టీడీపీ ఎమ్మెల్యే సుగుణమ్మకు గాయాలు | Tirupati MLA Sugunamma Injured In Road Accident | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యే సుగుణమ్మకు గాయాలు

Published Mon, May 28 2018 4:35 PM | Last Updated on Thu, Aug 30 2018 4:17 PM

Tirupati MLA Sugunamma Injured In Road Accident - Sakshi

సాక్షి, విజయవాడ : తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ రోడ్డు ప్రమాదంలో సోమవారం  గాయపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారు విజయవాడ బెంజి సర్కిల్‌ వద్ద ఓ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నగరంలో జరుగుతున్న టీడీపీ మహానాడు కోసం ఎమ్మెల్యే సుగుణమ్మ విజయవాడ వచ్చారు. మరోవైపు ఈ ప్రమాదంపై పలువురు టీడీపీ నేతలు ఫోన్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement