Minister ayyannapatrudu
-
‘అనంత’–అమరావతి మధ్య ఎక్స్‌ప్రెస్ హైవే
రహదారి పక్కనే రైలు మార్గం : మంత్రి అయ్యన్న వెల్లడి సాక్షి, విశాఖపట్నం: అనంతపురం–అమరావతి మధ్య రూ.27 వేల కోట్లతో ఆరులేన్ల ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించనున్నట్టు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ రహదారికి సమాంతరంగా రైలు మార్గాన్ని కూడా నిర్మిస్తామని వెల్లడించారు. మంగళవారం విశాఖ కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అనంతపురం–అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే 393 కిలోమీటర్లని మొత్తం ఐదు జిల్లాల గుండా వెళుతుందని, దేశంలో ఉన్న ఎక్స్‌ప్రెస్ హైవేల్లో ఇది మూడోదని పేర్కొన్నారు. -
ప్రజలు తన్నడానికి సిద్ధంగా ఉన్నారు: అయ్యన్న
నర్సీపట్నం: భూ దోపిడీదారులను విశాఖ ప్రజలు తరిమి తరిమి తన్నేందుకు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. తాను నిజాన్ని నిర్భయంగా చెపుతానని, మంత్రి పదవినైనా వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో శనివారం జరిగిన నవనిర్మాణ దీక్షలో పాల్గొన్న మంత్రి అయ్యన్న.. విశాఖ నగరంలో జరిగిన భూ కుంభకోణంపై స్పందించారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానని, దీనిపై తనకు ఎటువంటి నష్టం జరిగినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. -
ప్రజా ప్రతినిధుల అండతోనే భూదందా
-
ప్రజా ప్రతినిధుల అండతోనే భూదందా
- మంత్రి అయ్యన్నపాత్రుడు - నా స్నేహితుడూ భూమిని ఆక్రమించుకుంటానన్నాడు సాక్షి, విశాఖపట్నం: ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల అండదండలతోనే విశాఖలో భూ దందా యథేచ్ఛగా కొనసాగుతోందని రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. ప్రవాసాం ధ్రులు ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్ముతో విశాఖలో భూములు కొనుగోలు చేస్తే.. భూ బకాసురులు వాటిని ఆక్రమిం చుకుంటూ వారిని ముప్పుతిప్పలు పెడుతు న్నారని చెప్పారు. ‘విశాఖలో భూ దందా సాగుతోందంట కదా? రాజకీయ అండదం డలుంటే ఎక్కడైనా సరే, ప్రభుత్వ భూములైనా దర్జాగా కబ్జా చేయొచ్చట కదా.. మీరు కాస్త మద్దతుగా ఉంటే నేనో రెండెకరాలు ఆక్రమించుకుంటానంటూ ఓ స్నేహితుడు నన్నడిగాడు. ఆయన మాటలు వింటుంటే విశాఖలో భూములు ఎంత ఈజీగా కబ్జా చేయొచ్చో అర్ధమవుతోంది’ అని అయ్యన్న అన్నారు. విశాఖ వుడా చిల్డ్రన్స్ థియేటర్లో శుక్రవారం జరిగిన నవనిర్మాణ దీక్ష సభలో ఆయన మాట్లాడారు. ఆర్ అండ్ బీ సీఈ గంగాధర్ రూ.150 కోట్ల అక్రమాస్తులతో ఏసీబీకి దొరికిపోయారని, ఒక సీఈకి ఇంత సంపాదన అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. భూదందాను బట్టబయలు చేసిన కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జేసీ సృజన, పోలీస్ కమిషనర్ యోగానంద్‌లను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. -
విశాఖ భూదందాపై మంత్రి తీవ్ర వ్యాఖ్యలు
విశాఖపట్టణం: విశాఖ జిల్లాలో భూ ఆక్రమణలు, దందాలపై మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులే భూములను ఆక్రమిస్తున్నారన్నారు. ఇప్పటికే ఐదారు వేల ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయని తెలిపారు. భూ వివాదాలు పరిష్కరించేందుకు ఐఏఎస్ అధికారిని నియమించాలని తాను ప్రభుత్వాన్ని కోరానన్నారు. మధురవాడలో పోలీసులే భూ సెటిల్మెంట్లు చేస్తున్నారని మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. కాగా విశాఖ భూదందాపై బహిరంగ విచారణ చేయిస్తామని ఉపముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తి తెలిపారు. విశాఖ జిల్లాలోని భూ రికార్డుల మార్పిడిపై వెల్లువెత్తుతున్న ఆరోపణలను పరిశీలించి పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా ఆయన రెవెన్యూ ఉన్నతాధికారులతో కలిసి విశాఖలో పర్యటించారు. సి.సి.ఎల్.ఎ. కార్యాలయం నుంచి సీనియర్ అధికారులను రికార్డుల పరిశీలనకు పురమాయించామన్నారు. బాధితుల నుంచి వివరాలు తీసుకొనేందుకు పబ్లిక్ హియరింగ్ చేపట్టాలని నిర్ణయించామన్నారు. జూన్ 15వ తేదీన ఉదయం 11 గంటలకు విశాఖ కలెక్టరేట్లో బహిరంగ విచారణ చేపడతామని వెల్లడించారు. బాధిత ప్రజలు ఎవరైనా తగిన ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లయితే సమస్య తప్పక పరిష్కరిస్తామన్నారు. బాధితులు రాజకీయ వత్తిడులకు లొంగాల్సిన అవసరం లేదన్నారు. విశాఖ భూదందా విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తుందని చెప్పారు. -
నేను, బాబు.. లోకేశ్‌కు సలహాలిస్తాం: అయ్యన్న
సాక్షి, విశాఖపట్నం: తాను, సీఎం చంద్రబాబు... లోకేశ్‌కు సూచనలు, సలహాలిస్తామని, ఆయనకు రాజకీయ అనుభవం లేకపోయినా మంత్రిగా రాణిస్తారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. లోకేశ్ రాబోయే రోజుల్లో టీడీపీకి నాయకత్వం వహిస్తారని ఆయన జోస్యం చెప్పారు. పంచాయతీరాజ్‌శాఖ నుంచి ఆర్అండ్బీ శాఖకు మార్పు జరిగాక విశాఖ వచ్చిన ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఏపీలో మంత్రి పదవులిచ్చిన నలుగురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయిస్తే తానూ చేస్తానని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సీఎం చంద్రబాబుకు విసిరిన సవాల్‌పై ప్రశ్నించగా.. అయ్యన్న సూటిగా స్పందించలేదు. పార్టీ మారిన తలసానికి నైతిక విలువలపై మాట్లాడే హక్కు లేదన్నారు. మీరు వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రిపదవులిచ్చారు.. వారికి ఈ నైతిక హక్కు వర్తించదా? అని విలేకరులు ప్రశ్నించగా.. అది వేరు.. ఇది వేరు అంటూ మంత్రి తప్పించుకున్నారు. ఇలాంటి అంశాలపై కొన్ని ఇబ్బందులున్నా వాటిని తమ నాయకుడు చంద్రబాబు సమర్థవంతంగా సరిచేస్తారని చెప్పారు. తెలంగాణలో టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై మీ పార్టీవారే ఫిర్యాదు చేశారు.. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులెలా ఇస్తారు? దీనిని మీరెలా సమర్థించుకుంటారు? అన్న ప్రశ్నకు తెలంగాణలో ఆ నిర్ణయం జరిగినప్పుడు మీ ప్రెస్‌వాళ్లు ఏం మాట్లాడలేదు.. అని దాటవేసే ప్రయత్నం చేశారు. కొన్ని సందర్భాల్లో రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారు. మీరు అర్థం చేసుకోవాలి.. అని ముక్తాయించారు. కేబినెట్లో 26 మందికి మించి స్థానం లేదన్న సంగతిని పదవులు దక్కని సీనియర్లు అర్థం చేసుకోవాలని చెప్పారు. -
అయ్యన్న తనయుడి రుబాబు
లేట‘రైట్’ అనలేదని గిరిజనులపై కక్షసాధింపు పింఛన్లు, డ్వాక్రా రుణాల నిలిపివేత మంత్రిగారి కొడుకు పెత్తనం అడ్డూ అదుపు లేకుండా ప్రారంభోత్సవాలు నాయకత్వానికి జై కొట్టాలి.. అక్రమాలు చేసినా ‘రైట్’ అనాలి.. ప్రశ్నించకూడదు.. ఎదిరించకూడదు.. వద్దంటే కక్ష కడతారు.. సామాన్యులను వేధిస్తారు.. సంక్షేమ పథకాలకు దూరం చేసి బాధిస్తారు.. జిల్లాలో అదే జరుగుతోంది. మంత్రి అయ్యన్నపాత్రుడి అండతో ఆయన కుమారుడు విజయ్ పెత్తనం చేస్తున్నాడు. లేటరైట్ అక్రమాలకు అడ్డుపడుతున్నారన్న కోపంతో అమాయక గిరిజనులను సాధిస్తున్నాడు. జన్మభూమి కమిటీలను అడ్డుపెట్టుకుని పింఛన్లు, డ్వాక్రా రుణాలు నిలిపేసి వారి పొట్టకొడుతున్నాడు. తండ్రి అండ చూసుకుని తానే మంత్రిలా ప్రవర్తిస్తున్నాడు. అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు కూడా చేసేస్తున్నాడు. విశాఖపట్నం/నాతవరం, మాకవరపాలెం విలువైన లేటరైట్ తవ్వకాలను గిరిజనులు అడ్డుకోవడం మంత్రి అయ్యన్నపాత్రుడికి, ఆయన తనయుడికి కంటగింపుగా మారింది. నాతవరం మండలం సరుగుడు పంచాయతీలోని సుందరకోట, అసన గిరి, తొరడ, ముంతమామిడిలోద్దు బమ్మిడికలోద్దు, పాత సిరిపురం, కొత్త దద్దుగుల, యరకంపేట, మాసంపల్లి తదితర గ్రామాల్లో లేటరైట్ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నారుు. వాటి తవ్వకాల అనుమతుల కోసం కొందరు ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకోగా గత ఏడాది సుందరకోటలో ప్రజా వేదిక నిర్వహించారు. ఆ సమయంలో అసనగిరి గ్రామస్తులంతా ఏకమై లేటరైట్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మిగతా గ్రామాల్లో మరికొంతమంది వారికి మద్దతుగా నిలిచారు. లేటరైట్‌కు వ్యతిరేకంగా భీష్మించారు. అరుునా సరే ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా సుందరకోట, అసనగిరి గ్రామాల సరిహద్దులో నిబంధనలు ఉల్లఘించి అనుమతులు లేకుండా లేటరైట్ తవ్వకాలు నిర్వహించి కోట్లాది రూపాయల లేటరైట్‌ను తరలించుకుపోయారు. వ్యతిరేకించిన వారిపై కక్ష 2009లో అప్పటి సర్పంచ్ నిబంధనలు పాటించకుండా లేటరైట్ తవ్వకాలకు అనుమతుల కోసం పంచాయతీ తీర్మానాలు ఇచ్చారు. వీటిపై ప్రస్తుత సర్పంచ్ సాగిన లక్ష్మణమూర్తి అధికారులకు గత ఏడాది ఫిర్యాదు చేశారు. దానిపై అప్పటి కలెక్టర్ యువరాజ్ లేటరైట్ అనుమతులను రద్దు చేశారు. అరుునప్పటికీ రాజకీయ అండతో యథేచ్ఛగా లేటరైట్ తవ్వకాలు జరపడంతో గిరిజనులు ఆందోళన చేసి వాహనాలను అడ్డుకున్నారు. దీంతో తహసీల్దారు కనకారావు సంఘటన స్థలానికి చేరుకొని వాహనాలను అదుపులోకి తీసుకొని బైండోవర్ చేసి వదిలేశారు. అప్పట్నుంచి లేటరైట్ తవ్వకాలు జరగడం లేదు. దీంతో మంత్రి తనయుడు కక్ష గట్టాడు. లేటరైట్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేసిన గిరిజన గ్రామాల్లో సంక్షేమ పథకాలు నిలుపుదల చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని సంక్షేమ పధకాలు నిలుపుదల చేయడంతోపాటు గిరిజనులను భయభ్రాంతులకు గురి చేసి వారికి తమకు అనుకూలంగా మలుచుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బాధితులు వీరే.. లేటరైట్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేసిన అసనగిరిలో పదేళ్లుగా పింఛన్లు తీసుకుంటున్న పట్టెం రాజులమ్మ, రావుల జోగులమ్మా, పట్టెం వెంకయ్మమ్మ, పాండవుల లక్ష్మి, బురారి సీతమ్మ, చల్లా చెల్లయ్యమ్మ, జర్తా అచ్చియ్యమ్మ, బురారి లక్ష్మి, రెడ్డి గంగ, రెడ్డి కూకాలమ్మ, పాండవుల రాములమ్మా, రావుల అబ్దం, జర్తా అక్కయ్యమ్మ, జర్తా పెద వెంకటస్వామి, వెలుగుల దొంగబాబు, పట్టెం కన్నబాబు, జర్తా అచ్చాలు, చల్లా రాములమ్మతోపాటు మరికొంతమంది పింఛన్లను నిలిపివేశారు. వీరంతా నాలుగు రోజుల క్రితం పల్స్ సర్వే కోసం ఆ గ్రామానికి వెళ్లిన ఆర్ఐ సత్యనారాయణ, వీఆర్వో శ్రీనుకు ఫిర్యాదు చేశారు. ఈ గ్రామంలో గల డ్వాక్రా సంఘాలైన గంగాలమ్మాలతోపాటు మరి కొన్ని గ్రూపులకు నేటికీ ఎలాంటి రుణాలు ఇవ్వలేదు. పసుపు, కుంకుమ పేరుతో డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న రూ.3 వేల నగదును కూడా తన వర్గం కాని వారికి అందకుండా చేస్తున్నారు. మాసంపల్లి గ్రామంలో కూడా పదేళ్లుగా పింఛనుదారులైన గోము నూకాలమ్మ, ఆర్లంకి అప్పలనర్స, కోచ్చా మల్లయ్య, గోము లక్ష్మి, ముర్ల లక్ష్మి, కోచ్చా లోవలక్ష్మి, గోము సత్యం పింఛన్లు నిలిపివేశారు. ఈ విషయంపై ఎంపీడీవో యాదగిరీశ్వరావును వివరణ కోరగా ఆ గ్రామాల్లో పర్యటించి నిలిచిపోరుున పింఛన్లను పునరుద్ధరించేలా చర్యలు చేపడతానన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో మంత్రి కొడుకు మంత్రి అయ్యన్నపాత్రుడి అండతో ఆయన కుమారుడు విజయ్ ప్రభుత్వ అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. మాకవరపాలెం మండలంలోని జడ్.గంగవరం, జి.వెంకటాపురం, నగరం, జి.కోడూరు గ్రామాల్లో మినరల్ వాటర్ ప్లాంట్లను దాదాపు రూ.7 లక్షల ప్రభుత్వ నిధులతో నిర్మించారు. వీటిని ప్రారంభించడానికి ఆదివారం ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి అయ్యన్న కుమారుడు విజయ్ హాజరయ్యారు. ఈ ప్లాంట్లన్నీ ఆయనే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఎంపీపీ రుత్తల చిన్నయ్యమ్మ, వైస్ ఎంపీపీ వి.వెంకటరమణ, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, అధికారులు ఉన్నా కేవలం ప్రేక్షకపాత్ర పోషించారు. నిబంధనలకు విరుద్ధంగా, ప్రొటోకాల్‌కు భంగం కలిగేలా విజయ్ ప్రారంభోత్సవాలు చేయడం స్థానిక ప్రజాప్రతినిధులను తీవ్రంగా బాధించింది. -
ఎడ్లబండిపై నుంచి కిందపడ్డ మంత్రి
-
ఎడ్లబండిపై నుంచి కిందపడ్డ మంత్రి
విశాఖపట్టణం: జిల్లాలోని అనకాపల్లి మండలం తుంపాల గ్రామం జనచైతన్య యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. కార్యక్రమంలో భాగంగా ఎడ్లబండి ఎక్కిన మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే పీలా గోవింద్ లు అకస్మాత్తుగా జారీ కిందపడిపోయారు. బండిని లాగుతున్న ఎడ్లు బెదిరిపోవడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది, కార్యకర్తలు మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే పీలా గోవింద్ లను లేపారు. ఈ ఘటనలో మంత్రి, ఎమ్మెల్యేలకు చిన్నపాటి గాయాలైనట్లు సమాచారం. -
తాత్కాలిక సచివాలయం ప్రారంభం
- మధ్యాహ్నం 2.51 గంటలకు ప్రారంభించిన మంత్రి అయ్యన్నపాత్రుడు - ప్రత్యేక బస్సుల్లో సచివాలయానికి తరలివచ్చిన ఉద్యోగులు - విజయవాడలో, వెలగపూడిలో ఘనస్వాగతం సాక్షి, అమరావతి/ తుళ్లూరు/ హైదరాబాద్: తాత్కాలిక సచివాలయం బుధవారం మధ్యాహ్నం 2.51 గంటలకు తుళ్లూరు మండలం వెలగపూడిలో ప్రారంభమైంది. పంచాయతీరాజ్‌శాఖ మంత్రి అయ్యన్న పాత్రుడు ఐదవ బ్లాక్‌లోని గ్రౌండ్‌ఫ్లోర్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో సీఎస్ టక్కర్, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం మధ్యాహ్నం 2.59 గంటలకు మహిళా స్త్రీ శిశుసంక్షేమశాఖ మంత్రి కిమిడి మృణాళిని తాత్కాలిక సచివాలయంలోకి అడుగుపెట్టారు. ఇద్దరు మంత్రులు వారి చాంబర్లలో ప్రత్యేక పూజలు జరిపి పాలనాపరమైన పత్రాలపై తొలి సంతకాలు చేశారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయాల ప్రారంభం వాయిదాపడింది. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్ర పాలన వ్యవహారాలకు కీలకమైన సచివాలయాన్ని అమరావతికి తరలించేందుకు వెలగపూడిలో సుమారు 45 ఎకరాల్లో రూ.600 కోట్లతో తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఆరు భవనాలకుగాను బుధవారం ఐదవ భవనంలోని గ్రౌండ్ఫ్లోర్ని ప్రారంభించారు. ప్లైవుడ్‌తో ఏర్పాటు చేసిన గదుల్లో బుధవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటియాజమాన్య, గృహనిర్మాణశాఖ కార్యాలయాలను మంత్రులు లాంఛనంగా ప్రారంభించారు. 15 వేలమందీ వస్తారు: అయ్యన్న ఏపీ సచివాలయంలోని మొత్తం 15వేల మంది ఉద్యోగులు త్వరలోనే అమరావతి వచ్చేస్తారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు చెప్పారు. తాత్కాలిక సచివాలయంలోని ఐదో నెంబరు బ్లాక్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన చాంబర్లో విలేకరులతో మాట్లాడుతూ... ఈ సందర్భంగా నాలుగు శాఖలకు సంబంధించి 1500 మంది ఉద్యోగులు వచ్చారని, ఆరో తేదీలోపు ఐదువేల మంది వస్తారని తెలిపారు. వైద్య ఆరోగ్య, లేబర్ అండ్ ఎంప్లాయిస్, హౌసింగ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు తమ విధులు ప్రారంభించాయని చెప్పారు. సచివాలయం నుంచి విధులు నిర్వహించేందుకు ఉద్యోగులు ఆసక్తిగా ఉన్నారని, త్వరలోనే అన్ని శాఖలు సచివాలయానికి చేరుకుంటాయని ప్రధాన కార్యదర్శి టక్కర్ వివరించారు. కార్యక్రమంలో హోం శాఖ మంత్రి చినరాజప్ప , మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ, ప్రత్తిపాటి పుల్లారావు, మృణాళిని, రావెల కిషోర్‌బాబు, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్‌కుమార్, ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌లు పాల్గొన్నారు. మరోవైపు బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి నాలుగు ప్రత్యేక బస్సుల్లో వైద్య ఆరోగ్య, కార్మిక, పంచాయితీరాజ్, గృహనిర్మాణ శాఖల మంత్రుల కార్యాలయాల ఉద్యోగులు అమరావతికి తరలివచ్చారు. అమరావతి వస్తున్న ఉద్యోగులకు కనకదుర్గ వారధి వద్ద ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు, సచివాలయ ఉద్యోగుల ప్రెసిడెంట్ మురళీకృష్ణ, ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు, కృష్ణా జిల్లా ఏపీఎన్జీవో అధ్యక్షుడు సాగర్ స్వాగతం పలికారు. విజయవాడ నుంచి వెలగపూడి సచివాలయానికి వ స్తున్న ఉద్యోగులకు రాజధాని గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. పరస్పర అభినందలతో పండుగ వాతావరణం ఏర్పడింది. ప్రారంభ కార్యక్రమం పూర్తయ్యాక సాయంత్రం 4.30 గంటలకు ఎవరి వాహనాల్లో వారు హైదరాబాద్‌కు బయలుదేరారు. మౌలిక వసతులూ కరువు... సొంత రాష్ట్రంలో పనిచేయటానికి ఎంతో ఉత్సాహంగా వెలగపూడికి వచ్చిన ఉద్యోగులకు కష్టాలు స్వాగతం పలికాయి. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో వచ్చిన ఉద్యోగులు తాత్కాలిక సచివాలయానికి సుమారు కిలోమీటరు దూరంలో దిగారు. అక్కడినుంచి ఐదవ భవనం వరకు వెళ్లే మార్గం బురదతో నిండిపోయి ఉండటంతో అతికష్టంతో చేరుకున్నారు. అక్కడ ఏ కార్యాలయం ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ప్రారంభమైన మూడుశాఖలకు సంబంధించిన కార్యాలయాల్లో పనులింకా జరుగుతూనే ఉన్నాయి. ఉద్యోగులకు అవసరమైన మౌలిక వసతులు అస్సలు కనిపించలేదు. ముఖ్యంగా మంచినీటి సౌకర్యం, బాత్రూంలు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. ‘పనులు పూర్తి కాకపోయినా.. ఎందుకింత హడావుడిగా బురదలో తీసుకురావటం’ అని ఉద్యోగులు మాట్లాడుకోవడం కనిపించింది. ఇబ్బందులు ఉంటాయని తెలుసు నిర్మాణంలో ఉన్న భవనంలో విధులు నిర్వహించడం ఇబ్బందని తెలుసు. అయినా సహకరించాల్సిన బాధ్యత మా పై వుంది. అలాగే ప్రభుత్వం కూడా త్వరగా పనులు పూర్తిచేసి భవనాన్ని ఉద్యోగులకు అప్పగిస్తే మేలైన పాలన నిర్వహించే అకాశం వుంటుంది. -మురళీకృష్ణ,రాష్ట్ర ఉద్యోగ సంఘం నాయకుడు త్వరగా పూర్తికావాలి ఎల్అండ్టీ సంస్థ నిర్దేశించిన వ్యవధిలో భవననిర్మాణాలు పూర్తి చేసి ఇస్తే బాగుం టుంది. నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో చాలా ఇబ్బందులు వస్తాయి. వాటిని తట్టుకుని సేవ చేసేందుకు ఉద్యోగులు సిద్ధపడి వచ్చారు. వారిని అందరూ ఆదరించాలని కోరుతున్నాను. -అశోక్‌బాబు,రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు స్థానికులు సహకరించాలి దూరాభారంతో మహిళాఉద్యోగులు విధులు నిర్వహించడం చాలా కష్టంగా ఉంటుంది. స్థానికులు పెయింగ్ గెస్ట్లుగా మహిళా ఉద్యోగులకు అవకాశం కల్పిస్తే బాగుంటుంది. పరిస్థితులు చక్కబడేవరకు సచివాలయం దగ్గరలోని గ్రామాల ప్రజలు ఉద్యోగులకు సహకరించాలని కోరుతున్నాను. -ఎన్.సత్యసునీత,మహిళా ఉద్యోగుల సంఘాధ్యక్షురాలు -
ప్రారంభ సంరంభం
► తాత్కాలిక సచివాలయం వద్ద ఉద్యోగుల సందడి ► పాత రాజధాని నుంచి కొత్త రాజధానికి ... ► మూడు శాఖల కార్యాలయాలు ప్రారంభం పీఆర్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న మంత్రి అయ్యన్నపాత్రుడు, చిత్రంలో ప్రధాన కార్యదర్శి టక్కర్ సాక్షి, అమరావతి : తాత్కాలిక సచివాలయం వద్ద ఉద్యోగుల సందడి నెలకొంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో సుమారు 200 మంది వివిధ శాఖల ఉద్యోగులు బుధవారం వెలగపూడికి చేరుకున్నారు. వారికి కనకదుర్గమ్మ వారధి వద్ద ఏపీ ఎన్జీఓ, వివిధ శాఖల సంఘాల అధ్యక్షులు, జిల్లా ఉద్యోగ సంఘాల నాయకులు స్వాగతం పలికారు. ఒకరిని ఒకరు పరిచయం చేసుకుని మధ్యాహ్నం 2.30 గంటలకు తాత్కాలిక సచివాలయానికి చే రుకున్నారు.అక్కడ నిర్మాణం లో ఉన్న తమ కార్యాలయాలను పరిశీలించారు. తుళ్లూరు మండలం వెలగపూడిలో 125 రోజులకు ముందు తాత్కాలిక సచివాలయ నిర్మాణంప్రారంభమైన విషయం తెలిసిందే. నిర్మాణానికి ఈ ప్రాంతం అనుకూలంకాదని నిపుణులు హె చ్చరించినా, టీడీపీ ప్రభుత్వం పట్టుబట్టి తాత్కాలిక సచివాల య నిర్మాణానికి పూనుకుంది. ఈనెల 27కు భవనాల నిర్మాణం పూర్తవుతుందని ముఖ్యమంత్రి, మంత్రులు పలుమార్లు ప్రకటిం చారు. అందులో భాగంగా ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి మున్సిపల్ కార్మికులను తీసుకొచ్చారు. సుమారు రెండు వేల మంది కూలీలు రాత్రిం బవళ్లు పనులు చేశారు. అయితే వివిధ కారణాలతో తాత్కాలిక సచివాలయ పనులు పూర్తికాలేదు. దీంతో ఐదవ బ్లాక్‌లోని గ్రౌండ్‌ఫ్లోర్‌ను పూర్తిచేసి బుధవారం నుంచి నాలుగు శాఖల పాలనను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. చివరకు మూడు శాఖలకు సంబంధించిన కార్యాలయాలను హడావుడిగా ప్రారంభించారు. నిరుత్సాహం ఉన్నా... సుధీర్ఘ కాలం హైదరాబాద్‌లో పనిచేయడంతో ఉద్యోగులు వెంటనే అమరావతి తరలిరావడానికి విముఖత వ్యక్తం చేసినా, సొంత రాష్ర్టం కో సం పనిచేయాలనే ఉద్దేశంతో రాజధానికి వచ్చేం దుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో వెలగపూడికి తరలివచ్చారు. ఉద్యోగుల రాకతో వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం వద్ద సందడి నెలకొంది. వివిధ శాఖల్లో పనిచేసే సచివాలయ ఉద్యోగులు, జిల్లాలో పనిచేసే ఉద్యోగులు వారికి స్వాగతం పలకటం, ఒకరినొకరు పరిచయం చేసుకోవటంతో అంతా కోలాహలంగా మారింది. ఆ త రువాత నిర్మాణంలో ఉన్న తాత్కాలిక సచివాలయ భవనాలను పరిశీలించారు. ఏయే భవనంలో ఏ యే శాఖలు కొలువు తీరనున్నాయని అడిగి తెలుసుకున్నారు. తాము విధులు నిర్వహించే భవనాన్ని, గదులను ఉద్యోగులు క్షుణ్ణంగా పరిశీలించారు. -
జన్మభూమి కమిటీలు శుద్ధదండగ
- తీవ్ర విమర్శలు చేసిన మంత్రి అయ్యన్నపాత్రుడు నక్కపల్లి/ఎస్.రాయవరం: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన జన్మభూమి కమిటీలపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ కమిటీలు శుద్ధదండగన్నారు. అసలు ఈ విధానమే సరికాదని తప్పుబట్టారు. కమిటీ సభ్యులు చిత్తశుద్ధితో పనిచేయడం లేదని, తాము జన్మభూమి కమిటీ సభ్యులమని గొప్పలు చెప్పుకోవడానికి, మెడలో ట్యాగ్లు వేసుకుని తిరుగుతూ పెత్తనం చెలాయించడానికే పరిమితమయ్యారని విమర్శించారు. విశాఖ జిల్లా ఎస్.రాయవరంలో శనివారం జరిగిన టీడీపీ మినీ మహానాడులో మంత్రి మాట్లాడారు. పథకాలు అర్హులకు అందుతున్నాయా లేదా.. వాటి అమలులో అక్రమాలు జరుగుతున్నాయా.. పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నారా లేదా అనేది పరిశీలించాలని కమిటీలకు సూచించారు. -
బాక్సైట్ తవ్వకాలను నిలిపేయండి
♦ లేదంటే నక్సలైట్లు చంపేస్తారు ♦ సీఎస్ ఐవైఆర్‌ను కలిసి విన్నవించిన మంత్రి అయ్యన్న సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నం జిల్లా మన్యంలో బాక్సైట్ తవ్వకాలను నిలిపివేయాలని, లేదంటే ప్రజాప్రతినిధులను నక్సలైట్లు హతమారుస్తారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆందోళన వ్యక్తం చేశారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి 1,220 హెక్టార్ల భూములను ఏపీఎండీసీకి బదలాయిస్తూ రెండు రోజుల కిందట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో తలెత్తిన ఆందోళనల నేపథ్యంలో సచివాలయంలో శనివారం సీఎస్ కృష్ణారావును మంత్రి కలిశారు. జీవో కారణంగా ప్రశాంతంగా ఉండే మన్యంలో చిచ్చుపెట్టినట్లైందని అయ్యన్న పాత్రుడు పేర్కొన్నట్లు తెలిసింది. బాక్సైట్ తవ్వకాలను స్థానిక గిరిజనులతో పాటు నక్సలైట్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని వివరించినట్లు సమాచారం. దీనిపై సీఎంకు వివరించాలని సూచించగా, మంత్రి హోదాలో తమరే సీఎంను కలవాలని అయ్యన్నకు సీఎస్ సూచించినట్లు తెలిసింది. గిరిజనుల మనోభావాలకు వ్యతిరేకంగా వెళ్లం: అయ్యన్న మన్యంలో బాక్సైట్ తవ్వకాల విషయంలో ఆ ప్రాంత నివాసంలో ఉండే గిరిజనుల మనోభావాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించబోదని మంత్రి అయ్యన్నపాత్రుడు చెప్పారు. శనివారం సచివాలయంలోని తన చాంబర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసిన జీవో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అటవీ శాఖ అనుమతులకు సంబంధించినది మాత్రమేనన్నారు. బాక్సైట్ తవ్వకాలు జరపాలంటే అందుకు అనుమతిస్తూ మైనింగ్ శాఖ మరో జీవో ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ‘విశాఖ జిల్లా మంత్రిగా ఈ రోజూ నేను చెబుతున్నా. గిరిజనుల అభిప్రాయాలకు భిన్నంగా వెళ్లం. ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. చంద్రబాబు అందరితో చర్చించి.. వారు అంగీకరించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం, తప్పితే గిరిజనుల మనోభావాలకు వ్యతిరేకంగా వెళ్లే ప్రసక్తే లేదు’ అని మంత్రి స్పష్టం చేశారు. మన్యం బంద్ విజయవంతం పాడేరు: బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా విశాఖ మన్యంలో శనివారం అఖిల పక్షాలు చేపట్టిన బంద్ విజయవంతమైంది.అన్ని వర్గాలవారు బంద్‌కు మద్దతు పలికారు. ఏజెన్సీలోని 11 మండలాల్లో ధర్నాలు, ర్యాలీలతో అఖిలపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. బాక్సైట్ తవ్వకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 97ను వెంటనే ఉపసంహరించుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. బాక్సైట్ తవ్వకాలను చేపట్టబోమన్న సీఎం చంద్రబాబు ఇప్పుడు మాట మార్చడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఫ్లోరైడ్ బాధిత గ్రామాల్లో ఆర్వో ప్లాంట్లు
మంత్రి అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం : రాష్ర్టంలోని 329 ఫ్లోరైడ్ బాధిత గ్రామాల్లో రూ.13 కోట్లతో ఆర్వో ప్లాంట్లను ఏర్పాటుచేస్తున్నట్టు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.ఎస్సీ సబ్‌ప్లాన్‌లో రూ.350 కోట్లతో ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్లు నిర్మాణాలు చేడతామన్నారు.రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3,400 కార్యదర్శుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీటిలో 2,400 పోస్టులను సర్వీసు కమిషన్ ద్వారా భర్తీ చేస్తామన్నారు. రాష్ర్టంలో 13 వేల గ్రామ పంచాయతీలను ప్రణాళికపరంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పంచాయతీ ఉపాధి నిధులు రూ.1680 కోట్లతో గ్రామాల్లో చేపట్టిన పనులను ఏప్రిల్ నెలాఖరునాటికి పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. నిర్మాణదశలో ఉన్న 789 పనులను పూర్తి చేసేందుకు రూ. వెయ్యి కోట్లతో ప్రతిపాదించామన్నారు. జిల్లాలో రూ.7.8 కోట్లతో ఎస్సీ నివాసిత ప్రాంతాల్లో రోడ్లు వేస్తామన్నారు. ఎస్టీ సబ్‌ప్లాన్‌లో రూ.220 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. నర్సీపట్నం నియోజకవర్గంలో రూ.5కోట్ల 20 లక్షలతో అన్ని గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు నిర్ణయించామన్నారు. రాష్ర్టంలో తొలి విడతగా 6 లక్షల తెల్ల రేషన్ కార్డుల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హుద్‌హుద్ తుపానుకు దెబ్బతిన్న పంచాయతీరోడ్ల మరమ్మతులకు రూ.150 కోట్లు మంజూరు కాగా, వీటిలో నర్సీపట్నం నియోజకవర్గానికి రూ.35 కోట్లు కేటాయించామన్నారు. డంపింగ్‌యార్డుల నిర్మాణం ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి తెలిపారు. -
ఉపాధిలో తవ్వేకొద్దీ అవినీతి
గొలుగొండ : మండలంలో చేపట్టిన ఉపాధి పనుల్లో తవ్వేకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. పనులు జరిగినట్టుగా రికార్డుల్లో సిబ్బంది నమోదు చేసి అందినంత దోచుకున్నారు. క్షేత్రస్థాయిలో దర్యాప్తు జరిపిన అధికారులు ఏపీవో, కంప్యూటర్ ఆపరేటర్, కొత్త ఎల్లవరం ఫీల్డు అసిస్టెంట్లను నాలుగు రోజులక్రితం విధుల నుంచి తప్పించడం తెలిసిందే. తాజాగా మంగళవారం మరో ముగ్గురు ఫీల్డు అసిస్టెంట్లను విధులనుంచి తొలగిస్తున్నట్టు ఏపీవో సుప్రియ తెలిపారు. ఇలా వెలుగులోకి... మండలంలో 2011 నుంచి 2015 వరకు గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన నిరుపేద రైతులకు ప్రభుత్వం ఉపాధి నిధులతో జీడితోటల పెంపకానికి శ్రీకారం చుట్టింది. అయితే ఈ పనుల్లో భారీ అవినీతి జరిగినట్లు 15 రోజులక్రితం గొలుగొండలో జరిగిన ప్రజా నివేదికలో డీఆర్పీలు జిల్లా అధికారుల దృష్టికి