వర్సిటీ ప్రాంగణంలో రాజకీయ సమావేశమా?
ఏయూలో టీడీపీ మహానాడు నిర్వహణపై హైకోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని ఆంధ్రా విశ్వవిద్యాలయం(ఏయూ)లో నిర్వహించుకునేందుకు ఉన్నత విద్యాశాఖ అధికారులు అనుమతినివ్వడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గురువారం అత్యవసరంగా దాఖలైన ఈ వ్యాజ్యంపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తన నిర్ణయాన్ని శుక్రవారానికి వాయిదా వేసింది.
వర్సిటీ ప్రాంగణాల్లో రాజకీయ సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదని ప్రభుత్వ ఉత్తర్వులున్నా, అందుకు విరుద్ధంగా మహానాడుకు అనుమతి ఇచ్చారని పేర్కొంటూ ఏయూలో రీసెర్చిస్కాలర్ ఆర్.జానకీరావు ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ శంకర నారాయణ గురువారం విచారణ జరిపారు.