Train route
-
రూ.883కోట్లతో అమరావతికి రైల్వేలైన్
సాక్షి, విజయవాడ/సాక్షి, అమరావతి: రాజధాని అమరావతికి రూ.883 కోట్లతో రైలు మార్గం నిర్మాణానికి సవివరమైన నివేదికలను రైల్వే బోర్డుకు పంపామని, త్వరలోనే అనుమతులు వస్తాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ ఆశాభావం వ్యక్తంచేశారు. రెండు లైన్లకు సరిపడా అమరావతి మార్గానికి భూసేకరణ జరుగుతుందని, అయితే.. తొలుత సింగల్ లైన్ నిర్మిస్తామని, డిమాండ్‌ను బట్టి రెండో లైను ఏర్పాటుచేస్తామని ఆయన వివరించారు. విజయవాడ, గుంటూరు, గుంతకల్ రైల్వే డివిజన్ల పరిధిలోని పార్లమెంట్ సభ్యులతో మంగళవారం విజయవాడలో రైల్వే జీఎం సమావేశమయ్యారు. అనంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న రెండేళ్లలో దక్షిణ మధ్య రైల్వే జోనంతా విద్యుదీకరణ పనులు పూర్తవుతాయని వివరించారు. తిరుపతి రైల్వేస్టేషన్‌ను రూ.400 కోట్లతో పీపీపీ పద్ధతిలో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు టెండర్ల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించామన్నారు. అక్కడ 8 అంతస్తుల బడ్జెట్ హోటల్‌ను నిర్మిస్తామన్నారు. అలాగే, విజయవాడ, గుంటూరు, గుంతకల్, కర్నూల్ రైల్వేస్టేషన్లను కూడా 2019 మార్చి నాటికి పూర్తిగా ఆధునీకరిస్తామని జీఎం వివరించారు. గుంటూరు–గుంతకల్ సెక్షన్ విద్యుదీకరణ పూర్తయి, డబ్లింగ్ పనులు జరుగుతున్నాయని, విజయవాడ–విశాఖ మూడో లైన్, నడిగుడి–శ్రీకాళహస్తి రైలు మార్గం పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. టీడీపీ ఎంపీల హైడ్రామా సమావేశానికి హాజరైన 12మంది టీడీపీ ఎంపీలు గందరగోళం సృష్టించారు. రాష్ట్రానికి రైల్వే జోన్ నివ్వాలంటూ సమావేశ మందిరంలో ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుకు అనుమతిచ్చే వరకూ ఏ సమావేశాలకు హాజరుకాబోమంటూ సమావేశాన్ని బహిష్కరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోది రాష్ట్ర విభజన హామీలను అమలుపర్చడంలేదని, రాష్ట్రంపట్ల వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపట్ల ఒడిశా అభ్యంతరం వ్యక్తం చేయకపోయినా, ఆ రాష్ట్రంపై నెపం నెట్టి జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ఆ తర్వాత అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు వారితో కలిసి రైల్వే జోన్ కావాలంటూ నినాదాలు చేశారు. కాగా, నాలుగేళ్లుగా రైల్వే జోన్ గురించి ప్రస్తావించని టీడీపీ ఎంపీలు ఇప్పుడు చివరి సమావేశంలో రభస చేయడాన్ని చూసి రైల్వే అధికారులు విస్తుబోయారు. అలాగే, ఏడాదికి ఒకసారి జరిగే దక్షిణ మధ్య రైల్వే బోర్డు సమావే«శంలో సాధారణంగా కొత్త ప్రాజెక్టులు, ప్రయాణికుల సమస్యలు, కొనసాగుతున్న ప్రాజెక్టుల్లోని ప్రగతి తదితర అంశాలపై చర్చ ఉంటుంది. అయితే, మంగళవారం నాటి బోర్డు సమావేశానికి టీడీపీ ఎంపీలు తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశానికో, మహానాడుకో బయల్దేరినట్లు మందీమార్బలంతో తమ వాహనాలకు పార్టీ జెండాలను కట్టుకుని వచ్చి హంగామా సృష్టించడం కూడా విమర్శలకు తావిచ్చింది. నెల్లూరు స్టేషన్‌ను ఏ–1గా గుర్తించాలి: ఎంపీ వేమిరెడ్డి వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్‌తో ఫోన్లో మాట్లాడారు. రైల్వే జోన్ ఇవ్వకపోవడంపై నిరసన తెలిపారు. నెల్లూరు స్టేషన్‌ను ఏ–కేటగిరి నుంచి ఏ–1 కేటగిరిగా మార్చాలని సూచించారు. కోరమాండల్, తమిళనాడు, గంగాకావేరి ఎక్స్‌ప్రెస్‌లను నెల్లూరులో ఆపాలని, ఏసీ, నాన్ ఏసీ డార్మెటరీలు ఏర్పాటుచేయాలని కోరారు. చెన్నై–నెల్లూరు మధ్య మెమూ రైలు రోజు కనీసం 8 సార్లు తిరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. -
‘అనంత’–అమరావతి మధ్య ఎక్స్‌ప్రెస్ హైవే
రహదారి పక్కనే రైలు మార్గం : మంత్రి అయ్యన్న వెల్లడి సాక్షి, విశాఖపట్నం: అనంతపురం–అమరావతి మధ్య రూ.27 వేల కోట్లతో ఆరులేన్ల ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించనున్నట్టు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ రహదారికి సమాంతరంగా రైలు మార్గాన్ని కూడా నిర్మిస్తామని వెల్లడించారు. మంగళవారం విశాఖ కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అనంతపురం–అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే 393 కిలోమీటర్లని మొత్తం ఐదు జిల్లాల గుండా వెళుతుందని, దేశంలో ఉన్న ఎక్స్‌ప్రెస్ హైవేల్లో ఇది మూడోదని పేర్కొన్నారు. -
నల్లగొండ–మాచర్ల రైలుమార్గం రీ సర్వే
దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ నల్లగొండ క్రైం: నల్లగొండ–మాచర్ల రైలు మార్గాన్ని రీ సర్వేచేస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్ చెప్పారు.గురువారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రయాణికుల భద్రతను మెరుగుపర్చేం దుకు చర్యలు తీసుకుంటామని తెలి పారు. మఠంపల్లి–జాన్‌పహాడ్ రైలు మార్గం పనులు మార్చి వర కు పూర్తి అవుతాయని పేర్కొ న్నారు. అనంతరం కొత్త రైళ్లను ప్రవేశపె డతామన్నారు. నడికుడి–శ్రీకాళహస్తి రైలు మార్గానికి అక్కడి ప్రభుత్వం 50 శాతం నిధులు సమకూర్చుతుం దని తెలిపారు. పిడుగు రాళ్ల– రొంపిచర్ల లేన్ల పనులను రూ.90 కోట్లతో చేపట్టి, 2018 నాటికి పూర్తి చెస్తామని చెప్పారు. విద్యుత్ లైన్ ఏర్పాటు పనుల కు టెండర్లు ఖరారు చేశామని, 2019–20 నాటికి çపూర్తి చేస్తామని వివరించారు. -
‘ఆల్ప్స్’ అడుగున రైలు మార్గం
జెనీవా: ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ రైలు మార్గానికి సర్వం సిద్ధమైంది. స్విట్జర్లాండ్‌లోని ప్రఖ్యాత ఆల్ప్స్ పర్వతాల కింద నిర్మిస్తున్న ‘గోథార్డ్ బేస్ టన్నెల్’ సొరంగ మార్గం దాదాపు పూర్తయింది. ఈ రైలు మార్గం పొడవు 57.4 కిలోమీటర్లు. యురీ దగ్గర్లోని ఎస్ట్ఫీల్డ్ నుంచి టిసినో సమీపంలోని బోడియో ప్రాంతానికి రైలు మార్గాన్ని నిర్మించారు. రెండు లేన్ల ఈ మార్గానికి రూ.82,000 కోట్లు ఖర్చయింది. సొరంగ తవ్వకాల్లో భాగంగా 2.8కోట్ల టన్నుల శిలలను తొలగించారు. కొత్త మార్గంలో జ్యూరిక్-మిలాన్ మధ్య రాకపోకలకు గంట సమయం తగ్గనుంది. పెద్దమొత్తంలో సరకు రవాణాకు ఈ మార్గం దోహదపడనుంది. 1947లోనే ఈ మార్గాన్ని నిర్మించాలని స్విస్ ఇంజనీర్ కార్ల్ ఎడ్వర్డ్ గ్రూనర్ ప్రణాళికలు రచించినప్పటికీ 1999 సంవత్సరంలోగానీ ప్రాజెక్టుకు అంకురార్పణ జరగలేదు. జూన్ 1న ప్రారంభవేడుక జరగనుంది. సర్వీసులు డిసెంబర్లో మొదలుకానున్నాయి. -
విరిగిపడిన కొండ చరియలు
- కేకే లైన్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం - విశాఖ-కిరండూల్ పాసింజర్ రద్దు అరకులోయ/అనంతగిరి: కొత్తవలస-కిరండూల్ రైలు మార్గంలో పట్టాలపై గురువారం రాత్రి కొండచరియలు విరిగిపడ్డాయి. అనంతగిరి మండలం శిమిలిగుడ స్టేషన్ సమీపంలోని 82/15 నుంచి 82/17 మైలు రాయి మధ్య ఈ సంఘటన చోటుచేసుకుంది. పట్టాలపై రాళ్లు, మట్టిపేరుకుపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాత్రిపూట పెట్రోలింగ్ విధుల్లో ఉన్న తిరుపతి అనే ఉద్యోగి దీనిని గుర్తించి రైల్వే అధికారులకు సమాచారం అందించారు. ప్రత్యేక రైలులో సంఘటన స్థలానికి అధికారులు ఎకాయెకిన చేరుకున్నారు. రెండు పొక్లెయినర్లను రప్పించి పట్టాలపై పేరుకుపోయిన రాళ్లు, మట్టి తొలిగించారు. విశాఖ నుంచి కిరండూల్ వెళ్తున్న గూడ్స్ రైలును వెనక్కి మళ్లించారు. కిరండూల్ నుంచి శిమిలిగుడ వరకు పలు గూడ్స్ రైళ్లను నిలిపివేశారు. విశాఖ-కిరండూల్ పాసింజర్ రైలును శుక్రవారం రద్దు చేశారు. సాయంత్రానికి కొండచరియలను తొలిగించి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. ఏటా ఇదే సమస్య: వర్షాలప్పుడు కేకేలైన్‌లో ఏటా ఇదే పరిస్థితి చోటుచేసుకుంటోంది. రైల్వే శాఖకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. వర్షాకాలం వచ్చిందంటే కరకవలస నుంచి బొడ్డవర రైల్వే స్టేషన్ వరకు ఏదో ఒక చోట ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం పరిపాటిగా మారుతోంది. గతేడాది డిసెంబర్లో ఇదే ప్రాంతంలో పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడి కిరండూల్ పాసింజర్ రైలు ప్రయాణికులు నరకయాతనకు గురయ్యారు. ఈనెల 17వ తేదీ బుధవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడి విశాఖ నుంచి దమన్‌జోడి వెళుతున్న గూడ్స్ రైలు బోగి పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. కొండచరియలు విరిగిపడే ప్రాంతాలను గుర్తించి గతంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం అటువంటి ముందస్తు చర్యలు చేపట్టినట్టు లేదు. రైల్వే ఉన్నతాధికారులు స్పందించి అటువంటి ప్రాంతాలను గుర్తించి వర్షాకాలానికి ముందుగానే చర్యలు చేపడితే బాగుంటుందన్న వాదన ఉంది. -
పవర్ ప్లాంట్‌తో అభివృద్ధి
మణుగూరు : మణుగూరులో పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలనే ప్రజల చిరకాల కల నెరవేరబోతోందని, ఈ ప్రాజెక్టు వల్ల నియోజకవర్గం మరింత అభివృద్ధి సాధిస్తుందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మణుగూరులోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొండికుంట ప్రాంతంలో ఎప్పుడో ఏర్పాటు చేయాల్సిన ఎన్టీపీసీ ఇతర ప్రాంతాలకు తరలిపోయిందని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి అసెంబ్లీ సమావేశాల్లో తాను మణుగూరులో విద్యుత్ ప్రాజెక్టుకు కావాల్సిన అన్ని రకాల వసతులు బొగ్గు, రైలు మార్గం, నీటి వసతి ఉన్నాయని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని అన్నారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మణుగూరులో పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. మణుగూరు, పినపాక మండలాల సరిహద్దుల్లో పవర్ ప్లాంట్ ఏర్పాటుకు పనులు యుద్ధప్రాతిపదిక జరుగుతున్నాయని అన్నారు. ఎక్కడ లేని విధంగా ప్రత్యేక జీఓతో ఆర్ఆర్ ప్యాకేజీ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని అన్నారు. ఇప్పటికే ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల్లో పర్యటించి అక్కడి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానని అన్నారు. ప్రతి కుటుంబంలో 18సంవత్సరాలు నిండినవారందరికి ప్యాకేజీ ఇస్తారని, పరిహారం రూ. 5లక్షలు ఇస్తారని అన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా తాను రైతులందరికి న్యాయం జరిగేలా చూస్తానన్నారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. కొందరు కావాలనే రాజకీయాలు చేస్తూ ప్రాజెక్టును విచ్చిన్నం చేసేందుకు యత్నిస్తున్నారని, ప్రజలు అటువంటి వారి మాటలను నమ్మి మోసపోవద్దని అన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కీసర శ్రీనివాసరెడ్డి, వట్టం రాంబాబు, మండల నాయకులు ఆవుల నర్సింహారాావు, మేడ నాగేశ్వరరావు, గాండ్ల సురేష్, కంచర్ల గురునాధం, ఎంపీటీసీ ఈసాల ఏడుకొండలు, శ్రీనివాస్, తిరుమలేష్, రంజిత్ పాల్గొన్నారు.