తెచ్చారు. మండలంలోని 13 పంచాయతీల్లో ఇప్పటివరకు సుమారు రూ.5 కోట్ల మేర నిధులు ఖర్చు చేశారు. చాలాచోట్ల మొక్కల పెంపకం చేపట్టకుండానే లబ్ధిదారుల పేరిట నిధులు స్వాహా చేశారు. ఈ విషయాన్ని ఉపాధి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి చర్యలు చేపట్టారు. మంత్రి సీరియస్ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సీపట్నం నియోజకవర్గంలో ఈ తరహా అవినీతి జరగడంపై ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీనిలో భాగంగానే రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు తెలిసింది. బాధ్యులందరిపై చర్యలు మండలంలోని ఉపాధి పనుల్లో భారీ స్థాయిలో జరిగిన అక్రమాల్లో బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నట్టు ఎంపీడీవో బలరాముడు తెలిపారు. అక్రమాలపై మరింత లోతుగా దర్యాప్తు జరిపేందుకు ఏయూ విద్యార్థులను నియమించినట్లు ఆయన వివరించారు. -
పంచాయతీలకు పట్టం
సాక్షి,విశాఖపట్నం : పంచాయతీల పరిపుష్టి కోసం ఎన్నినిధులు వెచ్చించేందుకైనా సిద్ధంగా ఉన్నామని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. ఏయూలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో నిర్మల్ గ్రామ పురస్కారాల బహుమతుల ప్రదానోత్సవం శని వారం ఘనంగా జరిగింది. రాష్ర్ట వ్యాప్తంగా 27 పంచాయితీలకు ఈ అవార్డులు ప్రదానం చేయగా, విశాఖజిల్లాలో ఎనిమిది పంచాయితీలకు ఈ అవార్డులు మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడులు అంద జేశారు. జిల్లాలోని అచ్యుతాపురం మండలం చీమలపల్లి, దీపర్ల, సోమవరం, ఎర్రవరం, మునగపాక మండలం అరబుపాలెం, పాయకరావుపేట మండలం కేశవర ం, కొత్తూరు, రాజగోపాల పురం పంచాయితీసర్పంచ్లను ఈసందర్భంగా మంత్రులు దుశ్సాలు వాలు కల్పి ఘనంగా సత్కరించారు. రూ.22లక్షల చెక్‌లను ఆయా పంచాయితీ సర్పంచ్‌లకు అందజేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి అయ్యన్న మాట్లాడుతూ స్వచ్చభారత్, స్వచ్చాంధ్రప్రదేశ్ కార్యక్రమాల్లో భాగంగా అన్ని పంచా యితీల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు, త్రాగునీటి సౌకర్యం, రోడ్ల అభివృద్ధి, విద్యుత్, భూగర్భడ్రైనేజీ తదితర అంశాలపై దృష్టి పెట్టామన్నారు. ఈ ఏడాది 27 పంచాయితీ లకు కేంద్రం రూ.1.20కోట్లు కేటాయించిందన్నారు. 2014-15లో నిర్మల్ పురస్కా రాలకు కొత్త గైడ్‌లైన్స్ ప్రకటించిందన్నారు. పంచాయితీల్లోడంపింగ్ యార్డుల నిర్మాణానికి రూ.2లక్షల నుంచి రూ.10లక్షల వరకు కేటాయిస్తున్నామన్నారు. మంత్రి గంటా మాట్లాడుతూ గతంలో నిర్మల అవార్డుల ప్రదానం హైదరాబాద్‌లో సాదాసీదాగా జరిగేదన్నారు. తొలిసారిగా సర్పంచ్‌లను ఘనంగా సత్కరించేందుకు విశాఖలోరాష్ర్ట స్థాయి వేడుకను ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, కేఎస్ఎన్ఎస్ రాజు, వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్‌రాజు, కలెక్టర్ ఎన్.యువరాజ్, డీపీఒ వెంకటేశ్వరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ టి.ప్రభాకరరావు, డ్వామా పీడీ శ్రీరాముల నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
'పార్టీని అమ్ముకున్నవారు విమర్శించడం విడ్డూరం'
కైకలూరు (కృష్ణాజిల్లా) : పార్టీని హోల్‌సేల్‌గా అమ్మేసుకుని కాంగ్రెస్ చెంతకు చేరిన చిరంజీవికి సీఎం చంద్రబాబును రాజీనామా చేయమనే అర్హత లేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సిహెచ్.అయ్యన్నపాత్రుడు విమర్శించారు. కృష్ణాజిల్లా కైకలూరులో శనివారం పుష్కర యాత్రికులకు ఎంపీ మాగంటి బాబు ఏర్పాటు చేసిన ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పుష్కరాల మొదటి రోజు జరిగిన ఘటన గురించి చిరంజీవి టీవీల ముందు మాట్లాడారే కానీ, రాజమండ్రి వచ్చి బాధితులను పరామర్శించలేదన్నారు. అనంతపురం జిల్లాలో పర్యటన చేస్తున్న రాహుల్ గాంధీ.. ఉపాధి హామీ పథకంపై విమర్శలు చేయడం తగదన్నారు. ఈ పథకాన్ని కాంగ్రెస్ పాలనలోనే ప్రారంభించారనే విషయం తెలుసుకోవాలన్నారు. అప్పట్లో ఆ పార్టీ నాయకులకు ఉపాధి హామీ పథకం ఆర్థిక వనరుగా మారిందన్నారు. తాను వచ్చిన తర్వాత కేంద్రంతో మాట్లాడి ఈ నిధులతో గ్రామాల్లో స్థిరాస్తులను పెంచడానికి కృషి చేశానన్నారు. డ్వాక్రా సంఘాలను రాహుల్ తల్లిదండ్రులు ఏర్పాటు చేయలేదని, చంద్రబాబు రూపొందించారని తెలుసుకోవాలన్నారు. ప్రతిపక్ష నేత జగన్ మంచి సూచనలు చేస్తే తప్పక పరిశీలిస్తామన్నారు. రాష్ట్రానికి 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.16 వేల కోట్లు రానున్నాయని చెప్పారు. వాటిలో సగం నిధులు తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్‌లకు ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి మేజర్ పంచాయతీకి చెత్త సేకరణ ట్రాక్టర్‌ను అందిస్తామన్నారు. -
పుష్కర స్నానమాచరించిన అమాత్యులు
గోష్పాదక్షేత్రం (కొవ్వూరు) : కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో బుధవారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎంపీ మురళీమోహన్ పుష్కర స్నానం ఆచరించారు. మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ పుష్కరాలలో పారిశుధ్య పరిస్థితులపై అప్రమత్తంగా ఉంటూ పటిష్ట చర్యలు తీసుకోవడంలో కలెక్టర్, పంచాయతీరాజ్ సిబ్బంది ఎనలేని కృషిచేస్తున్నారని కొనియూడారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. జిల్లాలోని అన్నిశాఖల అధికారులు అందిస్తున్న సేవలతో పాటు గతంలో ఎన్నడూ లేనివిధంగా స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎంపీ మురళీమోహన్ మాట్లాడుతూ గోదావరి తల్లి అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నానన్నారు. పుష్కర స్నానమాచరించిన ఆయన పిండ ప్రదాన షెడ్డు వద్ద పితృదేవతలకు క్రతువులు నిర్వహించారు. -
