
జన్మభూమి కమిటీలు శుద్ధదండగ
ప్రభుత్వం ఏర్పాటుచేసిన జన్మభూమి కమిటీలపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు అసంతృప్తి వ్యక్తంచేశారు.
- తీవ్ర విమర్శలు చేసిన మంత్రి అయ్యన్నపాత్రుడు
నక్కపల్లి/ఎస్.రాయవరం: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన జన్మభూమి కమిటీలపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ కమిటీలు శుద్ధదండగన్నారు. అసలు ఈ విధానమే సరికాదని తప్పుబట్టారు. కమిటీ సభ్యులు చిత్తశుద్ధితో పనిచేయడం లేదని, తాము జన్మభూమి కమిటీ సభ్యులమని గొప్పలు చెప్పుకోవడానికి, మెడలో ట్యాగ్‌లు వేసుకుని తిరుగుతూ పెత్తనం చెలాయించడానికే పరిమితమయ్యారని విమర్శించారు.
విశాఖ జిల్లా ఎస్.రాయవరంలో శనివారం జరిగిన టీడీపీ మినీ మహానాడులో మంత్రి మాట్లాడారు. పథకాలు అర్హులకు అందుతున్నాయా లేదా.. వాటి అమలులో అక్రమాలు జరుగుతున్నాయా.. పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నారా లేదా అనేది పరిశీలించాలని కమిటీలకు సూచించారు.