పచ్చమీడియా రోజురోజుకు దిగజారిపోతుందని వైఎస్సార్‌సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ దాడుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే పవన్‌కల్యాణ్ రాజధానిలో పర్యటించారని విమర్శించారు. రెండు వేల కోట్లు అక్రమ లావాదేవీలు జరిగాయని సీబీడీటీ అధికారులు స్పష్టంగా ప్రెస్ నోట్‌లో చెప్పారని తెలిపారు.