తిరుపతితో టీడీపీ మహానాడు ప్రారంభం
తిరుపతి : టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం తిరుపతిలో మహానాడును ప్రారంభించారు. పార్టీ జెండను ఆవిష్కరించి, ఎన్టీఆర్కు నివాళులు అర్పించి మహానాడును ఆరంభించారు. తిరుపతిలోని పురపాలక మైదానంలో మూడు రోజుల పాటు మహానాడు జరగనుంది. అంతకు ముందు చంద్రబాబు మహానాడు ప్రాంగణంలో త్రీడీ షోతో పాటు, ఫోటో ఎగ్జిబిషన్ను ప్రారంభించారు.
మహానాడుకు ఏపీ, తెలంగాణతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి.. దుబాయ్, అమెరికా, యూకే తదితర దేశాల నుంచి సుమారు 30 వేల మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. కాగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర విభజన వంటి ఎన్నో అడ్డంకులను అధిగమించి ముందుకు సాగుతున్నామని, తమ పాలన అద్భుతంగా ఉందని గొప్పలు చెప్పుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.