జలజలా వచ్చి.. జలమ్మను అర్చించి
జడివాన సవ్వడి చేసింది. పుష్కర యాగాన్ని చూసే యోగం దక్కిందన్నట్టుగా వరుణుడు కుండపోత వర్షం కురిపించాడు. తడిసి ముద్దవుతూనే గోదారమ్మ చెంతకు జనకోటి జలజలా తరలివచ్చింది. జలదేవత గోదారమ్మకు ప్రణమిల్లింది. పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, వస్త్రాలు సమర్పించి ఆ ఆమ్మను అర్చించింది. పావన వాహిని మహాపర్వం మొదలై తొమ్మిది రోజులైనా యాత్రికుల సందడి ఏమాత్రం తగ్గలేదు. సాక్షి ప్రతినిధి, ఏలూరు : జోరు వానలోనూ భక్తజనం పోటెత్తింది. బుధవారం భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు పుష్కర పుణ్యస్నానాలు ఆచరించారు. జిల్లాలోని అన్ని ఘాట్లవద్ద యాత్రికుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. జిల్లాలో పుష్కర స్నానాలు ఆచరించే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. కుండపోత వర్షం కురవడంతో పుష్కర ఏర్పాట్లలోని డొల్లతనం బయటపడింది. పుష్కరాలు ప్రారంభమైన తర్వాత అడపాదడపా ఓ మాదిరి వర్షాలు కురిసినా బుధవారం ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో పుష్కర యాత్రికులు అవస్థలకు గురయ్యారు. జూలై నెలలో వర్షాలు భారీగా పడతాయని తెలిసినప్పటికీ అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేయలేకపోయారు. ఫలితంగా బుధవారం వేకువజామునుంచి మధ్యాహ్నం వరకు కుంభవృష్టిగా కురిసిన వర్షంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. కొవ్వూరు బురదమయం బుధవారం అర్ధరాత్రి 2 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు కొవ్వూరు పట్టణం బురదమయంగా మారింది. గోష్పాద క్షేత్రంలోని ప్రధాన ఘాట్‌తోపాటు మిగిలిన 9 ఘాట్లలో నీరు నిలిచిపోయింది. వేలాది మంది భక్తులు బురదలోనే పుష్కర స్నాలు ఆచరించి పిండప్రదాన కార్యక్రమాలు నిర్వహించారు. కొన్ని ఘాట్లలో పిండప్రదాన షెడ్లు సరిపోకపోవడంతో ఇటీవలే టెంట్లు వేశారు. అవన్నీ వర్షానికి ఆ తడిసి.. లోనికి వాననీరు చేరడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అనేక మంది బురదలోనే పిండప్రదానాలు నిర్వహించారు. దుస్తులు మార్చుకోవడానికి ఏర్పాటు చేసిన టెంట్లు కూడా తడిసిపోవడంతో మహిళలు ఇబ్బందులు పడ్డారు. అలాగే తాత్కాలిక బస్టాండ్ పూర్తిగా బురదతో నిండిపోవడంతో భక్తులు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైల్వేస్టేషన్ రోడ్డు సహా పట్టణంలోని ప్రధాన రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. జిల్లా ఇన్చార్జి మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎంపీ మాగంటి మురళీమోహన్ గోష్పాద క్షేత్రంలో పుష్కర స్నానాలు ఆచరించారు. నరసాపురంలో అవస్థలు నరసాపురం పట్టణంలో పుష్కర యాత్రికుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు స్నానాలు చేస్తూనే ఉన్నారు. దీంతో ఘాట్లకు వెళ్లే రహదారులు కిక్కిరిసిపోయాయి. వర్షం కారణంగా పిండప్రదానాలు చేసుకోవడానికి సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నా రు. ఆరుబయట గొడుగులు వేసుకుని ఈ తంతును కష్టం మీద పూర్తి చేసుకున్నారు. పారిశుధ్య నిర్వహణలో లోపా లు యథావిధిగా కొనసాగుతున్నాయి. వలంధర రేవులోని వీఐపీ ఘాట్‌లో చెత్త పేరుకుపోయి దుర్గంధం వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. సిద్ధాంతంలో బురద వరద పెనుగొండ మండలం సిద్ధాంతంలోని ఘాట్లు వర్షంలోనూ భక్తులతో కిక్కిరిశాయి. కేదారీఘాట్ వద్ద ఉదయం నుంచే రద్దీ కనిపించింది. వర్షం కారణంగా ఘాట్లకు వెళ్లే రహదారులు బురదగా మారిపోయాయి. హిందూ ప్రతిష్టాక్ పీఠాధిపతి కమలానంద భారతీస్వామి కేదారీ ఘాట్‌లో పుణ్యస్నానం చేశారు. కూలిన టెంట్లు పెరవలి మండలంలోని ఘాట్లలో భారీ వర్షానికి పిండ ప్రదాన షెడ్లు, టెంట్లు కూలిపోయాయి. ఘాట్లకు వెళ్లే రహదారులు బురదగా మారి అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులే రంగంలోకి దిగి ఇసుక పొరలు వేశారు. ఖండవల్లి, ఇమ్మిడివారిపాలెం, కానూరు అగ్రహారం, ఉసులుమర్రు ఘాట్లకు వెళ్లే రహదారులపై పేరుకుపోయిన బురదపై ఇసుక వేసి తాత్కాలికంగా ఇబ్బందులను తొలగించారు. పట్టిసీమ క్షేత్రానికి రాకపోకలు బంద్ నీటిమట్టం పెరగడంతో పోలవరం మండలంలో భక్తుల ఇబ్బందులు రెట్టింపయ్యాయి. పట్టిసీమ లాంచీల రేవులోని ప్లాట్‌ఫామ్‌లు నీట ముని గాయి. దీంతో మధ్యాహ్నం నుంచి లాంచీల రాకపోకలను నిలిపివేశారు. ఇసుక బస్తాలు వేసి ప్లాట్‌ఫామ్‌ను మెరక చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. పుణ్య పుష్కర స్నానం అనంతరం పట్టిసీమ క్షేత్రాన్ని దర్శించుకోవాలనుకునే వారికి నిరాశ ఎదురైంది. ప్రమాదకరంగా ఘాట్లు నిడదవోలు మండలంలోని కల్యాణ్ఘాట్లో ప్లాట్‌ఫామ్ రాళ్లు పైకి లేచిపోయి స్నానాలు దిగిన భక్తులు గాయాల పాలవుతున్నారు. ఆచంట మండలం భీమలాపురం, కరుగోరుమిల్లి ఘాట్లలో వర్షం కారణంగా పిండ ప్రదానాలు చేసుకునే వీలు లేక ఇబ్బం దులు ఎదుర్కొన్నారు. యలమంచిలి మండలంలో ఘాట్లకు వెళ్లే రహదారులు బురదతో నిండిపోయినా భక్తుల రాక ఏమాత్రం తగ్గలేదు. -
ఉపాధి పనులకు 25 శాతం అదనపు కూలీ
కొయ్యూరు: ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉపాధి హామీలో పని చేసే కూలీలకు 25 శాతం అదనంగా కూలీ చెల్లించనున్నట్టు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. దీని కోసం రూ.450 కోట్ల అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. ఏప్రిల్, మేలో 30 శాతం, జూన్‌లో 20 శాతం (సగటున 25 శాతం) అదనంగా చెల్లిస్తామన్నారు. రానున్న ఐదేళ్లలో రాష్ర్టంలో ఐదు కోట్ల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్ణయించినట్టు తెలిపారు. అందుకోసం నర్సరీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతులు తమకు అవసరమైన మొక్కలను నర్సరీల నుంచి తీసుకె ళ్లవచ్చన్నారు. కొయ్యూరులో ఆదివారం జరిగిన దివంగత మాజీ ఎమ్మెల్యే ఎం.వి.వి.సత్యనారాయణ కుమారులు అశోక్, గౌతమ్‌ల వివాహానికి మంత్రి హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం పాడేరు నియోజకవర్గానికి రూ.12 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఈ ఏడాది లక్షా 50 వేల హెక్టార్లలో రైతులకు అవసరమైన మొక్కలు సరఫరా చేస్తామన్నారు. గంధం మొక్కలను కూడా రైతులకు సరఫరా చేస్తామని చెప్పారు. ఇందు కోసం రూ.13 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. భూగర్భ జలాల పెంపునకు చర్యలు భూగర్భ జలాలను పెంచేందుకు వీలుగా నీరు- చెట్టు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. దీన్ని ఐదేళ్ల పాటు కొనసాగిస్తామన్నారు. దీనిలో భాగంగా మొదటి విడతలో జిల్లాలోని 438 చెరువులను రూ.13 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. వాటిని బాగు చేయడం ద్వారా వర్షాకాలంలో నీటిని నిల్వ చేసుకుని భూగర్భ జలాలను పెంచుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మణికుమారి, ఎం.వి.ఎస్.ప్రసాద్, ఎంపీపీ లక్ష్మీనారాయణ, కొయ్యూరు ఎంపీపీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
వ్యాపారం కోసం ఎక్కడ్నుంచో రాలేదు
మంత్రి గంటాపై అయ్యన్న పరోక్ష విమర్శలు,వాగ్బాణాలు వారు పార్టీలో ఎన్నాళ్లుంటారో తెలీదు... నేను మాత్రం పార్టీలోనే ఉంటా మాడుగుల నియోజకవర్గంలో పర్యటన గంటా వర్గాన్ని నేరుగా టార్గెట్ చేసిన మంత్రి కె.కోటపాడు : ‘నేను కొందరిలా ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి రాలేదు. వ్యాపారం కోసం వచ్చినవాడిని కాను. వాటి కోసం రాజకీయాలు చేస్తున్నవాడిని కాదు. వ్యాపారాల కోసం రాజకీయాల్లోకి వచ్చిన వారు ఎన్నాళ్లుంటారో...ఏ పార్టీలో ఉంటారో నాకు తెలీదు. నేను మాత్రం 34ఏళ్లుగా టీడీపీలోనే ఉంటున్నా. రాజకీయ కుటుంబంలో పుట్టాను. రాజకీయాల్లో పెరిగాను. ఎన్టీఆర్ యూనివర్సిటీలో క్రమశిక్షణ నేర్చుకున్నాను’అని మంత్రి అయ్యన్న పాత్రుడు పరోక్షంగా మంత్రి గంటా శ్రీనివాసరావుపై విమర్శలు, వాగ్బాణాలు గుప్పించారు. మంత్రి గంటా, ఎంపీ అవంతి శ్రీనివాస్‌ల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ మాడుగుల నియోజకవర్గంలో శుక్రవారం పలు అధికారిక కార్యక్రమాల్లో మంత్రి అయ్యన్న పాల్గొన్నారు. పార్లమెంటు సమావేశాలు కారణంగా మాడుగుల నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిలుపుదల చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ యువరాజ్‌కు ఎంపీ శ్రీనివాస్ ఇటీవల లేఖ ద్వారా తెలిపారు. ఈ నేపథ్యంలో ఎంపీ లేకుండానే కె.కోటపాడు మండలం ఆనందపురంలో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి అయ్యన్నను పూలమాలలతో కార్యకర్తలు సన్మానిస్తున్న సమయంలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. కె.కోటపాడులో పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. దేవరాపల్లిలో స్త్రీశక్తి భవనాన్ని ప్రారంభించారు. అనంతగిరి మండలంలో మినీ జలాశయాన్ని ప్రారంభించి నీళ్లు విడిచిపెట్టారు. అనంతరం ‘నీరు-చెట్టు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చీడికాడలో పంచాయతీ భవనాన్ని ప్రారంభించి రక్షితమంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు. మాడుగులలో రూ.1.09కోట్లతో వివిధ పనులకు శంకుస్థాన చేశారు. ఈ సందర్భంగా కె.కోటపాడు, దేవరాపల్లి, చీడికాడ, మాడుగులలో నిర్వహించిన సభల్లో మంత్రి అయ్యన్న మాట్లాడుతూ మంత్రి గంటా, ఆయన వర్గంపై పరోక్షంగా చేసిన విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు తీవ్ర ఆసకి ్తకలిగించాయి. కె.కోటపాడులో నిర్వహించిన సమావేశంలో మంత్రి అయ్యన్న తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఇలా అన్నారు...‘ టీడీపీలో ప్రతి కార్యకర్తను పేరుపెట్టి పిలిచేంత చనువు నాకుంది. నా విషయంలో కార్యకర్తలు ఆడంబరాలకు పోవాల్సిన అవసరం లేదు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన నాయకులను పూలమాలలతోనే సత్కరిస్తే వారి దృష్టిలో పడతామని కార్యకర్తలు భావిస్తారని కాని నా విషయంలో కార్యకర్తలు ఇటువంటి ఆడంబరాలు చేయాల్సిన అవసరం లేదు. పార్టీ ఓటమి చెందినా.. పదవులు లేకపోయినా టీడీపీలోనే ఉన్నాను. పదవుల కోసం పార్టీలు మారలేదు. పదవుల కోసం పార్టీలోనికి వచ్చిన వారు పార్టీలో ఉంటారోలేదో తెలియదు గాని తాను మాత్రం టీడీపీలోనే ఉంటాను. నియోజకవర్గంలో కార్యకర్తలు ఎవరి గురించి భయపడాల్సిన పని లేదు’అని అన్నారు. రానున్న రోజుల్లో ఎన్నికలు లేవు. కాబట్టి రాజకీయాలు చేయకుండా అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టిసారిద్దామని మంత్రి అయ్యన్న చెప్పారు. మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు ప్రతిపక్ష పార్టీకి చెందినవారైనప్పటికీ ఆయనతో కలసి నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తాననన్నారు. నర్సీపట్నంతో సమానంగా మాడుగుల నియోజకవర్గాన్ని అభివృద్ధిపరుస్తానని ప్రకటించారు.