
సాక్షి, శ్రీకాకుళం: కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నందమూరి తారక రామారావు స్థాపించిన టీడీపీని చంద్రబాబు భూస్థాపితం చేసారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తమ్మినేని సీతారాం విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... టీడీపీ నిర్వహిస్తుంది మహానాడు కాదు మాయనాడు అని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ కోవర్టుగా చంద్రబాబు పనిచేసారని ఆరోపించారు. ఇప్పుడు రాహుల్ గాంధీతో చేతులు కలిపి టీడీపీకి భస్మాసుర హస్తాన్ని చూపిస్తున్నారని అన్నారు. నిజమైన ఎన్టీఆర్ వారసులు టీడీపీలో ఉంటే కాంగ్రెస్ పార్టీతో దోస్తిని వ్యతిరేకించి ఉండేవారని పేర్కొన్నారు. చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నట్టుగా స్వాతంత్ర్యం పేరు చెప్పి దేశాన్ని కాంగ్రెస్ పార్టీ దగా చేస్తోందని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment