పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే.. టీడీపీ నేతలు భూ సేకరణను అడ్డుకుంటున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. శనివారం ఆయన విశాఖపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా పారదర్శకంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు. జిల్లాలో లక్షా 75వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తామని పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ ఇస్తామన్నారు. వైఎస్సార్ నవశకంలో 16 రకాల సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు.