
టీడీపీ మహానాడుపై హైకోర్టులో పిల్
హైదరాబాద్: ఆంధ్ర యూనివర్సిటీలో టీడీపీ మహానాడు నిర్వహించడంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. రీసెర్చ్ స్కాలర్ ఒకరు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ జరపనుంది.
మరోవైపు ఏయూలో మహానాడు నిర్వహణపై వివాదం ముదురుతోంది. విద్యాసంస్థల్లో రాజకీయ సభలు నిర్వహించొద్దని గతంలో ఆదేశాలున్నాయి. చంద్రబాబు సర్కారు ఈ ఆదేశాలను పట్టించుకోకుండా ఏయూలో మహానాడు ఏర్పాటు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహానాడు నిర్వహణపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం తెల్పుతున్నాయి. రేపటి నుంచి మూడు రోజుల పాటు మహానాడు జరగనుంది.
కాగా, ఏయూ దెయ్యాల కొంప అంటూ టీడీపీ ఎమ్మెల్సీ, గీతం విశ్వవిద్యాలయం అధినేత ఎంవీవీఎస్ మూర్తి చేసిన వ్యాఖ్యలపై విద్యార్థి, అధ్యాపక, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర, రాజకీయవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబికింది.