జయము జయము కాదు.. జైలు జైలు చంద్రన్న..! | YSRCP MLA Gudivada Amarnath Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

జయము జయము కాదు.. జైలు జైలు చంద్రన్న..!

Published Mon, Feb 17 2020 6:41 PM | Last Updated on Fri, Mar 22 2024 10:41 AM

ఐటీ శాఖ ఇచ్చిన ప్రెస్‌నోట్‌ను క్షుణంగా చదివితే అసలు బండారం బయటపడుతుందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబు అవినీతి బాగోతంపై ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులతో టీడీపీ నేతలకు భయం పట్టుకుందని విమర్శించారు.  ప్రెస్‌నోట్‌లో రెండు వేల కోట్ల అక్రమ లావాదేవీలు జరగాయని పేర్కొంటే.. ఎక్కడ రెండువేల కోట్లు ఉన్నాయని యనమల రామకృష్ణుడు అంటున్నారని దుయ్యబట్టారు.

Advertisement
 
Advertisement
 
Advertisement