తిరుపతి టీడీపీ మహానాడు ముగించుకుని విజయవాడకు వస్తుండగా ఓ టీడీపీ నేత కారు ప్రమాదానికి గురైంది.
గుంటూరు: తిరుపతి టీడీపీ మహానాడు ముగించుకుని విజయవాడకు వస్తుండగా ఓ టీడీపీ నాయకుడు కారు ప్రమాదానికి గురైంది. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది.
ఈ ప్రమాదంలో విజయవాడ 44వ డివిజన్ కార్పొరేటర్ కాకు మల్లికార్జునరావు, అతని కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం విజయవాడలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా దెబ్బతింది. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.