
‘చంద్రబాబు, లోకేశ్ భజనకే పరిమితం’
విజయవాడ: చంద్రబాబు, లోకేశ్ భజనకే టీడీపీ మహానాడు పరిమితమైందని విజయవాడ నగర వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. టీడీపీ నిర్వహిస్తున్నది మహానాడు కాదు.. అది మయనాడు, మోసనాడు, వెన్నుపోటు నాడు అని ఎద్దేవా చేశారు.
ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... 10 శాతం హామీలను కూడా చంద్రబాబు అమలు చేయలేదని విమర్శించారు. కాపులను బీసీల్లో చేరుస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. బెల్టు షాపులను రద్దు చేస్తామన్నారు.. ఎక్కడైనా రద్దు చేశారా అని నిలదీశారు. రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ వాగ్దానం ఏమైందని అడిగారు.