సచివాలయంలో టీడీపీ ఎమ్మెల్యేల ధర్నా, అరెస్ట్ | TDP MLAs dharna at Secretariat and arrest | Sakshi
Sakshi News home page

సచివాలయంలో టీడీపీ ఎమ్మెల్యేల ధర్నా, అరెస్ట్

Published Thu, Oct 24 2013 1:55 PM | Last Updated on Wed, Oct 3 2018 7:02 PM

TDP MLAs dharna at Secretariat and arrest

హైదరాబాద్ : వర్షాలు, వరదలు కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు గురువారం సచివాలయంలోని సీ బ్లాక్ వద్ద ఆందోళనకు దిగారు. రాష్ట్ర విభజనపై చూపుతున్న శ్రద్ధ... రైతులను ఆదుకోవటంలో చూపించటం లేదని వారు మండిపడ్డారు. తక్షణమే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
 
దాంతో ఆందోళనకు దిగిన ఎమ్మెల్యేలను పోలీసులు బలవంతంగా అక్కడ నుంచి తరలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి కేవలం సమీక్షలతోనే కాలం  గడుపుతున్నారని ఆరోపించారు. సీఎంను కలిసేందుకు వచ్చిన తమను అన్యాయంగా అరెస్ట్ చేయటం దారుణమని టీడీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement