mla sugunamma
-
తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే సుగుణమ్మకు చేదు అనుభవం
-
ఎన్నికల తాయిలాలు షురూ..
సాక్షి,తిరుపతి తుడా: తిరుపతి నగరంలో ఎన్నికల తాయిలాలు అప్పుడే మొదలయ్యాయి. ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనే విషయంపై టీడీపీ అధిష్టానం ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. అయినా ఎమ్మెల్యే సుగుణమ్మ మరోసారి తాను అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం వస్తుందనే నమ్మకంతో ప్రలోభాలకు తెరతీశారు. డ్వాక్రా సంఘాల రిసోర్స్ పర్సన్లు, ఆయా గ్రూపుల్లో కీలకంగా వ్యవహరించే లీడర్లను మచ్చికవేసుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. తమ మాట వినే ఒక్కో ఆర్పీకి, గ్రూప్ లీడర్లకు చీర, రవిక, స్వీట్ బాక్స్‌లను అందించారు. అలానే పార్టీ సానుభూతిపరులై ఆయా ప్రాంతాల్లో కీలకంగా ఉన్న మహిళలను గుర్తిం చారు. అలాంటి వారిని పార్టీ కార్యాలయానికి పిలిపించి గిఫ్ట్‌బాక్స్‌లను అందిస్తున్నారు. సీఎం సభకు రావాలని ఒత్తిడి.. రాష్ట్ర ప్రభుత్వం, పాలకులు డ్వాక్రా మహిళలను బానిసల్లా చూస్తున్నారు. టీడీపీ కార్యక్రమం జరిగినా, ప్రభుత్వ కార్యక్రమం నిర్వహిస్తున్నా సభలకు, సమావేశాలకు రావాలని డ్వాక్రా మహిళలపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు తీసుకోవడంలేదా?, సభకు రాకుంటే పేరును బ్లాక్ సిస్ట్‌లో పెడతాం అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. మెప్మా సిబ్బందితోపాటు అధికార పార్టీ నాయకులు గ్రూపులు వారీగా ఫోన్ నెంబర్లను సేకరించి ఫోన్ చేస్తూ సోమవారం నిర్వహించే సీఎం సభకు రావాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. శివరాత్రి, సెలవు కావడంతో పిల్లలు ఇంట్లో ఉంటారు వచ్చేందుకు కుదరదని మహిళలు వేడుకుంటున్నా మెప్మా సిబ్బంది వేధిపులకు గురి చేస్తున్నారు. ‘మీ పేరు బ్లాక్ íలిస్ట్‌లో పెడతాం. చెక్ రాకుండా చేస్తాం’ అంటూ మహిళలకు వ్యక్తిగతంగా వేదిస్తున్నారు. గ్రూపుల వారీగా సీఎం సభకు వచ్చి ప్రాంగణంలో గ్రూప్ ఫొటోలు తీసుయించుకుని మెప్మా గ్రూప్‌లో పోస్టు చేయాలని హుకుం జారీ చేశారని కొంత మంది మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఎమ్మెల్యే సుగుణమ్మకి స్థానికుల ఝలక్
సాక్షి, తిరుమల : తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మకి తిరుమల స్థానికులు ఝలక్ ఇచ్చారు. తిరుమల స్థానికులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ గత మూడురోజులుగా దీక్ష చేస్తున్నారు. దీక్షను విరమించడానికి అక్కడికి వచ్చిన సుగుణమ్మను స్థానికులు నిలదీశారు. దీంతో తిరుమల సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లామని సుగుణమ్మ చెప్పారు. టీటీడీ అధికారులతో చర్చించి సమస్యలు పరిష్కారం చేస్తామని సుగుణమ్మ హామీ ఇచ్చారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు దీక్ష కొనసాగిస్తామని స్థానికులు తేల్చి చెప్పారు. దీంతో చేసేదేమీలేక సుగుణమ్మ, జిల్లా ఇన్ చార్జ్ పులవర్తి నానిలు దీక్ష స్థలం నుండి వెళ్లిపోయారు. తిరుమల స్థానికుల దీక్ష రేపటి నుండి మరింత ఉధృతం చేయనున్నట్టు తెలుస్తోంది. రేపు తిరుమలలో దుకాణాలు మూసే ఆలోచనలో తిరుమల వాసులు ఉన్నట్టు సమాచారం. -
కరుణించని ఎమ్యెల్యే.. వ్యక్తి మృతి
తిరుపతి తుడా : ఎమ్మెల్యే నిర్లక్ష్యం ఓ నిడు ప్రాణాన్ని బలితీసుకుంది. సీఎం సహాయ నిధి కోసం ఏడాదిన్నరగా అర్థించి అలసిపోయిన ఓ రోగి చివరకు తనువు చాలించాడు. తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటి వద్ద గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. తిరుపతి రూరల్ మండలం సాయినగర్ పంచాయతీలోని లింగేశ్వరనగర్‌కు చెందిన కరణప్రసాద్ (70) కొన్నేళ్లుగా నరాల వ్యాధితో బాధపడుతున్నాడు. సమస్య తీవ్రం కావడంతో ఏడాదిన్నర క్రితం అప్పుచేసి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. 7నెలల క్రితం మళ్లీ సమస్య తలెత్తడంతో రెండోసారి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. చికిత్స నిమిత్తం రూ.6 లక్షలు వ్యయమైనట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో వడ్డీలు కట్టలేక కరణప్రసాద్ ఏడాదిన్నరగా సీఎం సహాయనిధి కోసం ఎమ్మెల్యే సుగుణమ్మను వేడుకుంటున్నాడు. నెలలు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో మరింత వేదనకు గురయ్యాడు. తాజాగా 4 రోజుల క్రితం మళ్లీ ఎమ్మెల్యేను కలిస్తే గురువారం రావాలని సూచించారు. దీంతో ఆయన గురువారం ఎమ్మెల్యే ఇంటికి చేరుకునాడు. ఎంతోసేపు నిరీక్షించిన కరుణప్రసాద్ నీరసంతో ఎమ్మెల్యే ఇంటి గుమ్మం ముందే కుప్పకూలిపోయాడు. అతన్ని 108 సిబ్బంది రుయా ఆస్పత్రికి తరలిచంగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
టీటీడీపై ఎమ్మెల్యే సుగుణమ్మ అలక
-
టీడీపీ ఎమ్మెల్యేకు.. తిరుమలలో అవమానం
సాక్షి, తిరుమల : తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే సుగుణమ్మకు శ్రీవారి ఆలయంలో అవమానం జరిగింది. మహాసంప్రోక్షణలో భాగంగా బుధవారం ఆలయంలో మహాశాంతి తిరుమంజనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుగుణమ్మను టీటీడీ అధికారులు అనుమతించలేదు. టీటీడీ పాలకమండలి సభ్యులను అనుమతించి తనను ఎందుకు అనుమతించరని, టీటీడీ అధికారుల తీరుపై సుగుణమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాసంప్రోక్షణ సమయంలో స్థానిక ఎమ్మెల్యేకు ఆహ్వానం ఉందా లేదా అని అధికారులు స్పష్టం చేయాలన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌కు వెళ్తే ఆలయం ముందు ఉన్న బయోమెట్రిక్ ఎంట్రెన్స్ దగ్గరకి వెళ్లి తెలుసుకోవాలన్నారని సుగుణమ్మ తెలిపారు. సన్నిధిలోని ల్యాండ్ లైన్‌కు కాల్ చేస్తే అక్కడి అధికారులు ఈ రోజు అనునతిలేదని రేపు రమ్మన్నారని చెప్పారు. ఒక స్థానిక ఎమ్మెల్యేగా తనకు అనుమతి ఉందా లేదా అని టీటీడీ అధికారులను ప్రశ్నించారు. లోపల స్వామి వారి మహా శాంతి తిరుమంజననికి ఆలయంలో ఉన్న మహా భక్తులు ఎవరో తమకు చూపించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై టీటీడీ చైర్మన్, ఈఓ ఇతర మహా భక్తులకు ఎలా ఆహ్వానం ఇచ్చారో తనకు చెప్పాలన్నారు. తనకు జరిగిన అవమానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తానన్నారు. -
టీడీపీ ఎమ్మెల్యే సుగుణమ్మకు గాయాలు
సాక్షి, విజయవాడ : తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ రోడ్డు ప్రమాదంలో సోమవారం గాయపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారు విజయవాడ బెంజి సర్కిల్ వద్ద ఓ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నగరంలో జరుగుతున్న టీడీపీ మహానాడు కోసం ఎమ్మెల్యే సుగుణమ్మ విజయవాడ వచ్చారు. మరోవైపు ఈ ప్రమాదంపై పలువురు టీడీపీ నేతలు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
లోకేష్ పీఏనంటూ ఎమ్మెల్యేకు బురిడీ
లోకేష్ పీఏనంటూ ఎమ్మెల్యేకు బురిడీ కొట్టే యత్నం అజ్ఞాత వ్యక్తి ఫోన్ కాల్‌తో రూ. కోటి సిద్ధం చేసుకున్న ఎమ్మెల్యే ఆపై, హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో ఆరా నగదు కోసం వ్యూహరచన చేశారని నిర్ధారణ మాటువేసి నిందితుల్నిపట్టుకున్న పోలీసుల రహస్య ప్రాంతంలో విచారణ తిరుపతి సిటీ : ముఖ్యమంత్రి నారాచంద్రబాబు తనయుడు లోకేష్ పీఏ విజయ్‌నంటూ ఓ అజ్ఞాన వ్యక్తి తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మకు మంగళవారం ఫోన్ చేసినట్లు సమాచారం. తనకు చెందిన మనుషులు వస్తారని, వారి చేత కోటి రూపాయలు ఇచ్చి పంపిం చాలని ఎమ్మెల్యేకు ఫోన్లో విజయ్ పేరుతో కోరినట్లు తెలిసింది. ఆ అజ్ఞాత వ్యక్తి సీఎం సతీమణి భువనేశ్వరి పేరును కూడా వాడుకున్నట్టు సమాచారం. వెంటనే అప్రమత్తమైన ఎమ్మెల్యే సుగుణమ్మ, అల్లుడు సంజయ్ హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయానికి ఫోన్‌చేసి ఆరా తీశారు. ఆ పేరుగల వ్యక్తి ఎవరూలేరని అక్కడి నుంచి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. దీంతో అప్రమత్తమైన ఎమ్మెల్యే అర్బన్ ఎస్పీ గోపినాథ్‌జెట్టికి ఫిర్యాదు చేశారు. ఇంతలోపు మళ్లీ విజయ్ పేరుతో ఫోన్‌కాల్ రావడంతో డబ్బులు ఇస్తామని చెప్పి ఎమ్మెల్యే సుగుణమ్మ అంగీకరించినట్టు సమాచారం. సమాచారం అందుకున్న వెస్టు పోలీసులు ఎమ్మెల్యే నివాసం వద్ద మాటు వేసి రెక్కీ నిర్వహించినట్టు తెలిసింది. ఇంతలోపే శ్రీకాళహస్తికి చెందిన ఓ వ్యక్తితో పాటు ఓ మహిళ, మరో ఇద్దరు వ్యక్తులు ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు. నగదు బ్యాగ్‌లు ఇస్తుండగా వెస్టు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారు వినియోగించిన కారును సీజ్ చేసి, నిందితులను అర్బన్ ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లి విచారణ చేపట్టారు. -
ఎమ్మెల్యే సిఫార్సు లేఖతో.. టీటీడీ బ్లాక్ టికెట్లు
తిరుపతి: తిరుమలలో శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. హెడ్ కానిస్టేబుల్ సహా నలుగురిని అదుపులోకి తీసుకుని.. వారి నుంచి రూ.70వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ సిఫార్సు లేఖతో ప్రత్యేక దర్శనం టికెట్లు పొందినట్టు సమాచారం. ఎల్1 దర్శనం టికెట్లను ఒక్కొక్కటి రూ.10వేలకు విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.