రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అనంతపురం–అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే 393 కిలోమీటర్లని మొత్తం ఐదు జిల్లాల గుండా వెళుతుందని, దేశంలో ఉన్న ఎక్స్‌ప్రెస్ హైవేల్లో ఇది మూడోదని పేర్కొన్నారు.
‘అనంత’–అమరావతి మధ్య ఎక్స్‌ప్రెస్ హైవే
Published Wed, Aug 2 2017 1:42 AM | Last Updated on Mon, Sep 11 2017 11:01 PM
రహదారి పక్కనే రైలు మార్గం : మంత్రి అయ్యన్న వెల్లడి
సాక్షి, విశాఖపట్నం: అనంతపురం–అమరావతి మధ్య రూ.27 వేల కోట్లతో ఆరులేన్ల ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించనున్నట్టు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ రహదారికి సమాంతరంగా రైలు మార్గాన్ని కూడా నిర్మిస్తామని వెల్లడించారు. మంగళవారం విశాఖ కలెక్టరేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

Advertisement