించారు.