టీడీపీ మహానాడు వల్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయ్యిందే తప్ప, ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఒనగూడలేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. మహానాడులో మంచి తీర్మానాలు వస్తాయని ఆశించామని, అయితే అలాంటివేమీ జరగలేదని ఆయన సోమవారమిక్కడ వ్యాఖ్యానించారు.