
'పోకిరీల ఆటలు ఇక చెల్లవు'
రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపట్ల కఠినంగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు.
హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపట్ల కఠినంగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. అరాచక శక్తుల ఆట కట్టిస్తామన్నారు. మహానాడులో మూడో రోజు శాంతి భద్రతలపై చర్చించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... హైదరాబాద్ లో శాంతిభద్రతలు పరిరక్షించి మతసామరస్యాన్ని కాపాడింది టీడీపీ అని చెప్పారు. శాంతిభత్రలు నాగరికతకు చిహ్నమన్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నారు. పోకిరీల పట్ల కఠినంగా వ్యహరిస్తామన్నారు. ర్యాగింగ్ జోలికి వెళ్లొద్దని, చదువుపై దృష్టి పెట్టాలని విద్యార్థులకు సూచించారు.