
ప్రారంభ సంరంభం
► తాత్కాలిక సచివాలయం వద్ద ఉద్యోగుల సందడి
► పాత రాజధాని నుంచి కొత్త రాజధానికి ...
► మూడు శాఖల కార్యాలయాలు ప్రారంభం
పీఆర్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న మంత్రి అయ్యన్నపాత్రుడు, చిత్రంలో ప్రధాన కార్యదర్శి టక్కర్
సాక్షి, అమరావతి : తాత్కాలిక సచివాలయం వద్ద ఉద్యోగుల సందడి నెలకొంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో సుమారు 200 మంది వివిధ శాఖల ఉద్యోగులు బుధవారం వెలగపూడికి చేరుకున్నారు. వారికి కనకదుర్గమ్మ వారధి వద్ద ఏపీ ఎన్‌జీఓ, వివిధ శాఖల సంఘాల అధ్యక్షులు, జిల్లా ఉద్యోగ సంఘాల నాయకులు స్వాగతం పలికారు. ఒకరిని ఒకరు పరిచయం చేసుకుని మధ్యాహ్నం 2.30 గంటలకు తాత్కాలిక సచివాలయానికి చే రుకున్నారు.అక్కడ నిర్మాణం లో ఉన్న తమ కార్యాలయాలను పరిశీలించారు. తుళ్లూరు మండలం వెలగపూడిలో 125 రోజులకు ముందు తాత్కాలిక సచివాలయ నిర్మాణంప్రారంభమైన విషయం తెలిసిందే. నిర్మాణానికి ఈ ప్రాంతం అనుకూలంకాదని నిపుణులు హె చ్చరించినా, టీడీపీ ప్రభుత్వం పట్టుబట్టి తాత్కాలిక సచివాల య నిర్మాణానికి పూనుకుంది. ఈనెల 27కు భవనాల నిర్మాణం పూర్తవుతుందని ముఖ్యమంత్రి, మంత్రులు పలుమార్లు ప్రకటిం చారు.
అందులో భాగంగా ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి మున్సిపల్ కార్మికులను తీసుకొచ్చారు. సుమారు రెండు వేల మంది కూలీలు రాత్రిం బవళ్లు పనులు చేశారు. అయితే వివిధ కారణాలతో తాత్కాలిక సచివాలయ పనులు పూర్తికాలేదు. దీంతో ఐదవ బ్లాక్‌లోని గ్రౌండ్‌ఫ్లోర్‌ను పూర్తిచేసి బుధవారం నుంచి నాలుగు శాఖల పాలనను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. చివరకు మూడు శాఖలకు సంబంధించిన కార్యాలయాలను హడావుడిగా ప్రారంభించారు.
నిరుత్సాహం ఉన్నా...
సుధీర్ఘ కాలం హైదరాబాద్‌లో పనిచేయడంతో ఉద్యోగులు వెంటనే అమరావతి తరలిరావడానికి విముఖత వ్యక్తం చేసినా, సొంత రాష్ర్టం కో సం పనిచేయాలనే ఉద్దేశంతో రాజధానికి వచ్చేం దుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో వెలగపూడికి తరలివచ్చారు. ఉద్యోగుల రాకతో వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం వద్ద సందడి నెలకొంది. వివిధ శాఖల్లో పనిచేసే సచివాలయ ఉద్యోగులు, జిల్లాలో పనిచేసే ఉద్యోగులు వారికి స్వాగతం పలకటం, ఒకరినొకరు పరిచయం చేసుకోవటంతో అంతా కోలాహలంగా మారింది. ఆ త రువాత నిర్మాణంలో ఉన్న తాత్కాలిక సచివాలయ భవనాలను పరిశీలించారు. ఏయే భవనంలో ఏ యే శాఖలు కొలువు తీరనున్నాయని అడిగి తెలుసుకున్నారు. తాము విధులు నిర్వహించే భవనాన్ని, గదులను ఉద్యోగులు క్షుణ్ణంగా పరిశీలించారు.