ప్రతిపక్ష నేత చంద్రబాబు పీఎస్ నివాస్ ఇంటిపై జరిగిన దాడులపై ఐటీ శాఖ ప్రకటనలో స్పష్టంగా అక్రమాలను వివరించిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కూడా ఎన్డీయేతో కలిసి వెళ్తున్నామని ఎల్లో మీడియా ప్రచారం చేసిందని మండిపడ్డారు. నేడు కూడా చంద్రబాబుకు లబ్ధి చేయడం కోసమే రామోజీరావు ఈ కథనం రాయించారని ధ్వజమెత్తారు.