సాక్షి, శ్రీకాకుళం: దేశ చరిత్రలోనే నెల తిరగక ముందే తుపాను నష్ట పరిహారం రైతులకు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మూడవ విడత వైఎస్సార్ రైతు భరోసా కింద 51.59 లక్షల రైతుల ఖాతాల్లోకి 1,120 కోట్లు జమ చేశారని పేర్కొన్నారు. రైతు సంక్షేమం పట్ల సీఎం వైఎస్ జగన్ ఎంత నిబద్దత కలిగి ఉన్నారో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చన్నారు. ఇచ్చిన మాటకు సీఎం జగన్ కట్టుబడి పనిచేస్తున్నారని స్పీకర్ పేర్కొన్నారు. (చదవండి: రేపు విజయనగరం జిల్లాలో సీఎం జగన్ పర్యటన)
అప్పుల బాధలు తాళ్ల లేక గతంలో రైతుల ఆత్మహత్యల ఘటనలను సీఎం జగన్ గ్రహించారు. మళ్ళీ అలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు తక్షణమే ఆర్థిక సాయం అందిస్తున్నారు. ప్రజలను పాలించే వారికి మానవతావాదం ఉండాలని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా కంటే ఒక మానవతావాదిగా తనకు ఎంతో గౌరవమని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.(చదవండి: ‘అది చిడతల నాయుడికే చెల్లింది’)
Comments
Please login to add a commentAdd a comment