
తమ్మినేని సీతారాం (ఫైల్ ఫోటో)
మల్లెల బాబ్జీకి పట్టిన గతే ఇప్పుడు శ్రీనివాస్‌కు కుడా పడుతుందనే అనుమానం..
శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హత్యయత్నం ఘటనపై రాష్ట్ర పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయలేకపోతున్నారని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం మండిపడ్డారు. కుట్రలో శివాజీ కూడా భాగస్వామి అని అతనిని ఎందుకు విచారించడంలేదని ప్రశ్నించారు. దీనిపై ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎయిర్‌పోర్టులో సీసీ టీవీ పుటేజీని ఎందుకు బయటపెట్టడం లేదన్నారు.
గతంలో మల్లెల బాబ్జీకి పట్టిన గతే ఇప్పుడు శ్రీనివాస్‌కు కుడా పడుతుందనే అనుమాలున్నాయని వ్యాఖ్యానించారు. తమకు సిట్‌పై నమ్మకం లేదని, ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. హత్యాయత్నం ఘటనపై థర్డ్ పార్టీ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ఆయన ప్రశ్నించారు.