![YSRCP Leader Tammineni Sitaram Fires On Chandrababu Over Farmers Problems - Sakshi](/styles/webp/s3/article_images/2018/06/29/Tammineni%20Sitaram.jpg.webp?itok=omKm6cLP)
సాక్షి, శ్రీకాకుళం : రాష్ట్రంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పిట్టలదొరలా వేషం వేసుకుని.. ఏరువాక పూజలు చేస్తే రైతులు నమ్మరని అన్నారు. రాష్ట్రంలో రైతాంగానికి సరిపడ విత్తనాలు సరఫరా చేయడం లేదని విమర్శించారు.
పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని, 85 వేల కోట్ల రూపాయల రుణ మాఫీ చేయాల్సి ఉండగా కేవలం 13 వేల కోట్లు మాత్రమే చేసి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు చంద్రబాబు చేసిన మోసం వల్ల వారి ఆర్థిక పరిస్థితి దెబ్బతిందని ఆయన మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment