
నాపై ఆరోపణలను రుజువు చేయాలి: లోకేశ్
విశాఖ : దేశానికి, రాష్ట్రానికి సేవ చేయాలని రాజకీయాల్లోకి వస్తే తనను ఇబ్బంది పెట్టేందుకు విపక్షాలు యత్నిస్తున్నాయని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. టీడీపీ మహానాడులో ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ...విపక్షాలు తనపై చేసే ఆరోపణలను రుజువు చేయాలని అన్నారు. తనపై అవినీతి ఆరోపణలను చేస్తున్న వారికి దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు.
తాను పుట్టిన నాటికే తన తాతగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అని, అలాగే తన కొడుకు దేవాన్ష్ పుట్టిననాటికే వాళ్ల తాతగారు ముఖ్యమంత్రిగా ఉన్నారన్నారు. తన తాతగారు, తండ్రి అంత గొప్పపేరు తనకు వస్తుందో రాదో తెలియదని, అయితే వారికి మాత్రం చెడ్డపేరు తీసుకు రానని లోకేశ్ అన్నారు. అలాగే ఏపీని ఐటీ హబ్ చేసే బాధ్యత తనదేనని ఆయన హామీ ఇచ్చారు.