
ప్రజలు తన్నడానికి సిద్ధంగా ఉన్నారు: అయ్యన్న
భూ దోపిడీదారులను విశాఖ ప్రజలు తరిమి తరిమి తన్నేందుకు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.
విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో శనివారం జరిగిన నవనిర్మాణ దీక్షలో పాల్గొన్న మంత్రి అయ్యన్న.. విశాఖ నగరంలో జరిగిన భూ కుంభకోణంపై స్పందించారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానని, దీనిపై తనకు ఎటువంటి నష్టం జరిగినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.