![YSRCP Leader Tammineni Seetharam Comments On TDP - Sakshi](/styles/webp/s3/article_images/2018/08/3/ta.jpg.webp?itok=eZLYx5fM)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం
సాక్షి, శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన సీఎం యువనేస్తం పథకానికి సీఎం యువ సంహారం అనే పేరు సరైనదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం అన్నారు. శుక్రవారం శ్రీకాకుళంలో ఏర్పాటుచేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాఖల వారీగా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నా, వేలమంది కాంట్రాక్టు కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించారని అన్నారు. 45 సంవత్సరాలు ఉద్యోగ అర్హత కల్పించి.. నిరుద్యోగ భృతి ఇచ్చేటప్పటికి 36 సంవత్సరాల వరకే అని నిబంధన పెట్టడం నిరుద్యోగులను మోసం చేయటమేనని అన్నారు. 1కోటి80లక్షల మంది నిరుద్యోగులు ఉంటే 12లక్షల మందికి భృతి ఇస్తామనటం దగా చేయడమేనని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment